బంగారం ఆభరణాలు పెట్టుబడి కాదా? అసలు లాభం రావడానికి ఎన్ని ఏళ్లు పడొచ్చో తెలుసా!
భారతీయులు ఎప్పటి నుండో బంగారం అంటే ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు. పండుగలలో, వివాహాల సీజన్‌లో, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలంటే "బంగారం ఆభరణాలు" మోస్ట్ ప్రిఫర్డ్. కానీ CA నితిన్ కౌశిక్ చెప్పినట్లుగా, బంగారం ఆభరణాలు పెట్టుబడిగా చూసుకుంటే, లాభం రావడానికి 5-7 సంవత్సరాలు పడవచ్చు.
ఆభరణం vs పెట్టుబడి
చిన్నప్పటి నుండే మనం అన్నిటికన్న ముందు "బంగారం కొని పెట్టుకో" అని వింటూ వచ్చాము. కానీ నిజానికి, మనం ఎక్కువగా పెట్టుబడి కోసం కాకుండా, ఆభరణాల కోసం బంగారం కొనుగోలు చేస్తాం. చార్టర్డ్ అకౌంటెంట్ నితిన్ కౌశిక్ చెప్పినట్టే, ఈ మధ్య చాలా మంది 24K స్వచ్ఛ బంగారం కంటే 22K, 18K లేదా 14K ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.

24K బంగారం అంటే 99.9% స్వచ్ఛం కలిగిన, పెట్టుబడికి సరైన బంగారం. అంటే దీన్ని కొనడం వల్ల అదీ పెట్టుబడికి బాగా ఉపయోగపడుతుంది. కానీ 22K బంగారం కేవలం 91.6% స్వచ్చత, 18K 75%, 14K 58.5% మాత్రమే స్వచ్ఛ బంగారం కలిగివుంటుంది. అంటే, మీరు రూ. 50,000 22K ఆభరణంలో పెట్టినా, నిజానికి కేవలం సుమారు రూ. 45,800 విలువైన బంగారం మాత్రమే అందుతోంది.
ఆభరణం = భావోద్వేగాలు, పెట్టుబడి గ్రేడ్ బంగారం = సంపద పెరుగుదల కాబట్టి పెట్టుబడి కోసం బంగారం కొనేటప్పుడు, స్వచ్ఛమైన బంగారం (24K) లేదా BIS హాల్‌మార్క్ కలిగిన బార్స్, కాయిన్స్ ను ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.
బంగారం ఆభరణాలు నిజంగా మనసును ఆకట్టుకునేలా ఉంటాయి. కానీ వాటి వెనక దాగి ఉన్న ఖర్చులు మన లాభాన్ని బాగా తగ్గిస్తాయి. ఉదాహరణకి, ఒక ఆభరణం కొనుగోలు చేసే సమయంలో మెకింగ్ ఛార్జీలు 10% నుంచి 25% వరకు ఉంటాయి. డిజైనర్ పీసులు అయితే ఇంకా ఎక్కువ వసూలు చేస్తారు. అదనంగా, మీరు 3% GST కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఇంతటితో ఆగదు మీరు ఆ ఆభరణాన్ని మళ్లీ అమ్మాలనుకుంటే, జ్యూయెలర్స్ మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకే కొనుగోలు చేస్తారు. ఈ కారణంగా, మీరు పెట్టిన డబ్బు తిరిగి వచ్చి లాభం చూపడానికి కనీసం 5-7 సంవత్సరాలు పడుతుంది. 2004లో 10 గ్రాముల 24K బంగారం ధర రూ. 6,307. 2024కి అది సుమారు రూ. 78,245. CAGR 13-14%, అంటే ప్రతి 5.5 సంవత్సరాల్లో డబ్బు రెండింతలు అవుతుంది.
బంగారం అంటే మన దేశానికి మాత్రమే కాదు, మొత్తం ప్రపంచానికి కూడా చాలా విలువైన ఆస్తి. భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. మన ఇండియన్ కుటుంబాల దగ్గరే సుమారు 25,000 టన్నుల బంగారం ఉంది, ఇది దేశ GDPలో దాదాపు 40% విలువ.
అంతే కాకుండా, 2023లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు 1,000 టన్నుల బంగారం కొనుగోలు చేసి తమ రిజర్వులను బలపరచుకున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం మొత్తం నుంచి సుమారు 2,16,000 టన్నుల బంగారం తీయబడింది. కానీ కొత్తగా వచ్చే మైనింగ్ మాత్రం చాలా తక్కువ. సంవత్సరానికి కేవలం 1.5%-2% మాత్రమే.
పెట్టుబడిగా బంగారం కొనాలనుకునే వాళ్లకి CA కౌశిక్ కొన్ని సింపుల్ ఉపయోగకరమైన సూచనలు ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం, మీరు బంగారాన్ని నిజమైన పెట్టుబడి కోణంలో చూడాలనుకుంటే 24K బార్స్ లేదా కాయిన్స్ BIS hallmark ఉన్నవి కొనడం మంచిది. ఇవి ఎక్కువ స్వచ్ఛతతో ఉండి, రీసేల్ వాల్యూ కూడా స్పష్టంగా ఉంటుంది.
అదేవిధంగా, నేటి కాలానికి సరిపోయే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. Gold ETFs, Gold SIPs వంటివి. ఇవి స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం విలువలో డైరెక్ట్‌గా పెట్టుబడి పెట్టే మార్గాలు, నిల్వ టెన్షన్ లేకుండా. అలాగే, సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBs) కూడా చాలా మంచి ఆప్షన్. వీటిని గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది, కాబట్టి రిస్క్ తక్కువ, పైగా ఫిక్స్‌డ్ ఇంటరెస్ట్ కూడా వస్తుంది.
బంగారం ఎప్పుడూ కొనాలి?" అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. బంగారం ధరలు పండుగలు, వివాహాల సీజన్‌లో ఎక్కువ అవుతాయి. కానీ ఆఫ్-సీజన్‌లో (ఉదాహరణకు, జూలై-ఆగస్టు) కొంచెం తక్కువగా ఉండే అవకాశముంది. కాబట్టి, పెట్టుబడి కోసం ఆఫ్-సీజన్‌లో కొనడం మంచిది. "బంగారం కొంటే పెద్ద మొత్తం కావాలి" అనిపిస్తుంది. కానీ Gold SIPs ద్వారా నెలకు 500-1000 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. కాఫీ ఖర్చు తగ్గించి కూడా బంగారంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నమాట.
ఇప్పుడు బంగారం ధరలు రికార్డ్ లెవెల్‌కి వచ్చాయి. చాలా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు చెబుతున్నట్టు ఇంకా పెరగొచ్చు కూడా. అంటే ఇప్పుడే కొంత పెట్టుబడి పెడితే, తర్వాత కాలంలో లాభం వచ్చే అవకాశం ఎక్కువ. అంటే, ఆభరణాలు మనసుకు ఆనందం కోసం బాగుంటాయి, కానీ నిజంగా సంపద పెంచుకోవాలంటే స్వచ్ఛమైన పెట్టుబడి ఆప్షన్స్ వైపు చూడాలి.


Click it and Unblock the Notifications