2017లో ప్రారంభమైన వస్తు, సేవల పన్ను (GST)లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. GST 2.0గా పిలువబడుతున్న ఈ కొత్త వ్యవస్థలో పన్ను నిర్మాణం సులభతరం చేస్తూ కేవలం రెండు ప్రధాన స్లాబ్‌లకు పరిమితం చేశారు. అవేంటంటే.. 5 శాతంతో పాటుగా 18 శాతం. ఈ సంస్కరణలు 2025 సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానున్నాయి. తాజాగా జీఎస్టీ (వస్తు సేవల పన్ను)లో ప్రధాన సంస్కరణలను ప్రకటించిన తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇండియా టుడేకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా Nirmala Sitharaman పలు ముఖ్య అంశాలపై సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పెట్రోల్, డీజిల్ ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి ఎందుకు రాలేదని రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై ఆమె మాట్లాడుతూ.. జీఎస్టీ రేటు తగ్గింపుతో సాధారణ ప్రజలకు నేరుగా లాభం చేకూరుతుందని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా కంపెనీ లేదా వ్యాపార సంస్థ పన్ను తగ్గింపు వల్ల వచ్చిన ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు. పెట్రోల్-డీజిల్ జీఎస్టీలో చేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అయితే ఇది జీఎస్టీ ప్రతిపాదనలో లేదని తెలిపారు. జీఎస్టీ ప్రవేశపెట్టిన సమయంలోనే పెట్రోల్, డీజిల్‌లను కూడా చేర్చే ప్రయత్నం చేశామని అయితే రాష్ట్రాలు అంగీకరించలేదని గుర్తుచేశారు. దేశంలోని రాష్ట్రాలు రేట్ల విషయంలో ఒక నిర్ణయానికి వస్తే.. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలోకి తీసుకురావచ్చని ఆమె అన్నారు.ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.
ఇంటర్యూలో ఇంకా అనేక అంశాలపై ఆర్థిక మంత్రి మాట్లాడారు. స్టాక్ మార్కెట్ గురించి ప్రస్తావిస్తూ.. మార్కెట్ ఒకే అంశం ఆధారంగా కదలదు. ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు, పెట్టుబడిదారుల భావజాలం వంటి అనేక కారణాలు దానికి ప్రభావం చూపుతాయన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణ వల్ల 99 శాతం వస్తువుల ధరలు తగ్గాయని, ముఖ్యంగా ఆహార పదార్థాలను చౌకగా చేయడంపై మేము ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు.ఇది కంపెనీలకోసం కాకుండా సామాన్యులకోసమే తీసుకువచ్చామన్నారు.
జీఎస్టీని ఒకప్పుడు గబ్బర్ సింగ్ టాక్స్ అని పిలిచిన ప్రతిపక్షాలు ఇప్పుడు దానిపై క్రెడిట్ తీసుకోవడం విచిత్రంగా ఉందని సీతారామన్ అన్నారు. ఇందిరా గాంధీ కాలంలో కాంగ్రెస్ ఆదాయపు పన్నుపై 91 శాతం వరకు పన్ను విధించింది. ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలకూ, ప్రజలకు కలిగిన లాభాలకూ అదే కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. మోదీప్రభుత్వం ప్రతి సంవత్సరం జీఎస్టీని మరింత ప్రజానుకూలంగా మార్చడానికి కృషి చేస్తుందని తెలిపారు.ముందు ముందు కూడా పన్ను తగ్గింపులు, సరళీకరణలు కొనసాగుతాయన్నారు. ప్రజలకు నేరుగా లాభం చేరేలా చూస్తామని హామీ ఇచ్చారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications