స్టాక్ మార్కెట్లు సోమవారం(డిసెంబర్ 6) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత ఏ దశలోను కోలుకోలేదు. పైగా అంతకంతకూ దిగజారాయి. సెన్సెక్స్ 950 పాయింట్ల మేర పతనమై 57,000 దిగువన ముగిసింది. నిఫ్టీ 17000 పాయింట్ల దిగువన ముగిసింది. ఉదయం స్వల్ప నష్టాల్లో ప్రారంభమై, అదే నష్టాలతో ఫ్లాట్‌గా కనిపించింది. కానీ ఆ తర్వాత మధ్యాహ్నం సమయానికి భారీగా నష్టపోయింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, బలహీన రూపాయి, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు స్థిరంగా కొనసాగడం వంటి అంశాలు దెబ్బతీశాయి. డాలర్ మారకంతో రూపాయి 75.42 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 950 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ నేడు 57,778.01 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,781.46 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,687.62 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,209.05 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,216.75 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,891.70 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 949.32 (1.65%) పాయింట్లు నష్టపోయి 56,747.14 పాయింట్ల వద్ద, నిఫ్టీ 284.45 (1.65%) పాయింట్లు పతనమై 16,912.25 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ నేడు 1100 పాయింట్ల మేర పైకి కిందకు కదలాడింది.

టాప్ లూజర్స్
ఆటో, ఐటీ, ఫార్మా రంగాలు భారీగా నష్టపోయాయి. ఈ స్టాక్స్ దాదాపు రెండు శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా ఒక్కొక్కటి ఒక శాతం చొప్పున పతనమయ్యాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యూపీఎల్ నిలిచింది. నేటి టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంకు, టాటా కన్స్యూమర్ లిమిటెడ్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్‌సీఎల్ టెక్ ఉన్నాయి. హెవీ వెయిట్స్ రిలయన్స్ 1.76 శాతం, టీసీఎస్ 3 శాతం, ఇన్ఫోసిస్ 2.3 శాతం మేర క్షీణించాయి.

రూ.4.27 లక్షల కోట్లు హుష్ కాకి, అందుకే..
నేడు సెన్సెక్స్ 950 పాయింట్లు క్షీణించగా, నిఫ్టీ 17,000 పాయింట్ల దిగువన ముగిసింది. నేడు ఐటీ స్టాక్స్ భారీగా పతనమయ్యాయి. మార్కెట్ పతనం నేపథ్యంలో ఇన్వెస్టర్ల సంపద ఈ రోజు ఒక్కరోజే రూ.4.27 లక్షల కోట్లు తగ్గింది.
ఫెడరల్ రిజర్వ్ రిలీఫ్ మెజర్స్‌ను ఊహించిన దాని కంటే ముందే వెనక్కి తీసుకుంటుందనే అంచనాలు మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణం. అదే సమయంలో ఒమిక్రాన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. దీంతో మున్ముందు ఏమవుతుందోననే ఆందోళనతో ఇన్వెస్టర్లు ప్రస్తుత స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ కోసం మొగ్గు చూపుతున్నారు.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications