MonkeyPox: కాసులు కురిపిస్తున్న మంకీపాక్స్.. పరుగులుతీస్తున్న స్టాక్స్ ఇవే.. మీరూ కొన్నారా..
Stocks In Focus: మార్కెట్లో జరిగే ప్రతిదానిని ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు. అలా.. వారు సరైన సమయంలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకుంటుంటారు. ఈ సారి చాలా మంది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్ కేసులను సొమ్ము చేసుకునేపనిలో పడ్డారు.

ఆ కంపెనీల్లో పెట్టుబడుల కోసం..
మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో.. వ్యాధిని అరికట్టడానికి మందులను, వ్యాక్సిన్లను తయారు చేసే కంపెనీల షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మెుగ్గుచూపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. కొవిడ్ మహమ్మారి సమయంలో లాభాలను అందించినందున వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు, యాంటీవైరల్ డ్రగ్ తయారీదారులు, రక్షణ పరికరాల తయారీదారుల షేర్లకు అధిక డిమాండ్ రావటం మనందరం గమనించాం.

ఫోకస్‌లో ఉన్న ఫార్మా స్టాక్స్..
ప్రస్తుతం మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న తరుణంలో ఫోకస్‌లో ఉన్న స్టాక్‌లలో బయోటెక్ సంస్థ బవేరియన్ నార్డిక్ A/S, ఫార్మాస్యూటికల్ దిగ్గజం సిగా టెక్నాలజీస్ ఇంక్, మెడికల్ టూల్స్ సరఫరాదారు ప్రెసిషన్ సిస్టమ్ సైన్స్ కో ఉన్నాయి.

పెరుగుతున్న షేర్ ధరలు..
బవేరియన్ నార్డిక్ షేర్లు మేలో కనిష్ట స్థాయి నుంచి ప్రస్తుతం మూడు రెట్లు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు కంపెనీ తయారు చేస్తున్న మంకీపాక్స్ వ్యాక్సిన్‌ను ఆర్డర్ చేయడంతో స్టాక్ ధరల పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి వ్యాధిని నివారించటానికి ఆమెదించబడిన ఏకైక టీకాను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

వ్యాక్సిన్ల తయారీ కంపెనీలు..
వ్యాక్సిన్లు లేదా యాంటీవైరల్ ఔషధాలను ఉత్పత్తి చేసే ఇతర కంపెనీలపై కూడా పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు.. సిగా టెక్నాలజీస్ స్టాక్ రెండింతలు పెరిగింది. Chimerix Inc Tembexa, Emergent's ACAM2000 ఉన్నాయి.

టెస్టింగ్ కిట్ల కంపెనీలు..
ఇదే సమయంలో టెస్టింగ్ కిట్లు, సాధనాలను అందించే కంపెనీలు కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జూన్ చివరి నుంచి జపాన్‌లో ప్రెసిషన్ సిస్టమ్ షేర్లు రెట్టింపు అయ్యాయి.చైనాలో 30 కంటే ఎక్కువ కంపెనీలు తమ మంకీపాక్స్ టెస్టింగ్ కిట్‌ల కోసం EU ధృవీకరణను పొందాయి. వీటిలో షాంఘై ZJ బయో-టెక్ కో., డయాగ్నోస్టిక్స్ కో, డాన్ జీన్ కో ఉన్నాయి. జూలైలో షాంఘై ZJ షేర్లు దాదాపు 40% ర్యాలీ చేశాయి.


Click it and Unblock the Notifications