gig workers strike : న్యూ ఇయర్ వేడుకల కోసం మీరు భారీ ప్లాన్స్ వేసుకుంటున్నారా? డిసెంబర్ 31న రాత్రి వేడివేడిగా ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా? అయితే మీకు ఇది చేదు వార్త అవ్వొచ్చు. ఎందుకంటే.. డిసెంబర్ 31న డెలివరీ బాయ్స్ స్ట్రైక్ చేస్తున్నారు. మనకు కావాల్సిన వస్తువులను, ఆహారాన్ని నిమిషాల్లో డెలివరీ చేసే గిగ్ వర్కర్స్ ఆ రోజు దేశవ్యాప్తంగా భారీ సమ్మెకు పిలుపునిచ్చారు. అసలు ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారు? వారి సమస్య ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) తో పాటు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఈ సమ్మెను ప్రకటించాయి. కేవలం స్విగ్గీ, జొమాటో మాత్రమే కాదు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, జెప్టో, బ్లింకిట్ వంటి దిగ్గజ సంస్థల డెలివరీ బాయ్స్ అందరూ ఇందులో పాల్గొంటున్నారు.
ఎందుకీ సమ్మె? వారు ఏం కోరుతున్నారు?
క్రిస్మస్ రోజే ఒకసారి సమ్మె చేసినా యాజమాన్యాల్లో స్పందన లేకపోవడంతో, ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మరోసారి గిగ్ వర్కర్స్ స్ట్రైక్ (gig workers strike) చేపడుతున్నారు. ఈ గిగ్ ఎకానమీలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి ప్రధాన డిమాండ్లు ఇవే..
- సామాజిక భద్రత (Social Security): గిగ్ వర్కర్లకు కనీస ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పించాలి.
- అల్గారిథమ్ నియంత్రణ: డెలివరీ టార్గెట్లు, ఇన్సెంటివ్‌లు అన్నీ యాప్ లోని అల్గారిథమ్స్ నిర్ణయిస్తున్నాయి. దీనివల్ల పారదర్శకత లోపిస్తోందని, పనిభారం పెరుగుతోందని వారు ఆరోపిస్తున్నారు.
- 10- మినిట్స్ డెలివరీ వద్దు: 10 నిమిషాల్లో డెలివరీ చేయాలనే నిబంధన వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రాణాల కంటే కస్టమర్ సౌకర్యం ముఖ్యం కాదని వారు గట్టిగా చెబుతున్నారు.
ఆదాయం తగ్గుతోంది.. కష్టాలు పెరుగుతున్నాయి!
పండగలు, వారాంతాల్లో విశ్రాంతి లేకుండా పనిచేసే ఈ వర్కర్లకు సరైన వేతనం అందడం లేదు. యాప్ కంపెనీలు తరచూ ఇన్సెంటివ్ రూల్స్ మార్చడం వల్ల నెల నెలా ఎంత ఆదాయం వస్తుందో తెలియని అయోమయం నెలకొంది. అంతేకాకుండా ఎటువంటి కారణం లేకుండా వర్కర్ ఐడీలను బ్లాక్ చేయడం వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు.
కస్టమర్లకు ఇబ్బందులు తప్పవా?
మెట్రో నగరాలతో పాటు టైర్-2 పట్టణాల్లో కూడా ఈ సమ్మె ప్రభావం ఉండబోతోంది. డిసెంబర్ 31న వేలాది మంది వర్కర్లు విధులకు హాజరుకాకపోతే.. మీ ఆర్డర్లు ఆలస్యమవ్వడమో లేదా పూర్తిగా రద్దవ్వడమో జరగొచ్చు. కేవలం తమ కష్టాలను ప్రభుత్వం దృష్టికి, కంపెనీల దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు.
మరి ఈ సమ్మెపై కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ గిగ్ వర్కర్స్ స్ట్రైక్ (gig workers strike) కి కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వాలు గిగ్ వర్కర్స్ చట్టాలపై పని చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గిగ్ వర్కర్ల సమ్మె మరింత ప్రభావం చూపనుంది. మరి ప్రభుత్వాల కంపెనీలతో మధ్యవర్తిత్వం వహించి సమస్యలను పరిష్కరిస్తుందేమో చూడాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications