కరోనా మహమ్మారి ప్రజలను ఎంతలా ప్రభావితం చేస్తోందో చెప్పడానికి అనేక ఉదాహరణలు దొరుకుతున్నాయి. తాజాగా మన దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో ఏకంగా రూ 30,000 కోట్ల నిధులు వెనక్కి తీసుకున్నారు. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాల నుంచి ఈ మేరకు డబ్బు విత్ డ్రా చేసుకున్నారు. అది కూడా గత నాలుగు నెలల్లోనే అంత సొమ్ము వాపసు తీసుకోవటం ఒక రికార్డు గా నిలిచిపోతుంది. మెజారిటీ ఖాతాదారులు మెడికల్ ఎమర్జెన్సీ విండో కింద తమ పొదుపు సొమ్మును వెనక్కి తీసుకోవటం ఇప్పుడు చర్చనీయాంశం అయిపోయింది.
సాధారణంగా ఉద్యోగులు తమ రిటైర్మెంట్ కోసం తప్పనిసరిగా ప్రతి నెల కొంత సొమ్మును ఈపీఎఫ్ కు జత చేయాల్సి ఉంటుంది. సరిగ్గా అంత మొత్తం మనం పని చేసే కంపెనీ దానికి జోడిస్తుంది. ఈ మొత్తం సొమ్ముకు ఈపీఎఫ్ వడ్డీ ని జమ చేస్తూ ఉంటుంది. దీంతో ఒక ఉద్యోగి తాను కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి రిటైర్మెంట్ వరకు ఆ సొమ్మును విత్ డ్రా చేయకుండా ఉన్నట్లయితే... కొన్ని లక్షల్లో నిధి లభిస్తుంది. దానిని రిటైర్మెంట్ అనంతరం తనకు అవసరమైన చోట పెట్టుబడి పెట్టేందుకు, లేదా ఇల్లు కొనుక్కునేందుకు లేదా పిల్లల పెళ్లిళ్లు చేసేందుకు ఉపయోగించుకోవచ్చు. లేదా మేజర్ సర్జరీ కోసం మెడికల్ ఎమర్జెన్సీ కింద పాక్షికంగా నిధులు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు కేవలం కోవిడ్ -19 కోసం తీసుకుంటుండటం గమనార్హం.

కోవిడ్ -19 ప్రభావం మొదలైన ఏప్రిల్ నెల నుంచి జులై మూడో వారం వరకే మొత్తం 80 లక్షల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు రూ 30,000 కోట్ల నిధులను వాపసు తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇది సాధారణంగా జరిగే విత్ డ్రాయల్స్ కంటే చాలా అధికంగా ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ -19 సంబంధిత కారణాల వల్లే ఈ పరిమాణం ఎదురైనట్లు తేలింది. ఉద్యోగాలు పోవటం, వేతనాల్లో కోతలు, మెడికల్ ఎక్సపెన్సెస్ పెరగటం వంటి కారణాలు అధిక నిధుల విత్ డ్రాయల్స్ కు ప్రధాన కారణాలుగా నిలిచాయి. దేశంలో ఇప్పుడప్పుడే కరోనా పోయే అవకాశం లేదు కాబట్టి, ఈ ట్రెండ్ మరింత కాలం కొనసాగ వచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, భవిష్యత్ కు ఎంతో భరోసా నిచ్ఛే ఈపీఎఫ్ ఫండ్స్ తీసుకోవటం ఆందోళన కలిగిస్తోందని వారు చెబుతున్నారు.
దేశంలో మొత్తం 6 కోట్ల మంది ఉద్యోగుల కోసం ఈపీఎఫ్ పని చేస్తుంది. దీని వద్ద రూ 10 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. ఈ నిధులను ప్రభుత్వానికి రుణాలు ఇవ్వటం, వివిధ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ సొమ్మును మరింతగా పెంచుతారు. దాంతో వచ్చే లాభాన్ని వడ్డీ రూపంలో ఖాతాదారులకు చెల్లిస్తారు. ప్రస్తుతం వడ్డీ రేటు 8.5% చొప్పున ఉంది. బ్యాంకులతో పోల్చితే ఈ వడ్డీ రేటు ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. కాబట్టి ఉద్యోగులకు ఇది ఒక అద్భుతమైన పెట్టుబడి సాధనంగా కూడా ఉంటుంది. అందుకే దేశంలోని సంఘటిత రంగంలోని ఉద్యోగులు అందరికీ ఇది ఒక కల్పతరువుగా ఉంటుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలకు మాత్రం సొంత ట్రస్ట్ ల రూపంలో సొంత భవిష్య నిధి ఏర్పాట్లు ఉంటాయి.
ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈపీఎఫ్ నుంచి నిధులను విత్ డ్రా చేసుకునేందుకు కోవిడ్ విండో కూడా ఏర్పాటు చేశారు. తాజాగా ఈ విండో ను ఉపయోగించుకుని సుమారు 30 లక్షల మంది ఖాతా దారులు రూ 8,000 కోట్ల నిధులను వెనక్కి తీసుకున్నారు. నిధుల విత్ డ్రా కోసం ఈ మార్గం సులభంగా ఉండటంతో మరింత మంది ఖాతాదారులు ఇదే బాటన పయనించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తుంటే... కనీసం కోటి మంది ఖాతాదారులు తమ సొమ్మును వెనక్కి తీసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా... 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ మొత్తంగా రూ 72,000 కోట్ల నిధులను ఖాతాదారులకు చెల్లించింది. మొత్తం 1.5 కోట్ల మంది ప్రయోజనం పొందారు. కానీ, కరోనా వైరస్ నేపథ్యంలో కేవలం నాలుగు నెలల్లోనే రూ 30,000 కోట్లు దాటడం విశేషం.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications