Gold: బంగారం ఇప్పుడే కొనేయండి.. లేకుంటే ధర మరింత పెరుగుతుందట..!
బంగారం ధర గత రెండేళ్లుగా పెరుగుతూనే ఉంది. ఓ సమయంలో బంగారం ధర గరిష్ఠ స్థాయికి చేరుకుని కాస్త శాంతించింది. ప్రస్తుతం బంగారం ధర కూడా భారీగానే ఉంది. జూలై 15న 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ 770 పెరిగి రూ.1,43,570 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.700 పెరిగి రూ.1,31,600 కు చేరింది. ధర పెరుగుతున్నప్పటికీ బంగారానికి ఉన్న డిమాండ్ తగ్గడం లేదని చెబుతున్నారు. దేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారకం కూడా తగ్గుతుంది. అందుకే పసిడి కొనుగోలు తగ్గించాలని కేంద్రం సూచిస్తోంది.
అయినప్పటికీ పసిడికి డిమాండ్ తగ్గలేదు. బంగారానికి పెరుగుతున్న డిమాండ్, పశ్చిమ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు పసిడి పెట్టుబడి పెట్టడానికి మొగ్గు చూపడంతో బంగారం ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారానికి తాజాగా ఎస్బీఐ రీసెర్చ్ ఒక నివేదిక విడుదల చేసింది. భారతదేశంలో బంగారం ఖరీదవుతోందని పేర్కొంది. కానీ దిగుమతి విలువలో ఈ పెరుగుదలకు బలమైన వినియోగదారుల డిమాండ్ కారణం కాదని ఎస్‌బిఐ రీసెర్చ్ నివేదిక తెలిపింది. ప్రపంచ పరిణామాలే ధరల కదలికల్లో పెద్ద పాత్ర పోషిస్తున్నాయని తెలిపింది.

బంగారం దిగుమతి పరిమాణం, విలువ పరంగా విభిన్నంగా ఉందని ఎస్‌బిఐ రీసెర్చ్ పేర్కొంది. దిగుమతి పరిమాణాలు తక్కువగా ఉన్నప్పటికీ దిగుమతి బిల్లు వేగంగా పెరుగుతోందని తెలిపింది. బంగారం దిగుమతి కోసం 2025 ఆర్థిక సంవత్సరంలో 57.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే అది ఈ సంవత్సరం 72. 4 బిలియన్ డాలర్లకు పెరిగింది. కరెంట్ అకౌంట్ లోటు పై బంగారం ప్రభావం ఆందోళన కలిగించే విషయమని గుర్తు చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రభుత్వం బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 15 శాతానికి పెంచింది.
2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి విలువ పడిపోయింది. అప్పుడు క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ (CAD)ను నియంత్రించేందుకు భారత్ బంగారం దిగుమతి పన్నును 15 శాతానికి పెంచింది. ఈ నేపథ్యంలో బంగారం ధర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications