ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత చాలామంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను ఇప్పటికే ఫైల్ చేశారు. అయితే నెలలు గడిచినా రీఫండ్ ఇంకా రాలేదని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ వేలాది మంది తమ బ్యాంక్ ఖాతాల్లో రీఫండ్ జమ కావాలని ఎదురు చూస్తూ.. ఇన్‌కమ్ టాక్స్ వెబ్‌సైట్‌లో స్టేటస్‌ను చెక్ చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితిపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) చైర్మన్ రవి అగర్వాల్ తాజాగా స్పష్టతనిచ్చారు. రీఫండ్ జమ చేయడం ఒక సంక్లిష్టమైన ప్రక్రియ అని, దానికి సమయం పడటం సహజమేనని తెలిపారు.
రిటర్న్‌లో పేర్కొన్న లావాదేవీల వివరాలు.. ఆదాయానికి సంబంధించిన డిక్లరేషన్‌లు, TDS సంబంధిత గణనలు వంటి అంశాలను ఒకదాని తరువాత ఒకటి పరిశీలించాల్సి వస్తుందని ఆయన చెప్పారు. ముఖ్యంగా రీఫండ్ మొత్తం పెద్ద మొత్తంలో ఉంటే.. లేదా రిటర్న్‌లో ఉన్న వివరాలు అనుమానాస్పదంగా కనిపిస్తే మరింత లోతుగా పరిశీలించి తర్వాతే రీఫండ్ విడుదల చేయాల్సి వస్తుందని కూడా తెలిపారు. అయినప్పటికీ ఎక్కువమందికి రీఫండ్ ఈ నెలాఖర్లోగా జమయ్యే అవకాశముందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

అయితే రీఫండ్ ఆలస్యం కావడానికి ప్రభుత్వ వ్యవస్థల పరిశీలన మాత్రమే కాకుండా.. పన్ను చెల్లింపుదారులే రిటర్న్స్ ఫైలింగ్ సమయంలో చేసిన కొన్ని తప్పులు కూడా కారణమవుతున్నాయని రవి అగర్వాల్ తెలిపారు. చాలాసార్లు పన్ను చెల్లింపుదారులు బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వివరాలను తప్పుగా నమోదు చేస్తారు. ఈ తప్పిదం వల్ల రీఫండ్ పంపించే ప్రయత్నంలో బ్యాంకు తిరస్కరించి, రీఫండ్ ప్రాసెస్ పెండింగ్‌లో నిలిచిపోతుంది. అదే విధంగా బ్యాంక్ ఖాతాలోని పేరు, PAN కార్డులోని పేరుతో సరిపోయేలా లేకపోతే, చిన్న స్పెల్లింగ్ పొరపాటుగా ఉన్నా, రీఫండ్ నిలిచిపోవడం సాధారణమని అధికారులు చెబుతున్నారు.
ఇన్‌కమ్ టాక్స్ పోర్టల్‌లో ప్రి-వాలిడేట్ చేసిన బ్యాంకు ఖాతాల్లోకే రీఫండ్ విడుదల చేసే విధానం ప్రస్తుతం అమలులో ఉంది. ప్రీ-వాలిడేషన్ పూర్తి కాని ఖాతాల విషయంలో రీఫండ్ ఆగిపోతుంది. ఇంకా PAN-ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి. ఈ రెండు కార్డులు లింక్ చేయని పన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌ను పన్నుశాఖ నిలిపివేస్తోంది. అదనంగా, కొందరు రీఫండ్ మొత్తాన్ని లెక్కించడంలో పొరపాట్లు చేస్తున్నారు లేదా మినహాయింపుల కోసం చూపిన వివరాలను ప్రూఫ్‌లతో సమర్థించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పన్నుశాఖ స్పష్టత కోసం విచారణ మొదలుపెడుతుంది. విచారణ పూర్తయ్యే వరకు రీఫండ్ విడుదల చేయడం జరగదు.
రీఫండ్ స్టేటస్‌ని చెక్ చేయడం చాలా సులభం. పన్నుదారులు ఇన్‌కమ్ టాక్స్ అధికారిక e-filing పోర్టల్‌లో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి, 'View Filed Returns' విభాగంలోకి వెళ్లి, సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంచుకుంటే ఆటోమేటిక్‌గా రీఫండ్ స్థితి కనిపిస్తుంది. రీఫండ్ బ్యాంక్ ద్వారా నిరాకరించబడితే, అదే పోర్టల్‌లో 'Refund Reissue Request' ద్వారా మళ్లీ రీఫండ్ కోరుకోవచ్చు.
రిఫండ్ ఆలస్యమైందని కేవలం ఎదురు చూడటం కాదు, రిటర్న్ ఫైలింగ్ సమయంలో వివరాలు సరిగా అందించామా? బ్యాంకు ఖాతా వాలిడేషన్ పూర్తయ్యిందా? PAN-ఆధార్ లింక్ చేశామా? అనే విషయాలను పన్నుదారులు స్వయంగా జాగ్రత్తగా పరిశీలించుకోవాలని CBDT అధికారులు సూచిస్తున్నారు. దీంతో పాటుగా ఐటీ శాఖ నుంచి వచ్చే మెయిల్స్, SMS నోటిఫికేషన్స్‌ను తప్పకుండా చదవాలని వారు సూచిస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications