Gold: అలా జరిగితే బంగారం ధరలు కుప్పకూలడమే.. డైమండ్స్ విషయంలో ఇలానే జరిగింది..!
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న తరుణంలో గుడ్ న్యూస్ వచ్చింది. ల్యాబ్ లో బంగారం తయారు చేయవచ్చని ఓ అమెరికా స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. పాదరసం నుంచి స్థిరమైన బంగారాన్ని తయారు చేసినట్లు శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ సంస్థ ప్రకటించింది. అణు సంలీన ప్రక్రియలో ఉత్పత్తయ్యే న్యూట్రాన్లను ఉపయోగించి పసిడిని తయారు చేసినట్లు వివరించింది. ఒక వేళ ఈ విధానంతో భారీ బంగారం తయారు చేస్తే.. పసిడి ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కపుడు డైమండ్ కు భారీ ధరలు ఉండేవి.. ఎప్పుడైతే ల్యాబ్ గ్రౌన్ డైమండ్స్ వచ్చాయో.. అప్పటి నుంచి డైమండ్స్ ధరలు పడిపోయాయి. ఒక్కప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు వజ్రాల ధరలు భారీగా పడిపోయాయి. సహజ వజ్రాలకు ధరలు ఉన్నప్పటికీ వాటిని వాడే తగ్గిపోయారు. ఎక్కువగా ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ వాడుతున్నారు.
ఇప్పుడు బంగారం కూడా ల్యాబ్ తయారు చేసే ప్రక్రియ విజయవంతమైనట్లు తెలుస్తోంది. ఈ సాంకేతికతను ప్రపంచం మొత్తం అడప్ట్ చేసుకుంటే.. బంగారం ధరలూ భారీగా పడిపోయే అవకాశం ఉంది. అయితే ఇందుకు సమయం పట్టే అవకాశం ఉంది. పాదరసంతో పసిడి తయారీ అందరిలో ఆసక్తి పెంచుతోంది. సహజంగా బంగారంలో 79 ప్రోటాన్లు ఉండగా.. పాదరసంలో 80 ప్రోటాన్లు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాదరసం కేంద్రకంలో తగిన మార్పులు జరిగితే అది పసిడిగా మారే అవకాశం ఎక్కువగా ఉందని అంచా వేస్తున్నారు. పాదరసం బంగారంగా మార్చే ప్రక్రియను ట్రాన్స మ్యూటెషన్ అంటారు. సంలీన చర్యల ద్వారా ఉత్పత్తయ్యే అధిక శక్తి న్యూట్రాన్లు పాదరసం-198 కేంద్రకంపై ప్రభావం చూపుతాయని.. రేడియోధార్మిక క్షయానికి లోనై స్థిరమైన బంగారం-197గా మారుతుందని వివరిస్తున్నారు.

బంగారం-197 స్వచ్ఛత గనుల నుంచి లభించే బంగారంతో సమానంగా ఉంటుందని చెబుతున్నారు. 2025లో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (CERN) శాస్త్రవేత్తలు లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లో సీసం కేంద్రకాల మధ్య జరిగిన అధిక శక్తి పరస్పర చర్యల ద్వారా బంగారు కేంద్రకాలు ఏర్పడినట్లు గుర్తించారు. 2015 నుంచి 2018 మధ్య జరిగిన ప్రయోగాల విశ్లేషణలో అతి స్వల్ప పరిమాణంలో బంగారు కేంద్రకాలు ఉత్పత్తి అయినట్లు ప్రటించారు. అయితే అవి అత్యంత స్వల్పకాలం మాత్రమే నిలిచినట్లు పేర్కొన్నారు. తాజాగా మాత్రం బంగారు కేంద్రకాలు ఉత్పత్తి అయ్యి అలానే ఉన్నట్లు పేర్కొంటున్నారు.
ఈ విధానంలో టన్నుల కొద్ది బంగారం తయారు చేసే అవకాశం ఉందని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుత ప్రకటన ఆధారంగా అలాంటి నిర్ణయానికి రావడం తొందరపాటే మరి కొందరు పేర్కొంటున్నారు. మారథాన్ ఫ్యూజన్ సంస్థ కేవలం స్వతంత్ర ధృవీకరణ మాత్రమే. దీన్ని ఎవరు ఆమోదించలేదు. కానీ ల్యాబ్ లో బంగారం తయారు చేస్తే పసిడి ధరలు భారీగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. డైమండ్ ధరలు ఎలా తగ్గాయో.. బంగారం ధరలు కూడా అదే విధంగా తగ్గే అవకాశం ఉందంటున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications