బంగారం ధర రికార్డ్ స్థాయి లక్షకి చేరిన తర్వాత మళ్ళీ కాస్త తగ్గింది, కానీ ధరలు మరోసారి అదే ఎత్తుకు చేరుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే పసిడి ధర మళ్లీ లక్ష దాటి పరుగులు పెట్టె అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం తులం ధర 98 వేలకు దగ్గరగా కదులుతుండగా, లక్షకు చేరుకోవడానికి కేవలం 2 వేల పెరుగుదల అవసరం. బంగారం ధర ఇటీవల ఒక్కరోజులోనే 3 వేలు పెరిగి లక్ష దాటి మరోసటి రోజే అదే స్థాయిలో తగ్గి లక్షకి కిందకి పడిపోయింది.

ఇక మన దేశంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏ శుభకార్యానికి బంగారం కొనడానికే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాగే మహిళలు బంగారాలు ఆభరణాలను అలంకరణకే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మహిళలే కాదు మగవారికీ కూడా బంగారం పై ఎక్కువ మక్కువ ఉంటుంది. అయితే బంగారంని కొందరు పెట్టుబడిగా కూడా భావిస్తారు. అయితే ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి కొనుగోళ్లు అధిక మొత్తంలో జరుగుతుంటాయి. కానీ ధరల పెరుగుదల ట్రెండ్ కస్టమర్లను గ్రాములల్లో కొనడానికే పరిమితం చేస్తున్నాయి. ఇక రానున్న కొద్దిరోజుల్లో చూస్తే అక్షయ తృతీయకి బంగారం కొనేందుకు చాల మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో పసిడి ధర ఏ స్థాయిలో పరుగులు పెడుతుందో అని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
కాబట్టి పెరిగే ఛాన్స్: అమెరికా ఇంకా చైనా మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల బంగారం ధరలు పెరిగాయి అలాగే ధరలు తగ్గడానికి ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు కూడా కారణమయ్యాయి. అయితే, ఇప్పుడు మొత్తం పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది. సుంకాలకు సంబంధించి అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని చైనా తెలిపింది. అలాగే అమెరికా ఏకపక్ష సుంకాలను తొలగించాలని కూడా చైనా కోరింది. ఈ ప్రకటన మరోసారి సుంకాలకు సంబంధించి అనిశ్చితిని సృష్టించింది. ఇలాంటి సమయంలో బంగారంలో పెట్టుబడిని పెంచుతుంది, ఇవి పసిడి ధరలకు రెక్కలు వచ్చేలా చేస్తుంది.
చైనాపై సుంకాలను తగ్గిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అన్నారు. కానీ సుంకం సున్నా కాదని కూడా ఆయన స్పష్టం చేశారు. అమెరికా విధించిన ఏకపక్ష సుంకాన్ని పూర్తిగా తొలగించాలని చైనా కోరుకుంటున్నట్లు చైనా ప్రకటన ద్వారా స్పష్టమవుతోంది. ఈ విషయం త్వరలో పరిష్కారమయ్యే అవకాశాలు క్షీణిస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ పూర్తిగా సుంకాలు ఇంకా అమెరికా-చైనా సంబంధాలపై దృష్టి పెట్టిందని నిపుణులు అంటున్నారు. అలాగే బంగారం మరోసారి సురక్షితమైన పెట్టుబడిగా ఆవిర్భవిస్తోంది. రాబోయే రోజుల్లో వాణిజ్య యుద్ధానికి సంబంధించి అనిశ్చితి కొనసాగితే, బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
ప్రస్తుత ధర ఎంత: భారతదేశంలో బంగారం ధర గురించి మాట్లాడుకుంటే తులం ధర 98 వేలు దాటింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ప్రస్తుతం రూ.98,230గా ఉండగా, గత రెండు రోజులుగా పసిడి ధరలు తగ్గు ముఖం పట్టాయి. అంతకుముందు బంగారం ధర 10 గ్రాములకు ఒకే రోజులో 3 వేలు పెరిగి లక్ష దాటిన సంగతి మీకు తెలిసందే.
బంగారం ఎప్పుడు కొనొచ్చు: హిందూ మతంలో అక్షయ తృతీయ బంగారం లేదా ఇతర విలువైన లోహాలు కొనడానికి ఒక శుభప్రదమైన రోజుగా పరిగణిస్తారు. క్యాలెండర్ ప్రకారం, ఈ వైశాఖ మాసంలోని శుక్ల పక్షం తృతీయ తిథి రోజున పాటిస్తారు. అక్షయ తృతీయ అంటే ఎప్పటికీ అంతం కాదు అని అర్ధం. ఈ రోజున చేసే శుభకార్యాలు శాశ్వతంగా మంచి ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. అలాగే ఒక వ్యక్తికి శుభ ఫలితాలు కలుగుతాయని కూడా నమ్మకం. అక్షయ తృతీయ రోజున దానధర్మాలు చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తాయని చెబుతుంటారు. భారతీయ సంప్రదాయం ప్రకారం ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 30 వరకు బంగారం కొనుగోలుకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏప్రిల్ 30న అక్షయ తృతీయతో ఈ పవిత్రమైన సమయం ముగుస్తుంది. అక్షయ తృతీయ ఏప్రిల్ 29న సాయంత్రం 5:31 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2:12 గంటల వరకు ఉంటుంది.
అక్షయ తృతీయ ఆఫర్లు: జ్యువెలరీ షాప్ మలబార్ గోల్డ్ & డైమండ్స్ అక్షయ తృతీయ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కస్టమర్లని దృష్టిలో ఉంచుకొని ఫెస్టివల్ ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లకు వాల్యూ, నమ్మకం, అదృష్టాన్ని తీసుకువచ్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సందర్భంగా ప్రత్యేకమైన డీల్స్ అందిస్తోంది. అలాగే అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 25% వరకు డిస్కౌంట్, స్టోన్స్ ఇంకా అన్‌కట్ డైమండ్ ఆభరణాల తయారీ ఛార్జీలపై 25% వరకు డిస్కౌంట్, వజ్రాల వాల్యూ పై 25% వరకు తగ్గింపును అందిస్తోంది. కస్టమర్ల మంచి అనుభవాన్ని ఇవ్వడానికి ప్రి బుకింగ్‌లతో ఉచిత వెండి నాణెంను అందిస్తోంది. అంటే కస్టమర్లు మొత్తం వాల్యూలో కనీసం 10% చెల్లించి నచ్చిన ఆభరణాలను బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా బంగారం ధరల పెరుగుదల నుండి కొంచం డబ్బు చేసుకోవచ్చు.
ధరలు ఎలా మారుతాయి : బంగారం ధరలు డిమాండ్ ఇంకా సప్లయ్ ద్వారా మాత్రమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రపంచ కార్యకలాపాల ద్వారా కూడా ప్రభావితమవుతాయి. లండన్ OTC స్పాట్ మార్కెట్, COMEX గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్‌తో సహా ప్రపంచ మార్కెట్లలోని ట్రేడింగ్ కార్యకలాపాలు కూడా బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి.
ధరలను ఎవరు నిర్ణయిస్తారు: ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) నిర్ణయిస్తుంది. LBMA బంగారం ధరలను US డాలర్లలో ప్రచురిస్తుంది, అలాగే బ్యాంకర్లు అండ్ బులియన్ వ్యాపారులకు ప్రపంచ ప్రమాణంగా పనిచేస్తుంది. ఇక మన దేశంలో ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) అంతర్జాతీయ బంగారం ధరలకు దిగుమతి సుంకం, ఇతర పన్నులను కలుపుతుంది ఇంకా బంగారం అమ్మకపు రేటును నిర్ణయిస్తుంది.
రాబోయే నెలల్లో బంగారం ధరల అంచనా: ఏ ఏడాది జూన్ నుండి అక్టోబర్ వరకు బంగారం ధరలు క్రమంగా పెరుగుతాయని భావిస్తున్నారు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల మధ్య మార్కెట్ సెంటిమెంట్, పెట్టుబడిదారుల డిమాండ్ ఈ పెరుగుదల ధోరణికి ఆజ్యం పోసే అవకాశం ఉంది.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

Gold rates: వరుస లాభాలకు బ్రేక్.. ఈ రోజు బంగారం ధర ఎంతంటే..

Gold rates: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి పరుగు! హైదరాబాద్, బెంగళూరులో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?



Click it and Unblock the Notifications