Stock market: వర్షం పడితేనే స్టాక్ మార్కెట్‌లో లాభాల పంట! మాన్‌సూన్ ఎఫెక్ట్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

భారతదేశంలో రుతుపవనాలు (Monsoon) అంటే కేవలం వాతావరణ అప్‌డేట్ మాత్రమే కాదు.. అది ఒక బలమైన ఆర్థిక సంకేతం. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలసీని ఎంత నిశితంగా గమనిస్తారో, వర్షపాతాన్ని కూడా అంతే ఆసక్తిగా ఫాలో అవుతారు. ఎందుకంటే, భారత సాగు భూమిలో మూడింట రెండు వంతులు ఇప్పటికీ వర్షాలపైనే ఆధారపడి ఉన్నాయి. వర్షం సరిగ్గా పడితేనే పల్లెల్లో నగదు ప్రవాహం పెరుగుతుంది, అది చివరికి స్టాక్ మార్కెట్ (Stock Market) లోని కంపెనీల ఆదాయాలను ప్రభావితం చేస్తుంది.

Why monsoon rainfall is a macro economic signal for Indian stock market and its impact on inflation summary

గ్రామీణ ఆదాయం, కొనుగోలు శక్తి

మంచి వర్షాలు కురిస్తే పంట దిగుబడి పెరుగుతుంది. ఇది నేరుగా రైతు చేతిలో డబ్బులు ఆడేలా చేస్తుంది. నిట్-స్టోన్ ఫిన్‌సర్వ్ నిపుణులు చెబుతున్నట్లుగా, ఈ నగదు ప్రవాహం కేవలం ఖర్చులకే కాదు, రుణాలు తీసుకోవడానికి , తిరిగి చెల్లించడానికి కూడా తోడ్పడుతుంది. గ్రామీణ ప్రజలు తమ బంగారాన్ని కుదువ పెట్టి లోన్లు తీసుకోవడానికి ధైర్యం చేస్తారు , సకాలంలో తిరిగి చెల్లిస్తారు. దీనివల్ల బ్యాంకింగ్ , గోల్డ్ లోన్ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు మెరుగుపడతాయి.

ద్రవ్యోల్బణం , వడ్డీ రేట్లపై ప్రభావం

రుతుపవనాల రెండో లింక్ ఆహార ద్రవ్యోల్బణంతో ఉంటుంది.

  • ధరల నియంత్రణ: వర్షాలు బాగుంటే ఆహార ఉత్పత్తుల ధరలు అదుపులో ఉంటాయి. భారత్‌లో ద్రవ్యోల్బణాన్ని లెక్కించే బాస్కెట్‌లో ఆహార పదార్థాల వాటా ఎక్కువ.
  • RBI నిర్ణయాలు: ధరలు అదుపులో ఉంటేనే ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు తగ్గితే కంపెనీల వాల్యుయేషన్లు పెరిగి స్టాక్ మార్కెట్ దూసుకుపోతుంది. అయితే, కేవలం వర్షం పడటం మాత్రమే కాదు, అది ఎప్పుడు, ఏ ప్రాంతంలో ఎంత మేర పడుతుందనే 'డిస్ట్రిబ్యూషన్' కూడా చాలా ముఖ్యం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిమాండ్ పెంచే రంగాలు

మంచి మాన్‌సూన్ వల్ల కొన్ని నిర్దిష్ట రంగాలు భారీగా లాభపడతాయి..

  • ఆటోమొబైల్: ట్రాక్టర్లు , టూ-వీలర్ల డిమాండ్ పెరుగుతుంది.
  • FMCG: సబ్బులు, నూనెలు, బిస్కెట్లు వంటి నిత్యావసరాల వినియోగం గ్రామాల్లో పెరుగుతుంది.
  • Agri-Inputs: ఎరువులు, విత్తనాలు , పురుగుల మందుల కంపెనీల షేర్లు లాభపడతాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి వ్యవసాయ ఆధారిత రాష్ట్రాల్లో వినియోగం పెరిగితే, కంపెనీల త్రైమాసిక ఫలితాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ ఏడాది ఉన్న సవాళ్లు

ప్రస్తుతం దాలాల్ స్ట్రీట్ ముందు రెండు ప్రధాన ఆందోళనలు ఉన్నాయి. ఒకటి మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల పెరుగుతున్న ముడిచమురు ధరలు, రెండు ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న అంచనాలు. వర్షాలు తగ్గి ఆహార ధరలు పెరిగి, మరోవైపు ఇంధన ధరలు భారమైతే.. మధ్యతరగతి , గ్రామీణ ప్రజల బడ్జెట్ తలకిందులవుతుంది. ఇది స్టాక్ మార్కెట్ వృద్ధికి బ్రేకులు వేయవచ్చు.

పెట్టుబడిదారులు కేవలం కంపెనీల లాభనష్టాలనే కాదు, వర్షపాత మ్యాపులను కూడా అందుకే ట్రాక్ చేస్తారు. వర్షం పడటం వల్ల షేర్లు పెరగవు.. వర్షం వల్ల వ్యవసాయ ఆదాయం పెరిగి, వినియోగం పెరిగి, ద్రవ్యోల్బణం తగ్గి, వడ్డీ రేట్లు మారితేనే స్టాక్ మార్కెట్ (Stock Market) పై సానుకూల ప్రభావం ఉంటుంది. కాబట్టి, రాబోయే నెలల్లో వరుణుడి కరుణ ఎలా ఉండబోతుందో చూడటం ప్రతి ఇన్వెస్టర్‌కు అత్యవసరం!

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+