భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు మండుతున్నాయి. గత వారం రోజుల్లో ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ.6,250 పెరిగింది. ఈ పెంపుతో బంగారం 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ. 96,450కి చేరుకుంది. అంతేకాక నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే ఈ వారంలో బంగారం ధర 10 గ్రాములకు లక్ష రూపాయలకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

బంగారం ధర ఎందుకు పెరుగుతోంది: ఈ సంవత్సరం అంటే 2025లో బంగారం ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 20 సార్లు గరిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కారణంగా ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. దీని ప్రభావం దేశీయ మార్కెట్‌పై కూడా కనిపిస్తోంది. అయితే భౌగోళిక రాజకీయ అనిశ్చితి, US సుంకాలు , కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు వీటి ధరల పెంపుకు ఆజ్యం పోస్తున్నాయి.
ప్రపంచంలో బంగారంధర: ప్రపంచ స్థాయిలో కూడా బంగారం ధరల్లో భారీ పెరుగుదల ఉంది. స్పాట్ బంగారం ధరలు మొదటిసారిగా ఔన్సుకు $3,200 దాటాయి. US బంగారు ఫ్యూచర్స్ ఔన్సుకు $3,237.50 వద్ద ఉంది.
బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకుంటుందా: బంగారం ధర పెరుగుతున్నందున ఈ వారంలో 10 గ్రాములకు లక్షకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. 2025 సంవత్సరంలో అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను రెండుసార్లు తగ్గించవచ్చని కామా జ్యువెలరీ ఎండీ కాలిన్ షా అన్నారు. ఈ కారణంగా, బంగారం 10 గ్రాములకు లక్ష వరకు చేరవచ్చు. వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ప్రజలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కొనుగోలు చేస్తారని ఆయన అన్నారు.
మరోవైపు, మోతీలాల్ ఓస్వాల్‌కు చెందిన కిషోర్ నార్నే బంగారానికి ఎటువంటి గరిష్ట పరిమితి లేదు. బంగారం ఔన్సుకు $4,000-4,500 కు సులభంగా చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు.
కొంతమంది నిపుణుల అభిప్రాయాలు చూస్తే : మరోవైపు, బంగారం లక్ష స్థాయికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. బంగారం ధర పెరుగుదల ప్రస్తుత ట్రెండ్ కొనసాగింపు అని కొంతమంది నిపుణులు అంటున్నారు.
ఆశ్చర్యంగా ఈ సంవత్సరం బంగారం ధర కూడా తగ్గవచ్చని మరికొందరు నిపుణులు అంటున్నారు. గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయల్ మాట్లాడుతూ, రాబోయే ఆరు నుండి పది నెలల్లో బంగారం తగ్గవచ్చని అన్నారు. దీని ధర ఔన్సుకు దాదాపు $2,600 వరకు ఉండవచ్చని తెలిపారు.


Click it and Unblock the Notifications