ముంబైకి చెందిన భార్యాభర్తలు ఒక బిల్డర్‌తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం, వారు తమ భూమిని బిల్డర్‌కి అప్పగిస్తే, ప్రతిగా బిల్డర్ నిర్దిష్ట సంఖ్యలో అపార్ట్‌మెంట్‌లు అందజేయాలని నిర్ణయించారు. బిల్డర్ సమయానికి ఆ అపార్ట్‌మెంట్‌లను అప్పగించకపోతే.. ఆ జాప్యానికి పరిహారంగా వారికి నగదు చెల్లించాలనే నిబంధన కూడా ఉంది. అయితే బిల్డర్ హామీ ఇచ్చిన గడువు లోపల ఫ్లాట్లను అందించడంలో విఫలమయ్యాడు. దీంతో అతను భార్యకు రూ. 1.85 కోట్లు, భర్తకు కూడా వేరుగా పరిహారం చెల్లించాడు. భార్య తన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)లో ఈ మొత్తం (రూ.1.85 కోట్లు)ను దీర్ఘకాలిక మూలధన లాభాలు (LTCG)గా చూపించింది.
అయితే ఆదాయపు పన్ను శాఖ మాత్రం ఈ పరిహారానికి సెక్షన్ 50C వర్తిస్తుందని అభిప్రాయపడింది. ఈ శాఖ ప్రకారం పరిహారం స్థానంలో స్టాంప్ డ్యూటీ విలువ రూ. 3.51 కోట్లు పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో ఆమె మూలధన లాభాలను ఎక్కువగా లెక్కించింది.డఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన ఆమె మొదట CIT (Appeals) వద్ద అప్పీల్ చేసుకుంది. CIT(A) పన్ను అధికారుల నిర్ణయాన్నే సమర్థించడంతో ఆమె ముంబైలోని ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT Mumbai) ని ఆశ్రయించింది.

తన వాదనలో ఆమె తెలిపినది ఏమిటంటే.. భూమిలో తనకు 50 శాతం, భర్తకు 50 శాతం వాటా ఉందని. భర్త కేసులో ఇప్పటికే CIT(A) సెక్షన్ 50C వర్తించదని తీర్పు ఇచ్చిందని, పన్ను శాఖ ఆ తీర్పును సవాలు చేయలేదని ఆమె పేర్కొంది. ITAT ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఇక్కడ అసలు బదిలీ అయినది భూమి స్వామ్య హక్కు కాదు, కానీ భూమిపై హక్కును బదిలీ చేసే హక్కును రద్దు చేసినందుకు అందుకున్న పరిహారం మాత్రమే అని గుర్తించింది.
ట్రిబ్యునల్ అక్టోబర్ 6, 2025 నాటి తన తీర్పులో (ITA No. 1997/MUM/2025) నగదు రూపంలో పొందిన పరిహారం స్థిరాస్తి అమ్మకానికి సంబంధించిన పరిగణన కాదు. ఇది ఫ్లాట్ల స్వాధీనంలో జాప్యం కారణంగా చెల్లించిన వడ్డీ/పరిహారం మాత్రమే. కాబట్టి సెక్షన్ 50C వర్తించదని ట్రిబ్యునల్ స్పష్టంగా పేర్కొంది. ఇది స్థిరాస్తి బదిలీకి సంబంధించిన లావాదేవీ కాదు.. అందుకే ఈ పరిహారం మూలధన లాభం కింద పరిగణించబడదు. ఇది కేవలం ఆలస్యానికి చెల్లించిన వడ్డీ రూపమని తెలిపింది.
ఏకేఎం గ్లోబల్ సంస్థకు చెందిన ట్యాక్స్ నిపుణుడు మనీష్ గార్గ్ మాట్లాడుతూ.. ఈ తీర్పు సెక్షన్ 50C యొక్క చట్టబద్ధమైన ఉద్దేశ్యాన్ని సరిగా ప్రతిబింబించింది. భూమి అమ్మకాల పరిగణన, ఆలస్య పరిహారం మధ్య తేడాను స్పష్టంగా గుర్తించిందని అన్నారు. SK పటోడియా LLP సంస్థకు చెందిన మిహిర్ తన్నా మాట్లాడుతూ.. సెక్షన్ 50C కేవలం మూలధన ఆస్తి బదిలీ సమయంలో మాత్రమే వర్తిస్తుంది. కానీ ఈ కేసులో భూమి హక్కులు బదిలీ అయిన తర్వాత, ఫ్లాట్ స్వాధీనంలో జాప్యానికి పరిహారం చెల్లించబడింది. కాబట్టి ఇది పన్ను విధించదగిన సంఘటన కాదని పేర్కొన్నారు.
ఈ తీర్పు దీర్ఘకాల రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో ఆలస్యంగా ఫ్లాట్లు పొందిన గృహ కొనుగోలుదారులకు కీలక దిశానిర్దేశం ఇచ్చింది. బిల్డర్ నుండి ఆలస్యం కారణంగా పొందిన పరిహారం మూలధన లాభం కింద పన్ను విధించరాదని ITAT ముంబై స్పష్టంగా చెప్పింది. ఇకపై ఇలాంటి పరిహారాలపై పన్ను శాఖలు సెక్షన్ 50C కింద పన్ను విధించే ప్రయత్నాలు చేయడానికి ముందు ఈ తీర్పును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
More From GoodReturns

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications