ఉచితంగా వార్తలు చూసే రోజులు పోయాయా? డిజిటల్ మీడియాలో మొదలైన కొత్త టెన్షన్!

ఈ రోజుల్లో మనలో చాలామంది పొద్దున్న లేవగానే పేపర్ చూడటం, టీవీ పెట్టడం తగ్గించేశాం. స్మార్ట్‌ఫోన్ చేతిలోకి రాగానే యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలోనే మనకు కావాల్సిన అన్ని రకాల న్యూస్ (news) అప్‌డేట్స్ చూసేస్తున్నాం. రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్ డిజిటల్ న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. భారతదేశంలో ఏకంగా 55 శాతం మంది యూట్యూబ్‌లోనే వార్తలను ట్రాక్ చేస్తున్నారు. ఆ తర్వాత వాట్సాప్ (46%), ఇన్‌స్టాగ్రామ్ (37%) ఉన్నాయి. అయితే, సాంప్రదాయ మీడియా కంటే ఈ డిజిటల్ మీడియా స్వతంత్రంగా, నిజాయితీగా నిజాలు చెప్తుందని మనం నమ్ముతాం కదా! కానీ, ఇప్పుడు ఈ స్వతంత్ర వార్తా సంస్థలు మనుగడ సాగించలేక మూతపడే స్థితికి చేరుకున్నాయనే చేదు నిజం మీకు తెలుసా?

Why Independent Digital News Media Facing Financial Crisis India Paid Subscription

'మేము మూసివేసే స్థితికి వచ్చాం' - ఆర్టికల్ 14 ఫౌండర్ ఆవేదన

నిజాలను నిర్భయంగా చెప్పే 'ఆర్టికల్ 14' (Article14) అనే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఫౌండర్ సమర్ హలర్ంకర్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక వీడియో అందరినీ ఆలోచింపజేసింది. "మేము క్లోజ్ చేసే స్టేజ్ కి వచ్చాం.. మా దగ్గర అసలు డబ్బులు లేవు. సోషల్ మీడియా అల్గారిథమ్స్ స్వతంత్ర మీడియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. జనాలు మన వార్తలను చదువుతున్నారు కానీ, సబ్‌స్క్రైబ్ చేసుకోవడం లేదు" అంటూ ఆయన సబ్‌స్క్రిప్షన్ కోసం అప్పీల్ చేశారు. ఈ వీడియో చూసిన కొందరు సపోర్ట్ చేయడంతో ప్రస్తుతానికి ఆ సంస్థకు కొద్దిగా ఊరట లభించింది.

మెయిన్‌స్ట్రీమ్ మీడియా వదిలేసి యూట్యూబ్‌లోకి..

ఒకప్పుడు పెద్ద టీవీ ఛానెల్‌లో ముంబై బ్యూరో చీఫ్‌గా పనిచేసిన సోహిత్ మిశ్రా అనే జర్నలిస్ట్, విలువలకు కట్టుబడి తన ఉద్యోగాన్ని వదిలేశారు. ఇప్పుడు కేవలం ఒక మొబైల్ ఫోన్ పట్టుకుని సొంతంగా యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్నారు. ఆయనకు 6 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. "టీవీలో చెప్పలేని ఎన్నో నిజాలను నేను ఇప్పుడు నా ఛానెల్‌లో స్వేచ్ఛగా చెప్పగలుగుతున్నాను. కానీ రెవెన్యూ సంపాదించడం పెద్ద సవాలుగా మారింది. జనాలు డొనేషన్స్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు, కానీ ప్రభుత్వాలకు భయపడి వాళ్ల పేర్లు బయటకు చెప్పద్దంటున్నారు" అని ఆయన తన బాధను పంచుకున్నారు.

'మంచి పని చేస్తే సరిపోదు.. జనాలు డబ్బులు కట్టాలి'

గత 14 ఏళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న 'న్యూస్‌లాండ్రీ' (Newslaundry) ఫౌండర్ అభినందన్ శేఖ్రీ మాటల్లో చెప్పాలంటే.. భారతదేశంలో ఉచితంగా న్యూస్ (news) చూడటం జనాలకు అలవాటైపోయింది. స్వతంత్రంగా, ఏ పార్టీకి లొంగకుండా మీడియా నడవాలంటే ప్రజలే దానికి డబ్బులు కట్టాలి (Pay to keep news independent). అప్పుడే ఆ మీడియా ప్రజల పక్షాన నిలబడుతుంది. విద్యార్థులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారి కోసం వీరు నెలకు రూ. 99 ప్లాన్‌ను కూడా తీసుకొచ్చారు.

డిజిటల్ మీడియాను దెబ్బతీస్తున్న టాక్స్ రూల్స్!

పెద్ద పెద్ద పేపర్లకు ప్రభుత్వం జీరో శాతం జీఎస్టీ (GST) ఇస్తోంది. కానీ డిజిటల్ మీడియా సబ్‌స్క్రిప్షన్లపై ఏకంగా 18 శాతం జీఎస్టీ విధిస్తోంది. అంతేకాదు, యూట్యూబ్ కంటెంట్ ద్వారా వచ్చే రెవెన్యూలో 40 శాతం వరకు ట్యాక్స్‌ల రూపంలోనే పోతుందని, కేవలం 42 శాతం మాత్రమే తమకు దక్కుతుందని శేఖ్రీ వాపోయారు. ప్రభుత్వాలు ఈ రకమైన కఠిన నిబంధనలతో స్వతంత్ర మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+