ప్రస్తుతం గోల్డ్ డేస్ నడుస్తున్నాయి అంటే ఇండియాలో బంగారం ధరలు ట్రెండ్ కొనసాగుతుంది. ఇండియాలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరి సరికొత్త రికార్డ్ సృష్టించాయి. ఒక విధంగా చూస్తే పసిడి ధరలు రానున్న రోజుల్లో 90 వేలు కూడా దాటే ఛాన్స్ కనిపిస్తుంది అంటున్నారు నిపుణులు. ఇవాళ ఉదయం 22 & 24 క్యారెట్ల బంగారం సుమారు రూ.500 నుండి 600 వరకు పెరిగాయి. బంగారం ధరలు పెరగడం వల్ల బంగారు లోన్లు కూడా పెరిగాయి. పెరుగుతున్న ధరల పెంపును ఉపయోగించుకుంటూ ప్రజలు గోల్డ్ లోన్లు తీసుకొని అవసరాలను తీర్చుకుంటున్నారు. బంగారం అత్యంత విలువైనదిగా మారుతుండటంతో గతం కంటే ఎక్కువగా గోల్డ్ లోన్లు తీసుకునే మహిళల సంఖ్య పెరిగింది.
36% పెంపు : మన దేశంలో లోన్లు తీసుకునే మహిళల సంఖ్య వేగంగా పెరుగుతోందని నీతి ఆయోగ్, ట్రాన్స్‌యూనియన్ సిబిల్ & మైక్రోసేవ్ కన్సల్టింగ్ రూపొందించిన ఒక నివేదిక పేర్కొంది. ముఖ్యంగా మహిళలు గోల్డ్ లోన్'కే ప్రాధాన్యత ఇస్తున్నారు. 2019 నుండి 2024 మధ్య గోల్డ్ లోన్లు తీసుకునే మహిళలలో 6% పెరుగుదల నమోదైంది. 2024లో మహిళలు తీసుకున్న మొత్తం లోన్లు 36% బంగారు రుణాలు కాగా, 2019లో మాత్రం కేవలం 19% మాత్రమే.

గతంలో కంటే ఎక్కువ లోన్లు: 2019 నుండి 2024 వరకు లోన్లు తీసుకునే మహిళల సంఖ్య 22% అన్యువల్ కాంపౌండెడ్ గ్రోత్ రేటు (CAGR)తో పెరిగిందని కూడా నివేదిక పేర్కొంది. మహిళలు అవసరాలను తీర్చుకోవడానికి గతంలో కంటే ఎక్కువ లోన్లు తీసుకుంటున్నారని రిపోర్ట్ చూపిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే లోన్లు తీసుకునే మహిళల్లో దాదాపు 60% మంది చిన్న పట్టణాలు లేదా గ్రామాల్లోని వారే.
పెరిగిన బిజినెస్ లోన్లు: అన్ని రకాల లోన్లలో మహిళల వాటా పెరిగింది. మహిళలు తీసుకునే వ్యాపార లోన్ల పెరుగుదల గతం కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తుంది. దీనితో పాటు, మహిళలు క్రెడిట్ స్కోరు గురించి మరింతగా అవగాహన పెంచుకుంటున్నారు.
గోల్డ్ లోన్స్ మాత్రమే ఎందుకు: గోల్డ్ లోన్స్ పెరగడానికి చాల కారణాలు ఉన్నాయి. మొదటి విషయం ఏమిటంటే ఇతర లోన్స్ లాగా ఎక్కువ పేపర్ వర్క్ అవసరం లేదు. అందుకే గోల్డ్ లోన్ తీసుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.
ధర ఇంకా మరింతగా పెరుగుతుందా: బంగారం ధర గురించి మాట్లాడుకుంటే పసిడి ధర మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానాల కారణంగా వాణిజ్య యుద్ధం తీవ్రమవుతుందనే భయం పెరిగింది. అమెరికాకు ప్రతిస్పందనగా చైనా, కెనడా కూడా సుంకాలను ప్రకటించాయి. దీనివల్ల బంగారంపై పెట్టుబడి పెరుగుతుందని, డిమాండ్ పెరగడం వల్ల దాని ధర కూడా పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications