ఈ ఏడాది హోసింగ్ మార్కెటుకి సవాలుగా మారింది, గత కొన్ని సంవత్సరాలలో చూస్తే ఇళ్ల ధరల్లో మంచి పెరుగుదల, కొత్త ప్రాజెక్టులు లేకపోవడం ఇంకా ఆమోదాలలో జాప్యం మొదలైన వాటి కారణంగా రియల్ ఎస్టేట్ రంగం వేగం మందగించింది. ముఖ్యంగా 3BHK, పెద్ద ఇళ్ల అమ్మకాలు నెమ్మదించాయి. అయితే దీనిని పెంచడానికి బిల్డర్లు, రియాల్టర్స్ ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ఆఫర్లు పండుగల సమయంలోనే ఎక్కువగా కనిపిస్తాయి.

కారణం ఏమిటి: కోవిడ్ తరువాత కాలంలో సేవింగ్స్ పెరుగుదల, హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గడం, కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారడం వల్ల డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని, డెవలపర్లు డిస్కౌంట్లు లేదా ప్రత్యేక పథకాలను అందించాల్సిన అవసరం లేదని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. కానీ ఇప్పుడు కొనుగోలుదారులను ఆకర్షించడానికి మళ్ళీ ప్రోత్సాహకాలు ప్రవేశపెట్టబడుతున్నాయి.
మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగం బలంగా ఉంది. కానీ ఇతర వస్తువులపై పెరుగుతున్న వినియోగదారుల వ్యయం, భూసేకరణలో ఇబ్బందులు, అనుమతుల్లో జాప్యం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు తక్కువగా ఉండటం ఇంకా స్టాక్ మార్కెట్‌లో పతనం రియల్ ఎస్టేట్ వేగాన్ని నెమ్మదిస్తున్నాయి అని ప్రాపర్టీ ఫస్ట్ CEO అండ్ వ్యవస్థాపకుడు భవేష్ కొఠారి అన్నారు.
ఖరీదైన ఇళ్లకు డిమాండ్ అలాగే ఉందని, అయితే పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కారణంగా మధ్యతరగతి వారికి ఇల్లు కొనడం సవాలుగా మారిందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంటున్నారు. రూ.10 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ ఇళ్ళులు బాగా అమ్ముడవుతున్నాయి, కానీ కొనుగోలుదారులు ఇప్పుడు సరైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, ఇళ్లపై ఆఫర్లు మాంద్యానికి సంకేతం కాదు బ్యాలెన్స్ సృష్టించే ప్రక్రియ. కొత్త సరఫరా తక్కువగా ఉండటం వల్ల ధరలు పెద్దగా తగ్గే అవకాశం లేదు.
ఇల్లు కొనడానికి 2025 మంచి సంవత్సరం అవుతుందా : ఏ మార్కెట్‌లోనైనా ఇల్లు కొనడం అనేది చాలా వ్యక్తిగత నిర్ణయం. చాలా మంది వారి జీవితకాలంలో చేసే అతిపెద్ద సింగిల్ కొనుగోలు ఇళ్ళు కాబట్టి కొనే ముందు ఆర్థికంగా దృఢంగా ఉండటం చాలా ముఖ్యం. మీ డౌన్ పేమెంట్ ఆధారంగా మీ ప్రతినెల ఇంటి ఖర్చులను అంచనా వేయడానికి ప్రి ప్లాన్స్ ఉపయోగించండి . కానీ మీరు 2025లో ఎం జరుగవచ్చు అని అంచనా వేస్తే నిపుణులు ఇప్పుడు బహుశా ఇల్లు కొనేందుకు బెస్ట్ ప్లాన్ కాదని అంటున్నారు .


Click it and Unblock the Notifications