ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ (EV), సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. డీజిల్ కార్ల ఉనికి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు అధిక మైలేజ్, బలమైన ఇంజిన్‌ల కారణంగా మార్కెట్‌ను శాసించిన డీజిల్ కార్లు ఇప్పుడు కంపెనీల ప్రాధాన్యత జాబితాలో వెనుకబడుతున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటి? భవిష్యత్తులో డీజిల్ కార్లు పూర్తిగా కనుమరుగవుతాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు మెదులుతున్నాయి.
డీజిల్ కార్ల తగ్గుదలకు ప్రధాన కారణంగా బీఎస్6 ఉద్గార నిబంధనలు అని చెప్పవచ్చు. 2020 ఏప్రిల్ 1 నుంచి భారత్‌లో బీఎస్6 ప్రమాణాలు అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనలకు అనుగుణంగా ఇంజిన్‌లను అప్‌డేట్ చేయడం పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్లకు చాలా ఖర్చుతో కూడుకున్నది. డీజిల్ ఇంజిన్‌లలో డీపీఎఫ్ (Diesel Particulate Filter), అదనపు ఎమిషన్ కంట్రోల్ సిస్టమ్స్ అవసరం అవుతాయి. దీని వల్ల వాహన ధరలు గణనీయంగా పెరిగాయి. ధరలు పెరిగితే వినియోగదారుల ఆసక్తి తగ్గడం సహజంగానే జరుగుతూ ఉంటుంది.

దీనికి తోడు కాలుష్యం కూడా డీజిల్ కార్లకు ప్రధాన సవాల్‌గా మారింది. డీజిల్ వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ ఆక్సైడ్స్, పార్టిక్యులేట్ మ్యాటర్ వాయుకాలుష్యాన్ని తీవ్రతరం చేస్తాయి. ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో ఇది పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. ఈ కారణంగానే ఢిల్లీ వంటి నగరాల్లో 10 ఏళ్లకు మించిన డీజిల్ కార్లపై నిషేధం విధించారు. కొన్ని సందర్భాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కూడా కాలుష్య స్థాయిలు పెరిగినప్పుడు పరిమితులు విధించారు.
మరో ముఖ్య కారణం ఏంటంటే.. ధరల మధ్య తేడా తగ్గిపోవడం. ఒకప్పుడు పెట్రోల్ కంటే డీజిల్ లీటర్‌కు చాలా చౌకగా ఉండేది. దీని వల్ల ఎక్కువ ప్రయాణం చేసే వారికి డీజిల్ కార్లు లాభదాయకంగా ఉండేవి. అయితే ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. అంతేకాకుండా Diesel Cars కొనుగోలు ధర పెట్రోల్ కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చులు, సర్వీసింగ్ సమస్యలు కూడా డీజిల్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తిని తగ్గిస్తున్నాయి.
ప్రస్తుతం వినియోగదారుల అభిరుచులు మారడమూ డీజిల్ కార్లకు ప్రతికూలంగా మారింది. యువత ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణహితం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు EVల్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఫలితంగా డీజిల్ కార్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. అమ్మకాలు పడిపోవడంతో కంపెనీలు కూడా డీజిల్ మోడళ్లను తగ్గించుకుంటూ వస్తున్నాయి.
మారుతి సుజుకి ఇప్పటికే డీజిల్ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్, కియా, టయోటా వంటి కంపెనీలు మాత్రమే డీజిల్ కార్లను పరిమితంగా ఉత్పత్తి చేస్తున్నాయి. లగ్జరీ సెగ్మెంట్‌లో మెర్సిడెస్ బెంజ్, లెక్సస్ వంటి బ్రాండ్లు ఇంకా డీజిల్ ఆప్షన్లు అందిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డీజిల్ కార్లు పూర్తిగా కనుమరుగవ్వడం కష్టమేనని చెప్పవచ్చు.
వాణిజ్య వాహనాలు, దీర్ఘ ప్రయాణాలకు ఉపయోగించే SUVలలో డీజిల్ ఇంజిన్‌లకు ఇప్పటికీ అవసరం ఉంది.అయితే సంఖ్య మాత్రం గణనీయంగా తగ్గుతుంది. భవిష్యత్తులో డీజిల్ కార్లు ఒక ప్రత్యేక అవసరాల విభాగానికి పరిమితమవుతాయని చెప్పవచ్చు. అంటే డీజిల్ కార్లు అంతరించిపోవు, కానీ ప్రధాన మార్కెట్ స్థానాన్ని మాత్రం కోల్పోతాయని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications