ఇప్పుడు ఇండియాలో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వాళ్లు ఒక్కసారిగా పెద్ద ఖర్చుల విషయంలో జాగ్రత్త పడుతున్నారు. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ లాంటి బిగ్-టికెట్ ఐటమ్స్ కొనాలనుకున్న వాళ్లు చాలామంది "కొంచెం ఆగేద్దాం, GST రీఫార్మ్ వచ్చాకే కొందాం" అనే మూడ్‌లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే త్వరలోనే వస్తున్న GST రేషనలైజేషన్ వల్ల ట్యాక్స్ రేట్లు తగ్గే అవకాశం ఉంది.

ప్రస్తుతం మనకు ఉన్న GST స్ట్రక్చర్ 5%, 12%, 18%, 28% అంటూ నాలుగు స్లాబ్‌లుగా ఉంది. కానీ సెప్టెంబర్ 3-4న జరిగే GST కౌన్సిల్ మీటింగ్‌లో దీన్ని "రెండు సింపుల్ రేట్స్" 5% & 18% గా మార్చే ప్రతిపాదన ఉంది. అంటే వాషింగ్ మెషిన్, ఫ్రిజ్, ఏసీ, స్మార్ట్‌ఫోన్లు లాంటి కన్స్యూమర్ డ్యూరబుల్స్ తక్కువ ట్యాక్స్‌లోకి రావచ్చు. దాంతో ఇప్పుడు కొనుగోలు చేసే కంటే, రీఫార్మ్ తర్వాత కొంటే 10% వరకూ చవకగా దొరకొచ్చు అని కస్టమర్లు లెక్కలు వేసుకుంటున్నారు. ఉదాహరణకి, ఒక రూ. 1.2 లక్షల స్మార్ట్‌ఫోన్ తర్వాత 10-12 వేల రూపాయలు తక్కువ అవుతుందనే అంచనాతో చాలా మంది 'వెయిట్ అండ్ వాచ్' మోడ్‌లోకి వెళ్లిపోయారు.
ఈ-కామర్స్‌కి తాత్కాలిక షాక్:
ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్ డిమాండ్ వాయిదా పడటంతో రిటైలర్లు ఇన్వెంటరీని మేనేజ్ చేస్తూ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనలిస్టులు చెబుతున్నట్టు, డిమాండ్‌లో 25-30% వరకు పడిపోవచ్చు. కానీ ఇది లాంగ్-టెర్మ్ సమస్య కాదని అందరూ చెబుతున్నారు.
ఫెస్టివ్ సీజన్ (అక్టోబర్-దీపావళి టైమ్) వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని ఇండస్ట్రీ నమ్మకం. ఎందుకంటే మనకున్న షాపింగ్ కల్చర్ ఏ పన్ను రేట్లు అయినా పండగ సమయానికి గాడ్జెట్‌లు, కొత్త అప్లయెన్సెస్ కొనకుండా ఉండరు.
షిప్‌రాకెట్ CEO సహిల్ గోయెల్ ఇలా చెప్తున్నారు "ఫెస్టివ్ షాపింగ్ అంటే ఇండియన్లకు కల్చర్ + ఎమోషన్. కొత్త ఏసీ, ఫ్రిజ్, గాడ్జెట్ అన్నీ పండగ టైమ్‌కే కొంటాం. GST తగ్గితే అది బోనస్ మాత్రమే."
ఫ్లిప్‌కార్ట్ టాప్ ఎగ్జిక్యూటివ్ రాజనీష్ కుమార్ కూడా GST రీఫార్మ్‌ని స్ట్రక్చరల్ చేంజ్ అని పిలుస్తూ, ఇది వినియోగాన్ని బూస్ట్ చేసి, ఫెస్టివ్ డిమాండ్‌ని రికార్డు స్థాయిలో పెంచుతుందని చెప్పారు.
అక్టోబర్ నుంచి మొదలయ్యే దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ వరకూ షాపింగ్ సీజన్ పీక్‌లో ఉంటుంది. గత సంవత్సరం ఈ టైమ్‌లో ఆన్‌లైన్ రిటైలర్లు రికార్డు సేల్స్ సాధించారు. ఈ ఏడాది GST రీఫార్మ్ అనే అదనపు పాజిటివ్ పుష్ రావడంతో డబుల్ బూస్ట్ ఉంటుందని అంచనా.
అనలిస్టుల అంచనాల ప్రకారం, రీఫార్మ్‌లు అమల్లోకి వచ్చిన వెంటనే ఈ-కామర్స్ సేల్స్ 15-20% వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇందులో ఎక్కువగా ఎలక్ట్రానిక్స్ & క్విక్-కామర్స్ ప్లాట్‌ఫాంలే లీడ్ చేస్తాయి. అఫోర్డబిలిటీ పెరగడం, సింప్లిఫైడ్ కంప్లయన్స్, కస్టమర్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ కలిసి మార్కెట్‌ని మళ్లీ ఉత్సాహంగా నడిపిస్తాయి.
ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ GST రీఫార్మ్ మీద గ్లోబల్ ఇన్వెస్టర్లు కూడా చాలా హైప్ చూపుతున్నారు. ఇండియాలో కన్స్యూమర్ డిమాండ్ ఇంకా పెరుగుతుందని వాళ్లు భావిస్తున్నారు. దీని వల్ల ఈ-కామర్స్ సెక్టార్‌లో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చని ఎకానమిస్టులు అంటున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications