టెస్లా CEO ఎలాన్ మస్క్ మరోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చారు. షేర్‌హోల్డర్లు ఆయనకు ప్రతిపాదించిన రూ.1 ట్రిలియన్ (దాదాపు $1 ట్రిలియన్) జీత ప్యాకేజ్‌ను ఆమోదించకపోతే, ఆయన టెస్లా CEO పదవిని వదిలేయోచ్చని బోర్డు చైర్‌పర్సన్ రోబిన్ డెన్‌హోలం పెట్టుబడిదారులకు లేఖ రాసి హెచ్చరించారు.
ఈ హెచ్చరిక నవంబర్ 6న జరిగే టెస్లా వార్షిక సమావేశంకు ముందు వచ్చింది. ప్రస్తుతం టెస్లా బోర్డు సభ్యుల పై పలు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వారు మస్క్‌కి చాలా దగ్గరగా ఉండటం వల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. డెన్‌హోలం లేఖలో చెప్పినదేమిటంటే, ఈ జీత ప్యాకేజ్ మస్క్‌ను మరో ఏడున్నర సంవత్సరాలు టెస్లాతో ఉండేలా ప్రోత్సహించడానికి అవసరమని అన్నారు. మస్క్ లీడర్‌షిప్ లేకుండా టెస్లా ఊహించుకోవడం కష్టమే, అని ఆమె పేర్కొన్నారు. ఆయనకు సరైన ప్రోత్సాహక వ్యవస్థ లేకపోతే కంపెనీ ఆయన "సమయం, ప్రతిభ, దృష్టి" కోల్పోతుందనే భయాన్ని వ్యక్తం చేశారు.

ఈ ప్రతిపాదనలో మొత్తం 12 స్టాక్ ఆప్షన్ దశలు ఉన్నాయి. అంటే, మస్క్ ఈ ప్యాకేజీ పొందాలంటే ఆయన టెస్లా మార్కెట్ విలువను $8.5 ట్రిలియన్ వరకు పెంచడం, అలాగే ఆటోమేటిక్ కార్లు మరియు రోబోట్స్ తయారీలో పెద్ద విజయాలు సాధించడం వంటి కఠినమైన లక్ష్యాలు చేరుకోవాలి. గతంలో 2018లో కూడా మస్క్‌కు ఇలాంటి భారీ ప్యాకేజ్ ఇచ్చారు. అయితే డెలావేర్ కోర్టు దాన్ని రద్దు చేసింది. కారణం ఆ సమయంలో ప్యాకేజ్‌ను నిర్ణయించిన బోర్డు సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించలేదని కోర్టు చెప్పింది. ఇప్పుడు కూడా అదే విధమైన విమర్శలు మళ్లీ వినిపిస్తున్నాయి.
మస్క్ మాత్రం ఈ ప్రతిపాదనను బలంగా సమర్థిస్తున్నారు. ఆయన మాటల్లో, ఇది టెస్లా భవిష్యత్తు కోసం చాలా అవసరం. నేను ఈ డబ్బు కోసం కాదు, కంపెనీని ముందుకు తీసుకెళ్లడానికి ఇది కావాలి. నాకు టెస్లాపై కొంత నియంత్రణ ఉండాలి, కానీ నేను తప్పు చేస్తే నన్ను తొలగించలేనంత అధికారం ఉండకూడదు. అదే కాకుండా, ఆయన ISS మరియు Glass Lewis అనే రెండు సలహా సంస్థలను తీవ్రంగా విమర్శిస్తూ వాటిని "కార్పొరేట్ టెర్రరిస్టులు" అని పిలిచారు. "వీరు గతంలో చాలా చెడు సిఫారసులు చేశారు. వాటిని అమలు చేసి ఉంటే టెస్లా ఇప్పటి స్థాయికి చేరుకోదు," అని మస్క్ అన్నారు.
ఈ జీత ప్యాకేజ్ ఆమోదించబడితే, టెస్లా స్టాక్‌పై సానుకూల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మస్క్ ఇంకా కంపెనీని నడిపించడానికి అంకితంగా ఉన్నారని మార్కెట్ భావిస్తుంది. పెట్టుబడిదారులు, స్టాక్ ట్రేడర్లు ఈ నిర్ణయాన్ని మస్క్ లీడర్‌షిప్‌లో స్థిరత్వానికి సంకేతంగా చూస్తారు. అలాగే, పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతుంది, స్టాక్ విలువ కొంత పెరుగవచ్చు. కానీ, ఈ ప్యాకేజ్ తిరస్కరించబడితే, మార్కెట్‌లో అనిశ్చితి (uncertainty) ఏర్పడే అవకాశం ఉంది. షేర్‌హోల్డర్లు, ప్రాక్సీ సలహా సంస్థలు సిఫారసులు, మరియు మస్క్ నాయకత్వం పై వచ్చిన ప్రశ్నలు స్టాక్ ధరల పై ప్రతికూల ప్రభావం చూపోచ్చు. అందువలన, ఈ నిర్ణయం టెస్లా షేర్ మార్కెట్ కోసం చాలా కీలకం.
గమనించదగ్గ విషయం ఏమిటంటే, మస్క్ కేవలం టెస్లానే కాదు, SpaceX, xAI (ఇది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X యజమాని) వంటి సంస్థలను కూడా నడుపుతున్నారు. డెన్‌హోలం లేఖ చివర్లో చెప్పినదేమిటంటే ఈ కొత్త ప్యాకేజ్ మస్క్ దృష్టిని టెస్లా దీర్ఘకాల లక్ష్యాల పై నిలబెట్టడానికి కీలకం. టెస్లా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేటిక్ సాంకేతికత, సెల్ఫ్ డ్రైవ్ కార్లు, రోబోట్స్ వంటి రంగాల్లో అగ్రగామిగా మారడానికి ప్రయత్నిస్తోంది. మస్క్ ఈ రంగాల్లో విజయాలు సాధిస్తే, టెస్లా కేవలం ఆటోమోటివ్ కంపెనీ కాకుండా అంతర్జాతీయ టెక్ లీడర్గా అభివృద్ధి చెందవచ్చు.
ఇది కేవలం టెస్లా భవిష్యత్తుకే కాకుండా, మొత్తం ఆటోమోటివ్ మరియు AI పరిశ్రమకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. టెక్నాలజీ అభివృద్ధిలో ముందంజు తీసుకోవడం, కంపెనీకి కొత్త మార్కెట్లలో ఆధిపత్యాన్ని సాధించడానికి సహాయపడుతుంది. ఈ జీత ప్యాకేజ్‌పై షేర్‌హోల్డర్లు తీసుకునే నిర్ణయం టెస్లా భవిష్యత్తుకు దిశ నిర్ధేశించనుంది. ఆమోదిస్తే మస్క్ ఇంకా ఏళ్ల తరబడి టెస్లాను ముందుకు నడిపించే అవకాశం ఉంది, తిరస్కరించబడితే ఆయన రాజీనామా కూడా వాస్తవమవుతుందేమో చూడాలి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్‌లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్‌లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications