ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ తాజా వార్నింగ్‌.. పశ్చిమాసియాలో అసలేం జరుగుతోంది..

పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ భగ్గుమనేలా ఉన్నాయి. ఇరాన్-యుఎస్ మధ్య నెలకొన్న శాంతి ఒప్పందంపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వార్నింగ్ మధ్య పరిస్థితులు మళ్లీ క్లిష్టతరంగా మారాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు.

తమ సర్వోన్నత నాయకుడు అయతోల్లా అలీ ఖమేనీ మరణానంతరం టెహ్రాన్‌లో రోజుల తరబడి అంత్యక్రియలు జరుగుతున్నప్పటికీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ఏమాత్రం తగ్గకుండా ధిక్కార వైఖరిని కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. వాషింగ్టన్‌తో వెంటనే ఒక అనుకూలమైన ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో తామే స్వయంగా రంగంలోకి దిగి "పని పూర్తి చేస్తాం" అంటూ సైనిక చర్యకు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.

Donald Trump Trump Iran warning US Iran relations Khamenei funeral Iran news US foreign policy Middle East Iran tensions Trump statement geopolitics US military Iran conflict international news Ayatollah Khamenei US Iran conflict global politics breaking news world news diplomacy Middle East tensions -

తాము ఇరాన్ వంతెనలను కేవలం ఒక గంటలోనే కూల్చివేయగలమని.. వారి విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేయగలమని హెచ్చరిస్తూ ఆర్థిక, మౌలిక సదుపాయాల ఒత్తిడిని పెంచే బెదిరింపులను ఆయన పునరుద్ఘాటించారు. యుద్ధం ద్వారా అక్కడి 91 మిలియన్ల ప్రజలపై ప్రభావం చూపడం ఇష్టం లేనందునే తాను ఒప్పందానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు.

Also Read

నిజానికి పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగినప్పటికీ, అవి ఎటువంటి ఆచరణాత్మక ఫలితాలను ఇవ్వలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు జరిపిన తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవడంతో.. దౌత్య చర్చల కోసం ఇరుపక్షాల మధ్య 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. టెహ్రాన్‌ను అణ్వాయుధ అభివృద్ధి నుండి నిరోధించడం, అత్యంత సుసంపన్నమైన యురేనియంను తిరిగి అప్పగించేలా చేయడం వంటి లక్ష్యాలతో వాషింగ్టన్ ఈ చర్చలు జరిపింది. అయితే గత వారం జరిగిన అమెరికా-ఇరాన్ పరోక్ష చర్చలు శాశ్వత శాంతి దిశగా ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి.

ఫిబ్రవరి నాటి అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల వల్ల ఇరాన్ బలహీనపడటానికి బదులుగా మరింత ఐక్యంగా, ధిక్కారంగా వ్యవహరిస్తోందని ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి. సోమవారం టెహ్రాన్‌లో జరిగిన ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపులో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి కవాతు నిర్వహించారు. ఆ ఊరేగింపులో సంతాపకులు అమెరికా, యూకే జెండాలను తగలబెట్టడమే కాకుండా..ట్రంప్‌ను చంపండి" (KILL TRUMP) అని నల్లటి అక్షరాలతో రాసి ఉన్న ఎరుపు రంగు ప్లకార్డులను ప్రదర్శిస్తూ అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ప్రతీకారం తీర్చుకోవాలని నినాదాలు చేశారు. ఒకవైపు అంతర్గతంగా తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, ప్రతీకార జ్వాలలు వ్యక్తమవుతుండగా.. మరోవైపు ట్రంప్ తన హెచ్చరికల తీవ్రతను పెంచడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం మరింత ముదిరింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+