బంగారం, వెండి కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన.. ఈ రేటు వద్దకు దిగి రాగానే వెంటనే కొనేయండి..

బంగారం ధరలు రోజు రొజుకు సెగలు పుట్టిస్తున్నాయి. కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. గతేదాడి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన బంగారం ధరలు ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగించేలా ఉన్నాయి. జనవరి ప్రారంభం నుంచి ధరలు నింగిని తాకుతున్నాయి. సామాన్యుడు షాపుకు వెళ్ళి కొనాలంటేనే బయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు పసిడి ప్రియుల కొంపలు ముంచుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు కూడా అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొని ఉంది.

అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు మరోసారి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. జనవరి 20, 2026 నాటికి అంతర్జాతీయంగా, దేశీయంగా ఈ విలువైన లోహాలు కొత్త రికార్డులు నెలకొల్పుతూ దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు సేఫ్-హేవెన్ డిమాండ్ కారణంగా రికార్డు స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక భారత్‌లోని MCX మార్కెట్‌లో Gold ఫ్యూచర్స్ ధరలు భారీగా పెరిగి పెట్టుబడిదారులకు లాభాలను అందిస్తున్నాయి. అదే సమయంలో వెండి ధరలు కిలోకు రూ.3 లక్షల మార్క్‌ను దాటడం దేశీయ మార్కెట్‌లో చారిత్రాత్మక ఘట్టంగా మారింది.

gold price prediction today gold price forecast gold price outlook gold prices today silver price prediction today silver price forecast gold silver prices today gold all time high silver price rally precious metals outlook gold investment silver investment safe haven assets gold rate today India silver rate today India inflation hedge gold central bank gold buying US dollar impact on gold interest rates gold prices commodity market today

భారత ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూసుకున్నట్లయితే 24 క్యారెట్ బంగారం ధర గ్రాముకు రూ.14,700కు పైగా పలుకుతోంది. 22 క్యారెట్ బంగారం ధర కూడా అదే ఊపులో కదులుతోంది. వెండి ధరలు కూడా పరిశ్రమల నుంచి పెరుగుతున్న డిమాండ్‌తో బలంగా నిలుస్తున్నాయి. బంగారం, వెండి ర్యాలీకి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు అని చెప్పవచ్చు. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య వివాదాలు, సుంకాల భయం, మధ్యప్రాచ్యం వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తగ్గించుకునేందుకు బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు.

దీంతో పాటుగా ద్రవ్యోల్బణం భయాలు, డాలర్‌లో అస్తిరత, సెంట్రల్ బ్యాంకుల విధానాలపై అనిశ్చితి, స్టాక్ మార్కెట్లలో ఊగిసలాట వంటి అంశాలు పసిడి పెరుగుదలకు కారణమవుతున్నాయి. వెండికి ప్రత్యేకంగా సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్ రంగాల నుంచి డిమాండ్ పెరగడం ధరలను మరింత పైకి తీసుకువెళుతోంది.

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బంగారం టెక్నికల్‌గా బలమైన అప్‌ట్రెండ్‌లో ఉంది. ముఖ్యమైన సపోర్ట్ లెవెల్స్ పైన ధరలు నిలబడితే మరిన్ని కొత్త గరిష్టాలు దాటే అవకాశం ఉంది. అయితే, లాభాల బుకింగ్ వల్ల స్వల్ప కరెక్షన్ వచ్చే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చలేమని చెబుతున్నారు.ఇక వెండి విషయంలో.. ఇటీవల వచ్చిన బ్రేక్‌ఔట్ దీర్ఘకాలికంగా పాజిటివ్ సంకేతంగా భావిస్తున్నారు. పరిశ్రమల డిమాండ్ కొనసాగితే, వెండి ధరలు ఇంకా పైకి ఎగబాకవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

పెట్టుబడిదారులు గమనించాల్సిన అంశాలను చూసినట్లయితే నిపుణులు పెట్టుబడిదారులకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పెట్టుబడులు పెట్టకుండా దశలవారీగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. అలాగే స్టాప్ లాస్ తప్పనిసరిగా పాటించాలి. అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణ డేటా, జియోపాలిటికల్ వార్తలపై నిరంతరం దృష్టి పెట్టాలి. షార్ట్‌టర్మ్ ట్రేడింగ్ కంటే లాంగ్‌టర్మ్ హెడ్జ్‌గా బంగారం ఉపయోగపడుతుందని విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో స్పాట్ గోల్డ్ ధర 4,750 డాలర్ల చుట్టూ కీలక నిరోధక స్థాయిని (Resistance Zone) పరీక్షించే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత MCX మార్కెట్‌లో ఇది ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కు రూ. 1,48,000 స్థాయికి సమానంగా ఉంది. అయితే, US-EU సుంకాల ఉద్రిక్తతలు తాత్కాలిక ఊగిసలాటకు దారి తీయవచ్చని, అందువల్ల కొనుగోలుదారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, భారీ లాభాల తర్వాత వచ్చే కరెక్షన్ రిస్క్‌ను దృష్టిలో ఉంచుకుని స్టాప్‌లాస్ తప్పనిసరిగా పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నారు.

బంగారం కీలక స్థాయిలు: మద్దతు (Support) అంటే కొనుగోలు స్థాయి ఇది..

4,608 డాలర్లు (MCX అయితే రూ. 1,43,500)
4,560 డాలర్లు (MCX అయితే రూ. 1,42,000)

మధ్యంతర నిరోధకత (Immediate Resistance) అంటే కొనుగోలు ఆపే స్థాయి: 4,707 డాలర్లు (MCX రూ. 1,46,500)

వెండి కీలక స్థాయిలు: రెసిస్టెన్స్ జోన్ విషయానికి విస్తే.. 98 డాలర్ల నుంచి 100 డాలర్ల మధ్యలో ..ఇక MCX మార్చి కాంట్రాక్ట్ అయితే రూ. 3,21,000 నుంచి రూ. 3,28,000 మధ్యలో ఉన్నప్పుడు కొనుగోలు ఆపేయడం బెటర్. ఇక కొనుగోలు స్థాయిన తీసుకుంటే 90 డాలర్ల వద్ద (MCX స్థాయి రూ. 2,95,000) నుంచి 86 డాలర్ల వద్దకు (MCX స్థాయి రూ. 2,82,000) మద్య ఉత్తమం.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+