సునీతా విలియమ్స్ ఒక్కరోజుకు జీతం ఎంతో తెలుసా.. ఈ 9 నెలలకు నాసా ఓవర్ టైంపై ఉంటుందా?

సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ దాదాపు 9 నెలల తర్వాత భూమిపైకి తిరిగి వస్తున్నారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ఎలోన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్, నాసా క్రూ-10 మిషన్ ద్వారా వారిని తిరిగి తీసుకువస్తున్నారు. గత ఏడాది జూన్‌లో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ అనే ఇద్దరు వ్యోమగాములను బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌక ద్వారా 8 రోజుల మిషన్‌పై అంతరిక్ష కేంద్రానికి పంపింది, అయితే విరిద్దరూ కొన్ని కారణాల వల్ల అక్కడ చిక్కుకుపోయి 9 నెలలకు పైగా కావొస్తుంది. ప్రస్తుతం వీరు భూమి పైకి తిరిగి రానున్నారు. సమాచారం ప్రకారం ఈ రోజు అంటే మార్చి 18 సాయంత్రం సునీత, బుచ్ భూమిపై ల్యాండ్ కానున్నారు. అయితే ఎనిమిది రోజుల స్పెస్ మిషన్‌ పై వెళ్లిన వీరిద్దరికి, 9 నెలలు పైగా గడుస్తుండటంతో నాసా ఈ ఇద్దరు వ్యోమగాములకు ఓవర్ టైం జీతం ఇస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అయితే NASA జీతాల విధానం ఎం చెబుతుందో తెలుసా...

will Nasa give overtime pay to Sunita Williams Know salary of astronauts but only 347 per day

NASA ఎటువంటి ఓవర్ టైం సాలరీ ఇవ్వదు: సాధారణంగా ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఓవర్ టైం (OT) వర్క్ చేసినందుకు ఓవర్ టైం బెనిఫిట్స్ ఇస్తారు. కానీ ఈ పద్ధతి వ్యోమగాములకు కూడా వర్తిస్తుందా ? నిజానికి, ప్రస్తుతం ఈ ప్రశ్న తలెత్తుతోంది ఎందుకంటే 8 రోజుల మిషన్‌పై వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 9 నెలలకు పైగా తర్వాత భూమిపైకి తిరిగి వస్తున్నారు. కాబట్టి NASA జీతాల ప్రకారం, ఏ కారణంగానైనా అంతరిక్షంలో అదనపు సమయం గడిపినందుకు ISSకి పంపిన వ్యోమగాములకు NASA ఎటువంటి ఓవర్ టైం బెనిఫిట్స్ ఇవ్వదు.

కేవలం $4 అదనపు పరిహారం: నాసా వ్యోమగాములు జీతం పొందే ఫెడరల్ ఉద్యోగులు ఇంకా GS-15 జీతం గ్రేడ్ కిందకి వస్తారు, వీరి ఏడాది వేతనం $125,133 నుండి $162,672 వరకు ఉంటుంది అంటే భారతీయ కరెన్సీలోకి మార్చినట్లయితే ఈ గ్రేడ్ కింద ఉన్న వ్యోమగాముల వార్షిక జీతం రూ.1.08 కోట్ల నుండి రూ.1.41 కోట్ల వరకు ఉంటుంది. ఎక్కువ రిస్క్, బిజీ షెడ్యూల్, ఎక్కువ కాలం ఒంటరిగా స్పెస్'లో వ్యోమగాములు నెలల తరబడి గ్రహం చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పటికీ, NASA జీతాలతో ఓవర్ టైం పై ఎటువంటి నిబంధన లేదు. నివేదికల ప్రకారం, అత్యంత ప్రజాదరణ పొందిన వ్యోమగాముల లిస్టులో చేర్చబడిన సునీతా విలియమ్స్ నికర విలువ దాదాపు $5 మిలియన్లు అంటే భారత కరెన్సీలో రూ.43 కోట్ల కంటే ఎక్కువ.

మిషన్ సమయంలో వ్యోమగాములకు అందించే సౌకర్యాలు ఆహారం, వసతి, రవాణా వంటి అవసరమైన అన్ని ఖర్చులను భరిస్తాయి ఇంకా వీరు అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు మాత్రమే కాకుండా భూమిపై శిక్షణ సమయంలో కూడా అందించబడతాయి. ఏదైనా అదనపు పరిహారం ఉంటే అది యాదృచ్ఛిక ఖర్చులకు మాత్రమే ఇవ్వబడుతుంది, అంటే ఈ మొత్తం రోజుకు కేవలం $4 మాత్రమే. అలాగే సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ అంతరిక్షంలో గడిపిన సుమారు 300 రోజుల ప్రకారం మనం లెక్కించినట్లయితే రోజుకు దాదాపు రూ. 347, అంటే ఆ మొత్తం రూ. 1,04,100 అవుతుంది. అయితే, ఈ మొత్తం వ్యక్తిగత ఖర్చుల కోసం అని, దీనిని ఓవర్ టైం జీతం అని పిలవరని NASA స్పష్టంగా పేర్కొంది.

మాజీ వ్యోమగామి క్లారిటీ : నాసా నుండి పదవీ విరమణ చేసిన వ్యోమగామి కేడీ కోల్‌మాన్ దాదాపు 6 నెలలు అంతరిక్షంలో గడిపారు. అంతరిక్షంలో ఉండటానికి ఓవర్ టైం దొరకకపోవడం సాధారణ విషయమని ఆయన అన్నారు. నిజానికి, ఇది ఒప్పందంలో ఒక భాగం. వ్యోమగాముల మిషన్లకు పూర్తిగా నిధులు సమకూరుతాయని ఇంకా అన్ని ఖర్చులు భరిస్తుందని, కాబట్టి ఓవర్ టైం అవసరం లేదని నాసా వాదిస్తుందని ఆయన అన్నారు. అది కూడా వ్యోమగాముల మిషన్ సుదీర్ఘమైన, ప్రమాదకరమైనప్పటికీ కూడా. నాసా అత్యంత పొడవైన ISS మిషన్లలో అనుభవజ్ఞురాలైన సునీతా విలియమ్స్ కూడా ఈ కోవలోకి వస్తారని, ఆమె 300 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపి గొప్పగా కృషి చేసిందని, కానీ ఆమె సహోద్యోగులాగానే ఆమె గడిపిన సమయానికి అదనపు జీతం పొందదని కోల్‌మన్ అన్నారు.

స్పేస్‌ఎక్స్ క్రూ-10 నుండి సునీతా విలియమ్స్ స్వదేశానికి తిరిగి రావడానికి కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. సునీతా విలియమ్స్'ని భూమిపైకి తీసుకురావడానికి NASA స్పేస్‌ఎక్స్ సహకారంతో క్రూ 10 మిషన్‌ను పంపింది. ఈ మిషన్ ద్వారా 4 మంది వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి పంపించింది. ఇప్పుడు సునీతా విలియమ్స్, బూచ్ సహా ఈ 4 మంది వ్యోమగాములతో భూమికి తిరిగి వస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+