కొన్ని ఏళ్ల క్రితం దుకాణాల్లో రూ. 1, రూ. 2 ప్యాకెట్లు రాజ్యమేలేవి. చిన్న చిల్లరతో కూడా ఏదో కొనుక్కోవచ్చు అన్న ఉత్సాహం ఉండేది. కానీ సమయం మారింది, ప్రజల ఖర్చు సామర్థ్యం పెరిగింది, అలవాట్లు కూడా మారిపోయాయి. ఇప్పుడు దుకాణాల కౌంటర్‌లపై ఎక్కువగా కనిపించేవి రూ. 5, రూ. 10 ప్యాకెట్లు. ఇవి కేవలం చవక ధరల ఉత్పత్తులు కావు వినియోగదారుల మనసులో నమ్మకం, సౌలభ్యం అనే భావాన్ని తెప్పించినవి ఈ చిన్న ప్యాకెట్లు. ఇవే ఈ రోజు FMCG వేగంగా అమ్ముడవుతున్న వినియోగ వస్తువులు రంగానికి పునాది వేసిన ప్రధాన శక్తిగా నిలిచాయి.

ఎందుకు కంపెనీలు రూ. 5, రూ. 10 ని వదులుకోవట్లేదు?
ఇటీవల GST తగ్గింపులు వచ్చినా, చాలా కంపెనీలు మాత్రం వెంటనే ధరలు తగ్గించడాన్ని పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా ధర తగ్గిస్తే, తర్వాత మళ్లీ పెంచడం కష్టమవుతుంది. అందుకే వాళ్లు వేరే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అదేంటంటే, ప్యాక్ ధరను అలాగే ఉంచి, దానిలో వచ్చే పరిమాణం ను కొంచెం పెంచటం.
ఇలా చేస్తే వినియోగదారుడికి కూడా "ఇప్పటి కంటే కొంచెం ఎక్కువ వస్తోంది" అన్న ఫీల్ వస్తుంది, కంపెనీలకు కూడా ధర తగ్గించినట్టు కనిపించకుండానే GST లాభం వినియోగదారుడికి చేరుస్తున్నామన్న చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. ఈ విధానం వల్ల మార్కెట్‌లో ధరల స్థిరత్వం కూడా కాపాడబడుతుంది.
దీనికి కారణం చాలా సింపుల్. ఒకసారి ఉత్పత్తి ధర మార్చేస్తే, దానికి అనుగుణంగా కొత్త ప్యాకేజింగ్ డిజైన్ చేయాల్సి వస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూటర్లకు, షాప్ యజమానులకు కొత్త ధరల వివరాలు తెలియజేయాలి. అంతేకాకుండా, కస్టమర్లు పాత ధరకు అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి, ఒక్కసారిగా ధర మార్చడం వాళ్ల మనస్తత్వంపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ మొత్తం ప్రక్రియ టైమ్ కూడా పడుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. అందుకే చాలా కంపెనీలు ధర మార్చడం కన్నా ప్యాక్ పరిమాణం పెంచడమే ఇష్టపడతాయి. అందుకే, ధర తగ్గించడమే కాకుండా పాత రూ. 5, రూ. 10 ధరలే కొనసాగిస్తూ, కొద్దిగా ఎక్కువ పరిమాణం ఇచ్చే ప్లాన్ చేస్తున్నారు.
రౌండ్ నంబర్లు అంటే మనకు చాలా ఫ్యామిలియర్. రూ. 5, రూ. 10 లాంటి మొత్తాలు ఎలాంటి ఆలోచన లేకుండా ఖర్చు చేయగల చిన్న మొత్తంలా అనిపిస్తాయి. గ్రామీణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో రోజువారీ కూలీలు, విద్యార్థులు, తక్కువ ఆదాయం గల కుటుంబాలే ఈ ప్యాకెట్ల ప్రధాన కస్టమర్లు. వారికీ ఇవి "చిన్న ఖర్చు" అన్న భావనను కలిగిస్తాయి, అందుకే కొనుగోలు కూడా చాలా సులభంగా జరుగుతుంది. ఉదాహరణకు రూ. 15 అంటే "కొంచెం ఖరీదైంది" అనిపిస్తే, రూ. 10 కి "చెయ్యొచ్చుగా" అనిపిస్తుంది. ఇలాంటి చవక ధరల కారణంగానే FMCG కంపెనీలు దేశవ్యాప్తంగా భారీ వాల్యూమ్‌ను దక్కించుకుంటున్నాయి.
ఉదాహరణకి, పార్లే బిస్కెట్లు దాదాపు అన్ని చోట్ల రూ. 5, రూ.10 ప్యాక్‌లలోనే కనిపిస్తాయి. ఈ కంపెనీ ప్రీమియం మార్కెట్ వైపు వెళ్లకుండా, వాల్యూమ్ మీద దృష్టి పెట్టడం వల్ల ఇప్పటికీ భారీ మార్కెట్‌ను కంట్రోల్ చేస్తోంది. ఈ ధరలకే సరిపోయేలా మొత్తం సరఫరా చైన్‌నే రూపొందించారు. ప్యాకేజింగ్ సైజులు, కార్టన్ సైజులు, షెల్ఫ్ స్పేస్, రిటైలర్ మార్జిన్లు అన్నీ ఈ ధరలకే సెట్ అయ్యాయి. ఒక బ్రాండ్ రూ. 10 నుండి రూ. 12కి ధర పెంచితే, మరో బ్రాండ్ అదే ప్యాక్‌నురూ. 10కే ఇస్తే కస్టమర్ వెంటనే ఆ బ్రాండ్ వైపు మారిపోతాడు.
ఇక్కడ బ్రాండ్ లాయల్టీ కంటే ధర లాయల్టీయే ఎక్కువ. ఒకప్పుడు రూ. 1, రూ. 2 ధరల ప్యాకెట్లు దుకాణాల్లో సాధారణంగా కనిపించేవి. తర్వాత కాలంలో రూ. 5 ప్యాకెట్లు బేసిక్‌గా మారాయి. ఇప్పుడు ఆ స్థానం రూ. 10 ప్యాకెట్లదిగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రూ.10 ధర సులభంగా అంగీకరించబడుతోంది. అంటే, కస్టమర్లు ఏ బ్రాండ్ అనేది కన్నా, ఆ ప్యాకెట్ ధర ఎంత అనేదే ముఖ్యంగా చూస్తున్నారు. అందుకే ఇప్పుడు రూ. 10 ప్యాకెట్ కొత్త బేసిక్ ప్రైస్‌గా నిలుస్తోంది.
ఇది వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగిన సంకేతం అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా యువతను లక్ష్యంగా చేసుకుని తయారయ్యే స్నాక్స్, టాయిలెట్రీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులు ఇప్పుడు ఎక్కువగా రూ.10 ప్యాక్‌లలోనే అందుబాటులోకి వస్తున్నాయి. భవిష్యత్తులో మరింత మంది మధ్యతరగతిలోకి చేరుతున్న కొద్దీ, రూ. 5 ప్యాక్‌ల కంటే రూ. 10 ప్యాక్‌లే ప్రధాన బేసిక్ ప్రైస్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది.
ధరలు, పన్నులు, ఇన్పుట్ ఖర్చులు మారినా, ఈ ధర స్థిరత్వం త్వరగా కదలదు. ఇందులోనే FMCG రంగం సక్సెస్ సీక్రెట్ దాగి ఉంది. చిన్న ధర, పెద్ద వాల్యూమ్!.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications