కరోనా కారణంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. విమాన, పర్యాటక రంగాలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ఇందుకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ ఆరు డెట్ ఫండ్ స్కీంలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం నిదర్శనం. ఇలా చేసిన తొలి ఫండ్ కంపెనీ ఇదే. దీంతో మదుపర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

ఎందుకు, ఏవేవి నిలిపివేసింది
కరోనా కారణంగా ఉపసంహరణలు భారీగా పెరగడంతో నిలిపివేస్తున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రకటించింది. కరోనా ప్రభావం రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకునేందుకు ఎగబడుతుండటంతో ఏకంగా 6 ఓపెన్ ఎండెడ్ ఫిక్స్డ్ ఇన్‌కం డెట్ స్కీంలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఫ్రాంక్లిన్ ఇండియా లో-డ్యురేషన్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా క్రెడిట్ రిస్క్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా డైనమిక్ ఎక్రువల్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్‌కం ప్లాన్
ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ బాండ్ ఫండ్
ఫ్రాంక్లిన్ ఇండియా ఇన్‌కం ఆపర్చునిటీస్ ఫండ్

తప్పక నిలిపివేశాం
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ నిలిపివేసిన ఆరు పథకాల కింద రూ.30,000 కోట్లకు పైగా పెట్టుబడులు ఉన్నాయి. అల్ట్రా షార్ట్‌లో రూ.9,700 కోట్లకు పైగా, షార్ట్ టర్మ్ ఇన్‌కంలో రూ.5,726 కోట్లు, డైనమిక్ అక్రూరల్‌లో రూ.2,500 కోట్లకు పైగా, లో-డ్యురేషన్ రూ.2,400 కోట్లు, ఇన్‌కం ఆపర్చునిటీస్ రూ.1,880 కోట్ల వరకు ఉన్నాయి. పెట్టుబడులు మరిన్ని ఉండి ఉంటాయని అంచనా. భారత బాండ్ మార్కెట్లో చాలా వరకు డెట్ పథకాల్లో పెట్టుబడులు తగ్గాయి. కరోనా కారణంగా స్కీంల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ వెనక్కి వెళ్తున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని కంపెనీ ప్రెసిడెంట్ సంజయ్ సప్రె చెప్పారు. మొత్తానికి వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల పరిమాణం రూ.30వేల కోట్ల వరకు రిస్క్‌లో ఉందని చెబుతున్నారు. ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.

ఉపసంహరణకు డబ్బులు లేవు..
ఇప్పుడు నిలిపివేసిన స్కీంలలో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి ఏమిటి? అంటే తమ పెట్టుబడులను అమ్మలేని పరిస్థితి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఎవరూ కొనడానికి కూడా ముందుకు రాకపోవచ్చు. అందుకే ఈ పథకాల్లో పెరుగుతున్న పెట్టుబడుల ఉపసంహరణలకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే ప్రస్తుతానికి ఇందులో ఇన్వెస్ట్ చేసిన మొత్తం వెనక్కి తీసుకోలేరు. అందుకే నిలిపివేసింది.

ఎంత కాలం ఆగాలి
కంపంనీ తన సంస్థ ఆస్తులు విక్రయించి డబ్బులు ఇచ్చే వరకు వేచి చూడాలి. లేదా డెట్ మార్కెట్లో పరిస్థితులు మెరుగుపడితే కంపెనీ ఇవ్వవచ్చు. అందుకు ఎంత సమయం తీసుకుంటుందనేది కరోనా ప్రభావం, మార్కెట్ పరిస్థితిని బట్టి ఉంటుంది. లేదా ఆరు రుణ పథకాల మెచ్యూరిటీ ముగిసే వరకు వేచిచూడాలి. నెలల పాటు ఎదురు చూడాల్సి రావొచ్చు. ఈ పథకాల్లో పెట్టుబడులు, ఉపసంహరణలు ప్రస్తుతానికి అనుమతించడం లేదు.

సెబితో చర్చించాకే
ఫండ్స్ నిలిపివేతపై సెబీతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గ్రూప్ ఎండీ వివేక్ కుద్వా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము తీసుకున్న నిర్ణయం వెనుక సహేతుక కారణాలు ఉన్నాయని సెబీ కూడా భావించిందన్నారు. తమకు నిధులు అందే తీరును బట్టి ఇన్వెస్టర్లకు చెల్లింపులు జరుపుతామన్నారు. వచ్చే కొద్ది నెలల్లో పెట్టుబడులకు వీలైనంత ఎక్కువ విలువ సాధించడం, ఇన్వెస్టర్ల ప్రయోజనాల్ని సాధ్యమైనంతగా పరిరక్షించడమే తమ లక్ష్యమన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications