Adani Shares: ఈ వీకెండ్ డే నాడు దేశీయ పారిశ్రామికదిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన షేర్లు.. నేడు స్టాక్ మార్కెట్‌లో అమాంతం పెరిగాయి. ఇన్వెస్టర్లపై కనకవర్షాన్ని కురిపించాయి. ప్రత్యేకించి- మూడు సంస్థల షేర్లు.. ఇంట్రాడే ర్యాలీని నమోదు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
1. అదాని ఎంటర్‌ప్రైజెస్: అదాని ఎంటర్‌ప్రైజెస్ షేర్లు నేడు మార్కెట్‌లో ఉవ్వెత్తున ఎగిశాయి. వాటి ధరలో ఏడు శాతానికి పైగా పెరుగుదల కనిపించింది. బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో రూ. 3,233.20 పైసల వద్ద ఈ ఉదయం ఆరంభమైన ట్రేడింగ్ బ్రేకుల్లేని బండిలా దూసుకుపోయింది.

మధ్యాహ్నం 3:20 నిమిషాల సమయానికి గరిష్ఠంగా రూ.3,432.60 పైసలకు చేరింది. అంటే దాదాపుగా 237 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ. ఏడు శాతం కంటే దిగువకు మాత్రం వాటి ట్రేడింగ్ నమోదు కాలేదు. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో అదాని ఎంటర్‌ప్రైజెస్ షేర్ల ధరలు ఎగబాకడం ఇదే తొలిసారి.
2. అదాని పవర్: అదాని పవర్ షేర్ల ధరలో కూడా ఇదే తరహా పెరుగుదల కనిపించింది. వాటి ధరలో 10 శాతం వరకు పెరుగుదింది. బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో రూ. 706.80 పైసల వద్ద ఈ ఉదయం ఆరంభమైన ట్రేడింగ్.. గంటగంటకూ మెరుగుపడుతూ వెళ్లింది. మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి గరిష్ఠంగా రూ.789.80 పైసల వద్ద ట్రేడింగ్ అయింది. 73 రూపాయల మేర పెరిగింది.
3. అదాని టోటల్ గ్యాస్: అదాని టోటల్ గ్యాస్ షేర్ ప్రైస్ సైతం భారీగా పెరుగుదల బాట పట్టింది. వాటి ధరలో 9.32 శాతం వరకు పెరుగుదల చోటు చేసుకుంది. బోంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజీల్లో రూ. 762.55 పైసల వద్ద ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభం కాగా.. కొన్ని గంటల్లోనే 1,000 రూపాయలను దాటేసింది. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి 1,045 రూపాయలకు చేరింది.


Click it and Unblock the Notifications