బడ్జెట్ రోజున శనివారం స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా ? ఇలా కలిసి రావడం చాలా అరుదు..
ప్రస్తుతం ప్రతిఒక్కరిలో ఉన్న ప్రశ్న బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుందా మూసేస్తుందా అని, ఎందుకంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను శనివారం 1 ఫిబ్రవరి 2025న ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ తేదీ వీకెండ్ కావడంతో వ్యాపారుల నుండి పెట్టుబడిదారుల వరకు అందరి మనస్సులో ఉన్న డౌట్ ఇదే. 23 డిసెంబర్ 2024న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్‌లో లైవ్ ట్రేడింగ్ సెషన్ కోసం స్టాక్ మార్కెట్లు ఓపెన్ ఉంటాయి అని ప్రకటించింది.
1 ఫిబ్రవరి 2025న ట్రేడింగ్ సమయాలు ఏంటి ?
*ఈక్విటీ మార్కెట్లు: ట్రేడింగ్ సాధారణ వేళల్లో ఉంటుంది అలాగే మధ్యాహ్నం 3:30 వరకు ఓపెన్ గా నడుస్తుంది.
*కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్: ట్రేడింగ్ కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అలాగే సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.
*చారిత్రక సందర్భం: బడ్జెట్ ప్రవేశపెట్టడం అండ్ మార్కెట్ కార్యకలాపాలు ఓపెన్ గా ఉండటం చాల అరుదైన సందర్భాలు.

అయితే కేంద్ర బడ్జెట్‌ను సాధారణంగా వారపురోజులు అంటే సోమవారం నుండి శుక్రవారం రోజులలో సమర్పించినప్పటికీ, వారాంతాల్లో అంటే శనివారం, ఆదివారం సమర్పించిన కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి:
28 ఫిబ్రవరి 2015: బడ్జెట్‌ను శనివారం ప్రవేశపెట్టారు. ఈ రోజున ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలు యథావిధిగా ట్రేడయ్యాయి.
27 ఫిబ్రవరి 2016: మళ్లీ బడ్జెట్ శనివారం రోజు వచ్చింది, అయితే ఈసారి స్టాక్ మార్కెట్లు మూసేసారు.
దీన్ని బట్టి వీక్ డేస్ లో ముఖ్యంగా బడ్జెట్ కోసం శనివారం స్టాక్ మార్కెట్ తెరవడం సందర్భానుసారంగా, రెగ్యులేటర్ ఆర్డర్ ప్రకారం ఉంటుందని తెలుస్తుంది.
బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలో మార్పు
సాంప్రదాయకంగా కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవారు, అయితే 2017 సంవత్సరంలో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చారు. ఇలా మార్పు చేయడంలో ప్రభుత్వంకి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు తీసుకున్న ఆర్థిక చర్యల అమలుకు ఎక్కువ సమయాన్ని కల్పిస్తుంది.
స్టాక్ మార్కెట్లు ఎందుకు ఓపెన్ ఉండాలి?
ఆర్థిక వ్యవస్థపై ఇంకా పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం కారణంగా బడ్జెట్ రోజున షేర్ మార్కెట్లు ఓపెన్ ఉండవచ్చు. 1 ఫిబ్రవరి 2025 స్టాక్ మార్కెట్ రోజు కేంద్ర బడ్జెట్‌లో చేసిన ప్రకటనలకు పెట్టుబడిదారులు, వ్యాపారులు రియల్ టైంలో ప్రతిస్పందించేందుకు స్టాక్ మార్కెట్‌లు తెరిచి ఉంటుంది.


Click it and Unblock the Notifications