దేశంలో పెట్రోల్, డీజిల్ భారీగా పెరిగాయి. గత కొంత కాలంగా పెట్రోల్ కి చేరువలో డీజిల్ ధరలు కొనసాగుతున్నాయి. అయితే సామాన్యులపై ఇంధన ధరల భారం పడుతూనే ఉంది. చమురు కంపెనీలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఇంధన ధరలను సమీక్షించిన తరువాత కొత్త ధరలు విడుదల చేస్తాయి. ఇంధన ధరలు ఎప్పుడు తగ్గుతాయ అని చూస్తున్న ప్రజకు కాస్త ఊరట లభించనుంది.
అయితే క్రూడాయిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF), పెట్రోల్ ఇంకా డీజిల్ ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్ ని ప్రభుత్వం అధికారికంగా తాజాగా తొలగించింది. దాదాపు రెండు నెలల చర్చల తరువాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే, ఈ మార్పు రిలయన్స్, ONGC వంటి ఆయిల్ కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా, ఎందుకంటే ఇది రిఫైనింగ్ లాభాలను పెంచుతుంది. అంతేకాకుండా పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెస్ (RIC)ని కూడా తొలగించింది.

విండ్ ఫాల్ టాక్స్ అంటే ఏమిటి?
విండ్‌ఫాల్ టాక్స్ అనేది చమురు పరిశ్రమలో వివిధ ప్రపంచ, భౌగోళిక రాజకీయ సంఘటనల కారణంగా ఊహించని ఇంకా సగటు కంటే ఎక్కువ లాభాలను చూసినపుడు ఆ పరిశ్రమలపై ప్రభుత్వం విధించే అధిక పన్ను.
పన్ను తొలగించడం వల్ల ఈ కంపెనీలు రిఫైనింగ్ మార్జిన్‌లపై అధిక లాభాలు పొందుతాయి. పెట్రోలియం క్రూడ్ ఉత్పత్తిపై ఇంకా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF), మోటార్ స్పిరిట్ సాధారణంగా పెట్రోల్ ఇంకా హై స్పిరిట్ డీజిల్‌గా పిలుస్తారు ఎగుమతిపై విండ్‌ఫాల్ ట్యాక్స్ గా పిలవబడే ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED) అని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ద్వారా పేర్కొంది.
జూలై 2022లో విండ్ ఫాల్ టాక్స్ విధించిన తర్వాత అంతర్జాతీయ క్రూడాయిల్ ధరల ఆధారంగా ప్రతి 15 రోజులకు ఒకసారి విండ్‌ఫాల్ పన్ను సమీక్షిస్తారు. గత రెండు వారాల సగటు చమురు ధర ఆధారంగా 15 రోజులకు ఒకసారి పన్ను రేట్లు సవరిస్తారు.
టాక్స్ ఫార్ములా
టాక్స్ ఫార్ములా రెవెన్యూ శాఖ ద్వారా నిర్వహిస్తారు. ప్రపంచ చమురు ధరలలో హెచ్చుతగ్గుల ప్రకారం దీని సవరణ చేస్తారు. కానీ ఇప్పుడు సగటు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో ATF, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ లేదా డీజిల్ ఏ రంగాల నుంచి ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోవడంతో విండ్ ఫాల్ ట్యాక్స్ ను తొలగించాలని నిర్ణయించింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications