Los Angeles Fire: గత వారం రోజులుగా అమెరికాను బెంబేలెత్తిస్తోంది లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో మెుదలైన కార్చిచ్చు. ప్రస్తుతం దీనిని అడ్డుకునేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఏర్పడుతున్న టొర్నాడోలు పరిస్థితులను అదుపులోకి రాకుండా అడ్డుకుంటున్నాయని తెలుస్తోంది.
ఈ తరుణంలో లాస్ ఏంజెల్స్ చుట్టుపక్కని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు మంటలకు 5-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ప్రధానంగా మంటవల్ల గాలితో పాటు ఎగిసిపడుతున్న బూడిద, కాలిన వాసన ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని చాలా మంది వాపోతున్నారు. అమెరికా చరిత్రలో ఇదొక అత్యంత ఘోరమైన అగ్నిప్రమాదంగా నిలిచింది.

మంటలు భారీగా విస్తరిస్తున్న వేళ అనేక నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. అధికారులు ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. దీంతో 150 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగిందని ఇప్పటి వరకు అంచనాల ప్రకారం వెల్లడైంది. అమెరికాలోని ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజ జేపీ మోర్గన్ అంచనా ప్రకారం ఇన్సూరెన్స్ చేసిన ప్రాపర్టీల నష్టం 20 బిలియన్ డాలర్లుగా అంచనా వేయబడగా.. బీమా చేయని నష్టం దాదాపు 100 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. మంటల వల్ల కలిగే నష్టాలు కాలిఫోర్నియా వార్షిక GDPలో నాలుగు శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
ప్రధానంగా అమెరికాలో ఇళ్లు చెక్కతో నిర్మిస్తారని మనందరికీ తెలిసిందే. ఈ కారణంగా మంటలకు దాదాపు 40,000 ఇళ్లు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. వీటిలో కొన్ని పూర్తిగా మంటలకు కాలి బూడిదయ్యాయని వార్తా కథనాల ప్రకారం తెలుస్తోంది. ఇందులో ఒక ఇంటి సగటు ధర 3 మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు అనేక ఇన్సూరెన్స్ కంపెనీలకు తలనొప్పిగా మారింది. భారీగా క్లెయిమ్స్ సెటిస్ చేయాల్సి రావొచ్చని వారు భావిస్తున్నారు. ఇది సదరు కంపెనీల ఆదాయాలపై పెను ప్రమాదాన్ని చూపవచ్చని తెలుస్తోంది.
ఈ పరిస్థితుల కారణంగా అమెరికాలోని ఇతర ప్రాంతాల కంటే లాస్ ఏంజెల్స్ ప్రాంతంలోని ప్రజలు తమ ప్రాపర్టీలు ఇన్సూర్ చేసేందుకు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావొచ్చని తెలుస్తోంది. పైగా ఈ ప్రాంతంలో వరదలు కూడా తరచుగా సంభవిస్తుంటాయి. 2024లో మాత్రమే, వాతావరణ సంబంధిత ప్రకృతి వైపరీత్యాల వల్ల 182.8 బిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటుడు నిక్ జోనాస్ ని పెళ్లి చేస్తుకున్న తర్వాత హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు. ఆమె కూడా ప్రస్తుతం అగ్నిప్రమాదం వల్ల సురక్షితంగానే ఉన్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు.
More From GoodReturns

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications