భారతదేశంలో పట్టణాలలో జీతాలు పెరుగుదల, మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పటికీ అర్థికంగా జీవించడం అనేది భారంగా మారింది. ఈ కాలంలో జీతాలు లక్షల్లో వస్తున్నా పట్టణాల్లో నివసించాలంటే భయంతో వణుకుతున్నారు. దీనికి కారణం పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. ఇల్లు కొనాలన్నా, అద్దెకు ఉండాలన్నా వచ్చే జీతం మొత్తం దానికే సరిపోతోంది. రోజు రొజుకు పెరుగుతున్న బాధ్యతలు, జీవనశైలి వ్యయాలు, కుటుంబ అంచనాలు అన్ని మధ్యతరగతి జీవుల కష్టాలను పెంచుతున్నాయే కాని తగ్గించడం లేదు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ డిబేట్ వైరల్ అవుతోంది. రూ.25 లక్షల ఆదాయం వచ్చినా కూడా సౌకర్యవంతమైన మధ్యతరగతి జీవితానికి అది సరిపోదు అనే దానిపై ఈ హాట్ డిబెట్ నడుస్తోంది. అంత జీతం సంపాదిస్తున్న కొడుకు తల్లిదండ్రులకు ఇచ్చిన వార్షికోత్సవ బహుమతి ఆ తండ్రిలో అనేక ఆర్థిక భయాలను కలిగిస్తోందనేది ప్రధాన పాయింట్ గా ఈ చర్చ జరుగుతోంది. ముంబైకి చెందిన 24 ఏళ్ల ప్రొఫెషనల్ రెడ్డిట్ లో తన అనుభవాన్ని పంచుకున్నాడు.
ఆ పోస్ట్ ప్రకారం.. తన తల్లిదండ్రుల 40వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారిని దుబాయ్‌కి ఒక వారం పర్యటనకు తీసుకెళ్లాలని కొడుకు ప్లాన్ చేశాడు. వారిద్దరూ తమ జీవితంలో ఎప్పుడూ విదేశాలకు వెళ్లకపోవడం వల్ల ఇది ఒక ప్రత్యేక బహుమతిగా ఆకొడుకు భావించాడు. అయితే ఈ ఆలోచనను తండ్రితో పంచుకున్నప్పుడు అతను ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితిని తలుచుకుని భయపడ్డాడు.

కొడుకు ఏడాది రూ. 25 లక్షలు సంపాదిస్తున్నా.. రూ. 4 లక్షలు దుబాయ్ ట్రిప్పుకు ఖర్చు చేయడం రిస్క్ తో కూడుకున్నదని తండ్రి భయపడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఆ కుటుంబం మొత్తం పొదుపులు కోటి రూపాయలు దాటాయి. అయినా దుబాయ్ ట్రిప్ వెళ్లడానికి ఆ తండ్రికి ధైర్యం సరిపోలేదు. భవిష్యత్తు ఖర్చులు, కొడుకు వివాహం, ఇల్లు కొనుగోలు, ముంబైలో అధిక జీవన వ్యయం వంటి ఆలోచనలతో ఒక్కసారిగా వణికిపోయాడు.
దుబాయ్ ట్రిప్ ఏమీ అవసరం లేదు. డబ్బులు దుబారా ఖర్చు చేస్తే రేపటినాడు రోడ్డు మీదకు రావాల్సి ఉంటుందని కొడుకును మందలించాడు. ఇప్పుడే స్థిరత్వం లేదు, భవిష్యత్తు కోసం ప్రణాళికలు అవసరమని కొడుకుకు సలహా ఇచ్చాడు. దీనిని అతను రెడ్డిట్ లో పంచుకోగా అనేక ప్రశ్నలకు ఈ పోస్ట్ వేదికగా నిలిచింది. హాట్ డిబేట్ కు వేదికయింది. కొందరు పెళ్లికి రూ. 70 లక్షలు ఖర్చు చేయడం దుబారాకు నిదర్శనమని తెలిపారు.
మరికొందరు అధిక ఆదాయం వస్తున్నప్పటికీ చాలామంది మధ్యతరగతి జీవితాలు లాగానే పరిగణిస్తారని తెలిపారు. దీనికి కారణం ప్రమాణాలు మారిపోవడమని తెలిపారు. కోట్లలో సంపాదించే వ్యక్తులు కూడా ధనవంతులుగా భావించరని ఆదాయపు పన్ను శాఖలో పనిచేసే ఉద్యోగి తన అభిప్రాయాన్ని తెలిపారు. అసలు సంపద అంటే పెద్దగా బాధ్యతలు లేకపోవడం, భవిష్యత్తులో పెద్ద ఖర్చులు లేని స్థితి అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.
తండ్రి దృష్టిలో చెప్పాలంటే కొడుకు జీతం ఆకర్షణీయంగా ఉన్నా అది కుటుంబాన్ని పోషించేందుకు.. భవిష్యత్తు అవసరాలకు సరిపోయేది కాదు. ఎందుకంటే ముంబై వంటి నగరాల్లో నెలకు రూ. 60వేల కన్నా ఎక్కువ అద్దెలు, పెళ్లి ఖర్చులు 60 లక్షలు దాటడం వంటివి వచ్చే జీతాన్ని మంచి నీళ్లలా ఖర్చు పెట్టిస్తాయి. ఇవన్నీ మధ్యతరగతి ఆర్థిక ఒత్తిడిని చూపిస్తాయని ఆ తండ్రి చెబుతున్నారు. దీంతో పాటుగా 60 ఏళ్ల పాత ఇంటికి మరమ్మతులు, భవిష్యత్తులో ఉద్యోగ భద్రతపై క్లారిటీ లేకపోవడం..ఏఐ రాకతో ఉద్యోగులు రోడ్డు మీద పడటం.. ఇవన్నీ ఆ తండ్రిని దుబాయ్ వెళ్లకుండా ఆపుతున్నాయి. ఈ పోస్ట్ దేశంలో మధ్యతరగతి జీవితాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications