Investment: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అత్యంత గడ్డు పరిస్థిని ఎదుర్కొంటున్నది ముఖ్యంగా ఐటీ రంగం అని చెప్పుకోవాలి. ఈ రంగంలోని చాలా కంపెనీలు భారీ పతనాన్ని చూస్తున్నాయి. ఉద్యోగుల కోత, రాజీనామాల నుంచి ఆదాయం పడిపోవటం వరకు అనేక కష్టాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. అయితే ఈ ట్రెండ్ ఎంతకాలం ఉంటుంది.. టెక్ కంపెనీల భవితవ్యం ఏమిటి అనే అనేక ప్రశ్నలు ఇన్వెస్టర్లను ప్రస్తుతం వేధిస్తున్నాయి.

టాప్ టెక్ కంపెనీలు..
ఇలాంటి గందరగోళం మధ్య దేశంలోని ప్రముఖ టెక్ కంపెనీలైన విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. విప్రో కంపెనీ షేర్లు గత సంవత్సరం డిసెంబర్ 3న రూ.715.20 వద్ద ఉండగా.. వాటి విలువ ప్రస్తుత సంవత్సరంలో దాదాపుగా 45 శాతం క్షీణించింది. దీంతో ప్రస్తుతం స్టాక్ ధర దాదాపుగా రూ.394.95 వద్ద ఉంది. అలాగే టీసీఎస్ షేర్ 11.45%, ఇన్ఫోసిస్ షేరు ధర 18.19% మేర క్షీణించి ఇన్వెస్టర్లకు ఆందోళన కలిగిస్తున్నాయి.

మాంద్యం భయాలు..
టెక్ షేర్లకు అంతర్జాతీయ రాజకీయ గ్రహణం పట్టిందని చెప్పుకోవాలి. దీని కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణంతో అమెరికా, యూరప్ మార్కెట్లు మాంద్యం భారిన పడ్డాయి. ఇది భారత్ తో పాటు అనేక వర్థమాన దేశాల అభివృద్ధిని, ఆదాయాలను ప్రభావితం చేసింది. ప్రాజెక్టులు తగ్గటం, అధిక అట్రిషన్ కారణంగా మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడులు కంపెనీలకు అధిక భారాన్ని మోపుతున్నాయి. ఇది నేరుగా కంపెనీల ఆదాయంపై ప్రభావాన్ని చూపుతోంది. మరీ ముఖ్యంగా అమెరికా, యూరప్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

ఐటీ రంగం..
ప్రస్తుత సంవత్సరం ఐటీ ఇండెక్స్ చాలా పేలవమైన పనితీరును కనబరిచింది. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 22.58%, నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 24.54% తగ్గటం దాని పనితీరుకు అద్ధం పడుతోందని నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఐటీ రంగంలోని షేర్లపై అసలు పెట్టుబడులు పెట్టాలా..? వద్దా..? అనే గందరగోళంలో రిటైల్ ఇన్వెస్టర్లు ఉన్నారు. కానీ చాలా మంది మాత్రం మాంద్యం కారణంగా పడిపోయిన ఐటీ షేర్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయటంపై నిశితంగా పరిశీలిస్తున్నారు.

2023కు సర్థుకుంటుందా..
డాలర్ తో రూపాయి మారకపు విలువ పడిపోవటం ఐటీ రంగానికి కొంత ఆర్థికంగా ఆదాయాన్ని పెంచుతోంది. ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకర స్థాయిలకు పడిపోలేదు కాబట్టి దేశీయ ఐటీ స్టాక్స్ తిరిగి పుంజుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ కంపెనీలు మంచి పోర్ట్ ఫోలియో స్టాక్స్ కావటంతో నూతన సంవత్సరం ఇవి తిరిగి గాడినపడవచ్చని ప్రాథమికంగా మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇన్ఫోసిస్ కు రూ.1,750 టార్గెట్ ధర, టీసీఎస్ కు రూ.4,650-5,050 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications