ఫిబ్రవరి1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మార్కెట్లు భారీ నష్టాల్లో క్లోజ్ అయ్యాయి. సెన్సెక్స్ దాదాపు వెయ్యి, నిఫ్టీ దాదాపు 400 పాయింట్ల సమీపంలో నష్టపోయింది. మార్కెట్లకు నిర్మలమ్మ బడ్జెట్ రుచించలేదని నిపుణులు వెల్లడించారు. అయితే సోమవారం కాస్త ఉపశమనం కలిగి, మంగళవారం భారీ లాభాల్లోకి వచ్చాయి. అయితే బడ్జెట్ రోజున భారీ నష్టాలపై నిర్మలమ్మ స్పందించారు.

బడ్జెట్ రోజు నష్టాలు ఎందుకు?
వీకెండ్ కావడంతో సూచీలు భారీగా నష్టపోయాయని నిర్మల చెప్పారు. ఫిక్కీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ రోజున సెన్సెక్స్ ఎందుకు నష్టాలను చవి చూసిందని ఒకరు ప్రశ్నించారు.

వీకెండ్ కావడంతో..
దానికి నిర్మల స్పందిస్తూ.. కానీ ఈ రోజు (సోమవారం) మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయని, శనివారం ఇన్వెస్టర్లు వీకెండ్ మూడ్‌లో ఉన్నారని చెప్పారు. ఈ రోజు నిజమైన పని మూడ్‌లోకి వచ్చారన్నారు. ఈ రోజు ఎక్కువ లాభాలు రాకపోవచ్చు.. కానీ కొంతమేరకైతే సంతోషంగానే ఉన్నాయన్నారు.

మందగమనం నేపథ్యంలో..
ఆర్థిక మందగమనం నుంచి బయటపడేందుకు గతంలో చేసినట్లుగా హడావుడి నిర్ణయాలు కాకుండా మంచి నిర్ణయాలు తీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నామని నిర్మల అన్నారు. సేకరించిన డబ్బులు ఎక్కడకు వెళ్తున్నాయో తాము చూపిస్తున్నామని, తదనగుణంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చని చెప్పారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications