బంగారంపై లోన్ తీసుకున్నారా.. నెల నెలా వడ్డీ కట్టాల్సిందే.. అర్భీఐ తాజా ఆదేశాలు తెలుసుకోండి..

బంగారం ధరలు గరిష్ఠ స్థాయిల నుండి 35% నుండి 40% మేర పతనమైన నేపథ్యంలో.. బంగారు రుణాలు అందించే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు (NBFCలు).. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఆర్‌బీఐ ఉన్నతాధికారులు, 20 మందికి పైగా ఎన్‌బీఎఫ్‌సీ, హౌసింగ్ ఫైనాన్స్, మైక్రోఫైనాన్స్ సంస్థల ప్రతినిధులు, అలాగే MFIN, FIDC సభ్యులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో బంగారు రుణాల రిస్క్‌లు, ఎల్‌టీవీ (LTV) నిష్పత్తి, నిరర్థక ఆస్తుల (NPA) పెరుగుదలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.

Gold ధరలు తగ్గినప్పుడు తాకట్టు పెట్టిన బంగారం విలువ పడిపోయి.. ఇచ్చిన రుణ మొత్తంతో పోలిస్తే కొలేటరల్ విలువ తగ్గిపోతుంది. దీనివల్ల లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తి పెరిగి సంస్థలకు ఆర్థిక నష్టభయం ఎదురవుతుంది. ఉదాహరణకు రూ. లక్ష విలువైన బంగారంపై రూ. 70 వేల రుణం ఇచ్చినప్పుడు బంగారం ధర తగ్గితే ఎల్‌టీవీ నిష్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం కొన్ని కంపెనీలలో ఈ నిష్పత్తి నిర్దేశిత 75% గరిష్ఠ పరిమితికి అత్యంత సమీపానికి చేరినట్లు సమావేశంలో వెల్లడైంది.

RBI gold loan monitoring RBI gold loan scrutiny gold loan portfolio LTV ratio loan to value concerns banks gold loans NBFC gold loans RBI banking regulation gold loan risk gold lending India

దీనికి తోడు బంగారు రుణాల విభాగంలో నిరర్థక ఆస్తుల (NPA) నిష్పత్తి మార్చి 31, 2026 నాటికి ఉన్న 0.16 శాతం నుండి ఆగస్టు చివరి నాటికి దాదాపు రెట్టింపై 0.3 శాతానికి చేరడంపై ఆర్‌బిఐ అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ బంగారు రుణ ఖాతాలు కలిగిన వినియోగదారులు, మారిన రుణ నిబంధనలకు అలవాటు పడని ఖాతాదారుల నుండి చెల్లింపుల ఆలస్యం ఎక్కువగా నమోదవుతోంది.

Also Read

ఈ నేపథ్యంలో సామాన్య రుణగ్రహీతల చెల్లింపుల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలపరిమితి ఉన్న దీర్ఘకాలిక బంగారు రుణాలపై ఇకపై ప్రతి నెలా వడ్డీ వసూలు (Monthly Interest Servicing) చేసేలా ఏర్పాట్లు చేయాలని ఆర్‌బిఐ సంస్థలను ఆదేశించింది. గతంలో చాలామంది ఖాతాదారులు కాలపరిమితి ముగింపులో అసలు.. వడ్డీ కలిపి ఒకేసారి చెల్లించే బుల్లెట్ పేమెంట్ (Bullet Payment) విధానాన్ని అనుసరించేవారు.

కానీ కొత్త ఆదేశాలతో అటువంటి రుణగ్రహీతలకు నెలవారీ వడ్డీ చెల్లింపుల భారం పెరగనుంది. కాబట్టి కస్టమర్లు తమ ఫైనాన్స్ సంస్థలను సంప్రదించి నెలవారీ చెల్లింపులలో కేవలం వడ్డీ మాత్రమే ఉంటుందా లేక అసలు కూడా కలిపి ఉంటుందా.. ఈ నిబంధన ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందో స్పష్టంగా తెలుసుకోవడం ఉత్తమం.

అంతేకాకుండా ఎన్‌బీఎఫ్‌సీలు తమ వ్యాపారాన్ని అదుపులేకుండా వేగంగా విస్తరించడంపై ఆర్‌బిఐ జాగ్రత్తలు చెప్పింది. వేగవంతమైన విస్తరణ వల్ల రుణ ఆడిట్‌లు, కస్టమర్ చెల్లింపుల పర్యవేక్షణ కష్టతరం అవుతుందని హెచ్చరించింది. సైబర్ భద్రతా ప్రమాదాలను నివారించేందుకు కొత్త టెక్నాలజీ భాగస్వాములను నియమించుకునే ముందు వారి భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించింది. చివరగా, నిబంధనల ప్రకారం మార్చి 2027 నాటికి రూ. 10 కోట్ల నికర యాజమాన్య నిధి (Net Owned Fund - NOF) కలిగి లేని ఎన్‌బీఎఫ్‌సీలకు ఎటువంటి తదుపరి గడువు పొడిగింపు ఉండదని రిజర్వ్ బ్యాంక్ కరాఖండిగా స్పష్టం చేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+