నేటి రోజుల్లో భారతదేశంలోని చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనడం ఒక కలలా మారుతోంది. కారణం వారు తక్కువ సంపాదిస్తున్నారని కాదు.. ఇళ్ల ధరలు భారీగా పెరగడం. గత కొన్ని దశాబ్దాలుగా జీతాల పెరుగుదలతో పోలిస్తే ఇళ్ల వంటి ఆస్తుల ధరలు అసాధారణ వేగంతో పెరగడమే. ఈ అసమతుల్యత మధ్యతరగతి ఆర్థిక స్థిరత్వాన్ని కుదిపేస్తోంది.హెడ్జ్ ఫండ్ మేనేజర్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్ 'విజ్డమ్ హాచ్' వ్యవస్థాపకుడు అక్షత్ శ్రీవాస్తవ.. ఈ సమస్యను ఒక సులభమైన పోలికతో వివరించారు.
1990లో ఒక ఉద్యోగి నెలకు రూ.3,500 సంపాదించేవాడు. నేడు అదే స్థాయిలో జీతం రూ.27,000 నుంచి రూ.29,400 వరకు ఉంటుంది. పైకి చూస్తే ఇది పెద్ద వృద్ధిలా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి 6 శాతం వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకుంటే.. 1990లో రూ.3,500కి ఉన్న కొనుగోలు శక్తి నేటి రూ.27,000 కొనుగోలు శక్తితో దాదాపు సమానమే. అంటే జీతాలు పెరిగినా, జీవన వ్యయాల పెరుగుదలతో నిజమైన లాభం అంతగా లేదు.

అయితే ప్రధాన సమస్య ఏంటంటే..జీతాలు సాధారణంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరుగుతున్నప్పటికీ, ఇళ్లు, భూమి, బంగారం, స్టాక్స్ వంటి ఆస్తుల ధరలు ఆ వేగాన్ని చాలా మించి పెరుగుతున్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ అంతరం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన దీన్ని ఆస్తి ధర ద్రవ్యోల్బణంగా వర్ణిస్తున్నారు. దీని ప్రభావం మధ్యతరగతి వారి సాంప్రదాయ లక్ష్యాలపై, ముఖ్యంగా స్వంత ఇల్లు అనే కలపై తీవ్రంగా పడుతోంది. ఈ ఏడాది డేటా కూడా ఇదే విషయాన్ని చెబుతోంది.
నోబ్రోకర్, పిడబ్ల్యుసి నివేదికల ప్రకారం.. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి అగ్రశ్రేణి మెట్రో నగరాల్లో 2000 నుంచి 2020 మధ్య కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఏటా 10 నుంచి 11 శాతం వరకు పెరిగాయి. దేశవ్యాప్తంగా సగటున ఇళ్ల ధరల పెరుగుదల సుమారు 6 శాతం ఉన్నప్పటికీ.. మెట్రో నగరాల్లో ఈ రేటు మరింత ఎక్కువ. కానీ అదే సమయంలో ఆదాయాల పెరుగుదల ఆ స్థాయికి చేరలేదు. ఉదాహరణకు చెప్పాలంటే.. భారతదేశ నామమాత్రపు తలసరి GDP 2013లో సుమారు 1,450 డాలర్ల నుంచి 2023లో 2,256 డాలర్లకు పెరిగింది. ఇది ఏటా 4 నుంచి 5 శాతం వృద్ధి మాత్రమే, ఇది రియల్ ఎస్టేట్‌లో కనిపించే రెండంకెల వృద్ధికి చాలా తక్కువ.
2008 తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు కూడా ఈ పరిస్థితికి కారణమయ్యాయి. అప్పులు సులభంగా అందుబాటులోకి వచ్చాయి. వినియోగదారుల రుణాలు విపరీతంగా పెరిగాయి. ఫిన్‌టెక్ సంస్థలు రుణాలను ప్రధాన వ్యాపారంగా మార్చాయి. అప్పు తీసుకోవడం సాధారణమైన విషయంగా మారింది. కానీ ఎక్కువ మంది అప్పుతో ఆస్తులు కొనుగోలు చేయడం వల్ల డిమాండ్ పెరిగి, ధరలు మరింత ఎగబాకాయి. దీని ఫలితంగా ఇల్లు కొనగల సామర్థ్యం ఇంకా తగ్గిపోయింది.
ఆయన క్తుప్తంగా ఏం చెబుతున్నారంటే.. ఆస్తులు ఇప్పటికే ఉన్నవారు తమ సంపదను పెంచుకుంటున్నారు. కానీ ఆస్తులు లేనివారు మాత్రం Homes ధరలు ఎందుకు ఇలా పెరుగుతూనే ఉన్నాయో అర్థం కాక సతమతమవుతున్నారు. ఈ మార్పు దేశమంతటా ఒకేలా లేకపోయినా, పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా మహానగరాల్లో, ఆదాయం-ఇళ్ల ధరల మధ్య అంతరం క్రమంగా పెరుగుతోంది. దీని వల్ల భారత మధ్యతరగతి ఆర్థిక భవిష్యత్తు అగమ్యగోచరంలో పడింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications