భవిష్యత్తులో బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఆర్థిక నిపుణులు హెచ్చరిక ఇదే..
గత కొన్ని వారాలుగా బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,000 మార్క్‌ను దాటి గడచిన వారం రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.94,000 వరకు చేరింది. సాధారణంగా పసిడి ప్రియులు చైన్ లేదా హారం కొనాలన్నా కూడా రూ.1 లక్షకు పైగానే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నామి. దానికి తోడు బంగారం తరుగు (wastage), మజూరి (making charges), జిఎస్టీ వంటి అదనపు ఖర్చులు కలుపుకుంటే పసిడి ధర మరింత పెరిగి సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో చాలామందికి ఒకే ప్రశ్న ఎదురవుతోంది ఇప్పుడు..అదేంటంటే.. భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా? లేక తగ్గుతుందా..ఈ ప్రశ్న ఇప్పుడు పసిడి ప్రియులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. జాతీయ మీడియాలో కొన్ని కథనాలు బంగారం 20-30 శాతం పడిపోతుందంటూ హెచ్చరిస్తున్నాయి. మరికొన్ని నివేదికలు మాత్రం బంగారం త్వరలో రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు చేరే అవకాశముందని కథనాలు రాస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మనం బంగారం గత చరిత్రను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. గత 20 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ లెక్కలు చూసుకున్నట్లయితే బంగారం ధర ఎప్పటికీ తగ్గే దిశలో కాకుండా స్థిరంగా పెరిగే దిశగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరంలో తులం బంగారం ధర రూ.5,000 ఉండగా 2025 నాటికి అది కాస్తా రూ.1 లక్ష దాటింది. అంటే 20 ఏళ్ళ కాలంలో దాదాపు బంగారం ధర 20 రెట్లు పెరిగింది. ఇంకా చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో బంగారం ధర పీక్ స్టేజీకి చేరుకుంది.
బంగారం ధర పెరగడానికి ముఖ్యమైన కారణాలు:
1. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక మందగమనం
2. బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ప్రపంచ దేశాలన్నీ చూడడం
3. చైనా గత 10 సంవత్సరాల్లో 1500 టన్నుల బంగారం కొనుగోలు చేయడం
4. భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ వంటి దేశాలు భారీగా బంగారం నిల్వలు పెంచుకోవడం
5. అమెరికా డాలర్ మార్పులకు లోను కావడం
6. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వార్ ఆందోళన పరిస్థితులు
7. అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న సుంకాల ప్రభావం
ఈ పరిస్థితులన్నీమనం చూసుకున్నట్లయితే భవిష్యత్తులో బంగారం డిమాండ్ పెరగడమే కాని తగ్గే అవకాశం లేదు. డిమాండ్ పెరుగుతున్నప్పుడు సరఫరా కూడా పరిమితంగానే ఉంటుంది.కాబట్టి పసిడి ధరలు సహజంగానే పెరుగుతాయని చెప్పుకోవచ్చు.
ఈ నేపథ్యంలో పసిడి ప్రియులు బంగారం రేటు తక్కువగా ఉన్నప్పుడు కొద్దికొద్దిగా దాన్ని కొనుగోలు చేస్తూ పోవడం ఉత్తమమైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడి పరంగా చూస్తే గోల్డ్ ఈటీఎఫ్స్ (Gold ETFs) ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు నిపుణులు. తక్కువ ఖర్చుతో, అధిక లిక్విడిటీతో, భద్రతగా బంగారంలో పెట్టుబడి పెట్టాలంటే ఇది ఉత్తమ మార్గమని వారు చెబుతున్నారు. ఏదైమైనా బంగారం ధరలు తక్కువయ్యే అవకాశం తక్కువని నిపుణులు చెబుతున్నారు.భవిష్యత్తులో వాటి విలువ పెరిగే అవకాశమే ఎక్కువగా ఉన్నందున అందుకు తగ్గట్లుగా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications


