మస్క్‌కు చుక్కలు చూపించనున్న అంబానీ.. జియో దెబ్బకు స్టార్‌లింక్ తట్టుకోగలదా..??
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో.. టెస్లా, ట్విట్టర్‌ల అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా తమ స్టార్ లింక్ సేవలను ఇండియాలో ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఇది కాస్తా.. ఇద్దరు ప్రపంచంలోని అత్యంత ధనవంతుల మధ్య బిజినెస్ వార్ కు దారితీయనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే, మస్క్ కు ముఖేష్ చుక్కలు చూపించడం ఖాయం.
దేశంలో ఇంటర్నెట్ లేదా హై-స్పీడ్ సేవలు అందుబాటులో లేని మారుమూల గ్రామాలకు వీటిని అందించేందుకు స్టార్ లింక్ ప్రభావవంతంగా పనిచేస్తుందని మస్క్ అభిప్రాయపడ్డారు. అయితే భారతీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో అధినేత ముఖేష్ అంబానీ నుంచి ఈ విషయంలో తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది.

స్పెక్ట్రమ్‌ను వేలం వేయకుండా అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా లైసెన్స్‌లను కేటాయించాలని స్టార్‌లింక్ లాబీయింగ్ చేస్తోంది. ఇది కంపెనీలు పంచుకోవాల్సిన సహజ వనరు అని పేర్కొంది. వేలం వేస్తే భౌగోళిక పరిమితులను వల్ల ధరలను పెంచాల్సి వస్తుందని అభిప్రాయపడినట్లు భారత ప్రభుత్వం బహిర్గతం చేసిన ఆ కంపెనీ లేఖలలో వెల్లడించిందిే.
అయితే విదేశీ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్లు వాయిస్ మరియు డేటా సేవలను అందిస్తూ, సాంప్రదాయ టెలికాం ప్లేయర్‌లతో పోటీ పడవచ్చని రిలయన్స్ పేర్కొంది. అందువల్ల ఒకే స్థాయి ఫ్టాట్‌ఫాం రూపొందించడానికి తప్పనిసరిగా వేలం జరగాలని పట్టుబడుతోంది. ఈ మేరకు బహిరంగ వేలం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరింది. తాజాగా ప్రధాని మోదీతో మస్క్ భేటీ కాగా.. ఈ విషయంలో భారత ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందో వేచి చూడాలి మరి!


Click it and Unblock the Notifications