February 1st: నేడు ఫిబ్రవరి 1వ తారీఖు. ఒకపక్క దేశవ్యాప్తంగా ప్రజలు నేడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా చాలా మంది దృష్టిని కొనసాగిస్తున్నారు.
నేడు 2025 బడ్జెట్ ప్రసంగానికి ముందుగా దేశంలోని వివిధ నగరాలైన చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లలో లీటరు పెట్రోల్‌ను రూ.100 కంటే ఎక్కువ ధర వద్ద కొనసాగుతుండగా.. డీజిల్ ధరలు లీటరుకు దాదాపు రూ.90కి పైన కొనసాగుతున్నాయి. ప్రధానంగా నేటి బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి క్రూడ్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు ద్వారా సామాన్యులకు పెట్రోల్, డీజిల్ ధరలపై ఉపశమనం కల్పించవచ్చనే ఆశలు కొనసాగుతున్నాయి.

ముందుగా దేశంలోని ప్రముఖ నగరాల్లో నేటి పెట్రోల్ ధరలను పరిశీలిస్తే..దిల్లీలో రూ.94.77, కలకత్తాలో రూ.105.01, ముంబైలో రూ.103.50, చెన్నైలో రూ.100.80, బెంగళూరులో రూ.102.92, హైదరాబాదులో రూ.107.46 వద్ద లీటరు రేటు ఉంది. ఇదే నగరాల్లో లీటరు డీజిల్ ధరలను పరిశీలిస్తే.. దిల్లీలో రూ.87.67, కలకత్తాలో రూ.91.82, ముంబైలో రూ.90.03, చెన్నైలో రూ.92.39, బెంగళూరులో రూ.88.99, హైదరాబాదులో రూ.90.21 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇక క్రూడ్ ఆయిల్ ధరలను పరిశీలిస్తే ప్రస్తుతం బ్యారెల్ శుక్రవారం 76 డాలర్లకు పెరిగింది. ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ టారిఫ్స్ సమయం దగ్గరపడుతోంది. శనివారం నుంచి కెనడా, మెక్సికోలపై 25 శాతం చొప్పున సుంకాలు విధించే ప్రణాళికలను ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో చమురును ప్రకటించిన సుంకాల నుంచి మినహాయించాలా వద్దా అని తాను ఇంకా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే ఈ రెండు దేశాలు అమెరికాకు భారీగా చమురు సరఫరా చేసే దేశాలు కావటం గమనార్హం.
రెండు రోజుల్లో జరగనున్న ఒపెక్ సమావేశంపై కూడా ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సౌదీ అరేబియాను ఆయిల్ ధరలు తగ్గించాల్సిందిగా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయిల్ అండ్ గ్యాస్ రంగం గణనీయమైన ఊపును పొందిందని ఏషియన్ ఎనర్జీ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ గార్గ్ అన్నారు. అయితే ఇదే ఊపును 2025లో కూడా కొనసాగించటానికి తాజాగా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో రంగంపై దృష్టి సారించిన విధాన రూపకల్పనపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications