గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతూ వస్తున్నాయి. 2025లో ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 43 శాతం పెరిగాయి. సాధారణంగా ఇంత పెద్ద పెరుగుదల ఒక్క కారణం వల్ల రాదు. నిపుణుల ప్రకారం.. ఈ పెరుగుదల వెనుక సురక్షిత పెట్టుబడుల కోసం డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాలు, ప్రపంచ కేంద్ర బ్యాంకుల భారీగా బంగారం కొనుగోళ్లు కలిపి ప్రధాన కారణాలుగా నిలిచాయని చెప్పవచ్చు.
ఇలాంటి సమయంలో, ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్లో ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ క్రిస్టోఫర్ (క్రిస్) వుడ్.. Gold ధరలు ఇంకా నింగిని తాకే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన తాజా అంచనా ప్రకారం.. రాబోయే నెలల్లో బంగారం ధర ఔన్సుకు 6,600 డాలర్ల (రూ. 5.5 లక్షలు దాటే స్థాయికి)కు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ధర ఔన్సు 3,745 డాలర్లు వద్ద ఉన్నందున, ఇది దాదాపు 76 శాతం అదనపు పెరుగుదల అవుతుంది.

క్రిస్ వుడ్ Gold అంచనాలు గతంలో కూడా ప్రత్యేక గుర్తింపు పొందాయి. 2002లో ఆయన బంగారం లక్ష్యాన్ని 3,400 డాలర్లుగా నిర్ణయించారు.ఇక 2005లో 3,700 డాలర్లకి పెంచారు. 2016లో 4,200 డాలర్లుగా అంచనా వేశారు. 2020లో బంగారం 5,500 డాలర్లుకు చేరుతుందని చెప్పారు.. కాగా ఆయన చెప్పింది దాదాపు నిజమైంది. ఇప్పుడు ఆయన 6,600 డాలర్ల లక్ష్యాన్ని చెబుతున్నారు.. ఆయన పూర్వ అంచనాలు దాదాపుగా సరైన దిశలోనే సాగినందువల్లే పెట్టుబడిదారులు ఈ అంచనాను కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు.
వుడ్ తన Greed and Fear అనే వారపు నివేదికలో ఒక ముఖ్యమైన లాజిక్ చెప్పారు. 1980లో బంగారం ధర, అమెరికా వ్యక్తుల తలసరి ఆదాయంలో 9.9 శాతంని సూచించింది. ప్రస్తుతానికి, అదే లెక్క ప్రకారం చూస్తే బంగారం విలువ 5.6 శాతానికే పరిమితమవుతోంది. తలసరి ఆదాయానికి మళ్లీ 9.9% నిష్పత్తి వస్తే.. బంగారం ధర 6,571 డాలర్లకి చేరుతుంది. అందుకే 6,600 డాలర్ల లక్ష్యం సముచితమని ఆయన వాదిస్తున్నారు.
2002 నుంచి వుడ్ తన గ్లోబల్ పోర్ట్‌ఫోలియోలో కనీసం 40 శాతం బంగారంలోనే ఉంచుతున్నారు. 2020లో బిట్‌కాయిన్‌ను చేర్చినప్పటికీ, బంగారం వాటా 40 శాతం కంటే తగ్గలేదు. ఇది ఆయనకు బంగారంపై ఉన్న విశ్వాసాన్ని చూపిస్తుంది.ఇక మరో నిపుణ సంస్థ జూలియస్ బేర్ అనే గ్లోబల్ వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ కూడా బంగారంపై సానుకూలంగానే ఉంది.
వారి ప్రకారం అమెరికా సెంట్రల్ బ్యాంక్ (ఫెడ్) కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల కేంద్ర బ్యాంకులే ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా చెబుతున్నారు.మరో విశ్లేషకుడు మెన్సూర్ పోసిన్సి ప్రకారం, బంగారం 4,500 నుంచి 4,800 డాలర్ల మధ్యలో కూడా కదలవచ్చు. వెండి విషయంలో కూడా ఆయన సానుకూలంగా ఉండి, అది 52 నుంచి 58 డాలర్ల వరకూ వెళ్లే అవకాశం ఉందని చెప్పారు.
ఫ్యూచర్లో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉందని పెద్ద నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది తక్షణ లాభం కోసం కాదు. దీర్ఘకాలికంగా సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని చూడాలని సూచిస్తున్నారు.
వెండి కూడా మంచి అవకాశాలు కలిగిన పెట్టుబడిగా చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి

చైనా మాములుది కాదు..ఇరాన్ యుద్ధంతో ప్రపంచదేశాలు అల్లాడుతుంటే.. అది మాత్రం బంగారంతో..

Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!



Click it and Unblock the Notifications