బెంగళూరులో ట్రాఫిక్ అంటేనే ఒక పెద్ద సమస్య అని అందరికీ తెలిసిందే. రోజురోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీతో ఆఫీసుకు వెళ్లడం, తిరిగి రావడం ఒక పెద్ద సవాల్‌గానే మారింది. ఈ సమస్యకు ఎట్టకేలకు ఒక పెద్ద పరిష్కారం రాబోతోందని తెలుస్తోంది.
గ్రేటర్ బెంగళూరు అథారిటీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ తాజాగా 110 కి.మీ పొడవున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ డీటైల్‌డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)కు ఆమోదం తెలిపింది. సుమారు రూ. 18,000 కోట్లు ఖర్చుతో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో, భూ సంపాదనకే దాదాపు రూ. 3,000 కోట్లు కేటాయించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చివరి సిగ్నల్ ఇచ్చాక, డిసెంబర్‌లో పనులు ప్రారంభించి 25 నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

ఈ కారిడార్ పూర్తిగా ఎలివేటెడ్ రహదారిగా రూపొందించబడుతుంది. నగరంలోని ముఖ్య రహదారులను కలుపుతూ వ్యూహాత్మకంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల నగర మధ్యభాగంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో నిర్మించనున్నారు. ఇది బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే లాంటి టోల్ సిస్టమ్‌పై నడుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం ఏడాది రోజులపాటు చేసిన ట్రాఫిక్ స్టడీలో ఇన్ఫ్రా సపోర్ట్, కన్నన్ సిద్దిశక్తి, నగేష్ కన్సల్టెంట్స్ వంటి సంస్థలు పాల్గొన్నాయి. నిర్మాణంలో అల్ట్రా-హై-పెర్ఫార్మెన్స్ ఫైబర్-రీన్ఫోర్స్డ్ కాంక్రీట్(UHPFRC) అనే ఆధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారు. దీని వల్ల నిర్మాణం బలంగా, మన్నికగా ఉండటమే కాకుండా వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. భాగాలను ముందే ఫ్యాక్టరీల్లో తయారు చేసి, సైట్‌లో అమర్చే పద్ధతిని అనుసరిస్తారు.
ఈ కారిడార్ ముఖ్యంగా బెంగళూరులోని అవుటర్ జోన్లను కలుపుతుంది. ఈస్ట్ వైపు నుండి ఎయిర్‌పోర్ట్ రోడ్డుకి నేరుగా కనెక్టివిటీ ఇచ్చే ప్రత్యేక మార్గం కూడా ఉండబోతోంది. దీని వల్ల రేడియల్ కనెక్టివిటీ మెరుగై, నగరమంతా సులభంగా చేరుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జరుగుతున్న టన్నెల్ రోడ్ వంటి ఇతర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు ఇది తోడ్పడనుంది. ప్రైవేట్ భాగస్వాములు సమయానికి పూర్తి చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) కూడా ఇవ్వొచ్చని సమాచారం.
ఇదంతా ఎందుకు అవసరం అంటే బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం, సగటు భారతీయ ఉద్యోగి తన రోజులో దాదాపు 8.6% సమయాన్ని ఆఫీసుకు వెళ్ళి రావడానికే ఖర్చు చేస్తున్నాడు. ఏడాదికి అంటే దాదాపు 754 గంటలు లేదా 68 వర్కింగ్ డేస్ రోడ్లపైనే వృథా అవుతున్నాయి. 2024లో బెంగళూరులో సగటు వన్‌వే ప్రయాణ సమయం 54 నిమిషాలు ఉండగా, ప్రస్తుతం అది "63 నిమిషాలకు పెరిగింది. కేవలం ఏడాదిలోనే 16% పెరుగుదల. నగరంలో సగటుగా 19 కి.మీ ప్రయాణించడానికి ఈ సమయం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఈ 110 కి.మీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ నిజంగానే బెంగళూరు ట్రాఫిక్ సమస్యలకు "గేమ్ ఛేంజర్" అవుతుందా అన్న ఆశలు, ఆసక్తి రెండూ పెరుగుతున్నాయి.
ఈ బెంగళూరు ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎక్కడెక్కడుగా మార్గం ఉంటుందో, ఏ ఏ ప్రాంతాలను కలుపుతుందో అనే వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాజెక్ట్ నగరంలోని ప్రధాన ఐటీ, ఇండస్ట్రియల్ మరియు రెసిడెన్షియల్ హబ్‌లను అనుసంధానం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఉదాహరణకు ఎలక్ట్రానిక్ సిటీ, వైట్‌ఫీల్డ్, హెబ్బాల్, KR పురం వంటి కీలక ప్రాంతాలను కలుపుతూ కారిడార్ కొనసాగనుంది. ఈ మార్గం నగర అవుటర్ జోన్లను కలుపుతూ రేడియల్ కనెక్టివిటీని పెంచుతుంది.
ప్రస్తుతం బెంగళూరులో సగటుగా 19 కి.మీ ప్రయాణించడానికి దాదాపు 63 నిమిషాలు పడుతోంది అంటే ఒక గంటకు దగ్గరగానే సమయం వెళ్తోంది. కానీ ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్ట్ పూర్తయితే, ట్రాఫిక్ సిగ్నల్స్, జామ్‌లన్నీ దాటేసి సూటిగా ప్రయాణించగలిగే అవకాశం ఉంటుంది. అంచనాల ప్రకారం అదే 19 కి.మీ దూరం కేవలం 30-35 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అంటే ఒక్కో ట్రిప్‌కే దాదాపు అరగంట సమయం ఆదా అవుతుంది దీన్ని రోజూ ప్రయాణం చేసే ఉద్యోగుల దృష్టిలో చూసుకుంటే వారానికి గంటల కొద్దీ టైమ్ సేవ్ అవుతుందని చెప్పొచ్చు.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications