ఉద్యోగాలు ఊడుతున్నా ఐటీ వైపే ఎందుకు పరుగెడుతున్నారు? వైరల్ పోస్ట్ వెనుక అసలు నిజం!
ఈ మధ్య కాలంలో ఐటీ రంగం గురించి వినపడుతున్న వార్తలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియని లేఆఫ్స్ (layoffs) భయాలు, మరోపక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చి మనుషుల ఉద్యోగాలను తినేస్తుందనే ఆందోళనలు.. వీటన్నింటి మధ్య అసలు ఐటీ వైపు వెళ్లాలా వద్దా అని చాలామంది ఆలోచనలో పడ్డారు. కానీ, ఇన్ని సవాళ్లు ఉన్నా కూడా నేటి యువత ఇంకా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కోసమే ఎందుకు ఎగబడుతున్నారు? దీనికి సమాధానం ఇస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X' (గతంలో ట్విట్టర్) లో ఒక యూజర్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ వర్సెస్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
ఆ యూజర్ తన పోస్ట్‌లో ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్‌ను షేర్ చేశారు. ఆమె స్నేహితురాలు ఒకరు 2022లో ఒక ఎయిర్‌పోర్ట్‌లో గ్రౌండ్ స్టాఫ్‌గా చేరిందట. అప్పట్లో ఆమె నెల జీతం రూ. 20,000. దాదాపు నాలుగేళ్ల పాటు పగలు, రాత్రి షిఫ్టులు చేస్తూ, వీకెండ్స్ కూడా సెలవు లేకుండా కష్టపడింది. రోజువారీగా వందలాది మంది ప్యాసింజర్లను హ్యాండిల్ చేసింది. ఇంత చేసినా, నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె జీతం ఎంత పెరిగిందో తెలుసా? కేవలం రూ. 38,000 కి మాత్రమే చేరింది.
ఈ ఎగ్జాంపుల్‌ను చూపిస్తూ.. సాఫ్ట్‌వేర్ జాబ్స్‌లో ఉండే అసలు కిక్ ఏంటో ఆ పోస్ట్‌లో వివరించారు. ఐటీ జాబ్స్ ఏమీ ఈజీ కాదు, అక్కడ కూడా విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. కానీ, అక్కడ ఉండే సంపాదన సామర్థ్యం (Earning Potential) మరే ఇతర రంగంలోనూ ఉండదు.
నైపుణ్యానికి తగ్గ పారితోషికం..
సాధారణ సాంప్రదాయ రంగాలలో (Traditional Sectors) మనం ఎంత కష్టపడినా, కేవలం టైమ్ గడుస్తున్న కొద్దీ కొద్దికొద్దిగా మాత్రమే జీతాలు పెరుగుతాయి. కానీ ఐటీ రంగంలో అలా కాదు. ఇక్కడ మీ వయసుతోనో, సీనియారిటీతోనో పనిలేదు. మీ దగ్గర టాలెంట్ ఉండి, కొత్త స్కిల్స్ నేర్చుకుంటే చాలు.. చాలా తక్కువ సమయంలోనే మీ ఇన్కమ్‌ను డబుల్, ట్రిపుల్ చేసుకోవచ్చు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు రియాక్షన్ ఇలా..
- ఒక యూజర్ రాస్తూ, "చాలా రంగాల్లో కాలంతో పాటు జీతం పెరుగుతుంది. కానీ ఐటీలో మాత్రం మీ స్కిల్స్ పెరిగితేనే జీతం పెరుగుతుంది" అని పేర్కొన్నారు.
- మరొకరు స్పందిస్తూ, "వేరే కెరీర్ నుండి టెక్‌లోకి మారిన వాడిగా ఇది నా మనసుకు తాకింది. ఐటీలో జర్నీ ఈజీ కాదు, కానీ నిరంతర అభ్యాసం ద్వారా మన జీవితాన్నే మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది" అని రాశారు.
- ఇంకొకరు ప్రాక్టికల్‌గా మాట్లాడుతూ, "ప్రస్తుతం ఐటీ రంగం కొంచెం ఒడిదుడుకుల్లో (shaky ground) ఉన్న మాట నిజమే. అయినా సరే నేను ఈ ఉద్యోగాన్నే ఎంచుకుంటాను. కస్టమర్ల వైపు చూసి నవ్వినందుకు కాకుండా, మన టాలెంట్‌కు విలువ ఇచ్చి జీతం పెంచే విధానం నాకు నచ్చుతుంది" అని కామెంట్ చేశారు.
క్లౌడ్, ఏఐ నేర్చుకుంటే తిరుగులేదు!
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో క్లౌడ్ కంప్యూటింగ్, సిస్టమ్ డిజైన్, లేదా సరికొత్త AI టూల్స్ నేర్చుకుని వాటిని మాస్టర్ చేయగలిగితే.. మీ గ్రోత్‌ను ఎవరూ ఆపలేరని నెటిజన్లు చెప్తున్నారు. లేఆఫ్స్ భయాలు తాత్కాలికమే అయినా, లాంగ్ టర్మ్‌లో ఐటీ ఇచ్చే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్లే ఇప్పటికీ అందరి చూపు సాఫ్ట్‌వేర్ వైపే ఉంటోంది.


Click it and Unblock the Notifications