ఇంకో 5 ఏళ్లలో 99% ఉద్యోగాలను AI వల్ల పోతాయి … మీ ఉద్యోగం కూడా ఇందులో ఉందో తెలుసుకోండి
ఇప్పుడు మనం డిస్కవర్ చేస్తున్న AI... అది కేవలం స్మార్ట్ టూల్ మాత్రమే కాదు, మనిషుల పనిని పూర్తి భర్తీ చేసేసే సాంకేతిక శక్తి. ప్రొఫెసర్ రోమన్ యాంపోల్స్‌కీ హెచ్చరించి చెప్తున్నది ఎమిటంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో మనం కాస్త షాకింగ్ రియాలిటీ చూస్తాం, ఎందుకంటే AI 99% ఉద్యోగాలను తీసుకుపోయి నిరుద్యోగులుగా మారిపోతారు. అంటే, మనం రోజువారీ పని చేస్తూ సంపాదిస్తున్న ఉద్యోగాల చాలా భాగం AI చేసే అవకాశం ఉంది.

ఎందుకీ ఈ హెచ్చరిక?
AI భవిష్యత్తు పై నిపుణుల అభిప్రాయాలు ఎక్కువగా ఒకే దిశలో ఉన్నాయి. "AI గాడ్‌ఫాదర్"గా ప్రసిద్ధి పొందిన జెఫ్రీ హింట్న్ ప్రకారం, తెల్లకోటు ఉద్యోగాలు అన్నీ AI చేత భర్తీ చేయబడతాయి, కొత్త ఉద్యోగాల అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే, ఆంత్రోపిక్ CEO డారియో అమోడీ కూడా హెచ్చరించారు. వచ్చే 1-5 సంవత్సరాల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు సగం AI చేత భర్తీ కావడం వల్ల, నిరుద్యోగం సుమారు 20%కి చేరవచ్చని అంచనా
వేస్తున్నారు. ఈ హెచ్చరిక ఒక్కరికి మాత్రమే కాదు, మొత్తం టెక్ ప్రపంచానికి ఒక పెద్ద సిగ్నల్.
ప్రొఫెసర్ యాంపోల్స్‌కీ అభిప్రాయం ప్రకారం, AGI (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) 2027 నాటికి మనుషులంత సామర్థ్యాన్ని పొందేలా వస్తుంది. దీని తర్వాత, మూడు సంవత్సరాల్లో ఉద్యోగ మార్కెట్ మొత్తం కూలిపోవచ్చు.
AI ద్వారా ట్రిలియన్ డాలర్ల విలువైన శ్రమ ఉచితంగా లభిస్తుందంటే, అదే పని మనుషులు ద్వారా చేస్తే ఖర్చు ఎక్కువ, అదే AI ద్వారా చేస్తే చాలా తక్కువ అవుతుంది. అందుకే కంపెనీలు ఉద్యోగాల కోసం మనుషుల మీద పెట్టుబడి పెట్టడం తగ్గిస్తాయి" అని ఆయన చెప్పారు.
AI కేవలం ఫిజికల్ పని మాత్రమే కాదు, మేధో సామర్థ్య కలిగిన పనులలో కూడా మనుషుల స్థానాన్ని తీసుకుంటుంది. కోడింగ్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్, అనలిసిస్ ఇవన్నీ AI చేత ఆటోమేట్ అవుతాయి. రిట్రైనింగ్ కూడా పని చేయదు, ఎందుకంటే AI అన్నీ తనే చేయగలదు. ఇక 10% నిరుద్యోగం గురించి ఆలోచించకండి, 99% ఉద్యోగాలు లొపమవుతాయంటూ ఊహించండి. ఇది మనం ఎప్పుడూ చూడని స్థాయి నిరుద్యోగం అవుతుంది" అని ఆయన చెప్పేశారు.
మనం ఏమి చేయాలి?
AI వేగంగా అభివృద్ధి చెందుతుందనేది వాస్తవం. మనుషులు ఏం చేస్తారో, ఏ ఉద్యోగాలు మిగిలే అవకాశం ఉందో ఆలోచించి దానికి తగ్గ నైపుణ్యాలు, క్రియేటివిటీ, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ని పెంపొందించుకోవడం అత్యంత అవసరం. మనం ఇలాంటి AI డొమైన్ లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవ్వకపోతే, ఉద్యోగ భద్రతకు పెద్ద సవాలు ఎదురవుతుంది.
ఇప్పటికే సింగపూర్, జర్మనీ, అమెరికా వంటి దేశాల్లో AI వల్ల ఉద్యోగాల పరిస్థితి మారినట్లు కనిపిస్తోంది. అక్కడ కొన్ని రొటీన్, రిపిటిటివ్ జాబ్స్ పూర్తిగా ఆటోమేట్ అయ్యాయి, దాంతో కొంతమంది ఉద్యోగులు నిరుద్యోగమయ్యారు. అదే సమయంలో, కొత్త టెక్ విభాగాలు, AI ట్రైనింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, కంటెంట్ క్రియేషన్ లాంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు ఏర్పడాయి. AI వల్ల కొంతమంది ఉద్యోగులు కోల్పోయినా, కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి, కాబట్టి మనం కూడా కొత్త స్కిల్స్ నేర్చుకుని ఈ మార్పుకు సిద్ధం అవ్వాలి.


Click it and Unblock the Notifications