Akshaya Tritiya: హిందువుల ప్రతి రోజుకూ ఒక ప్రక్యేకత ఉంటుంది. ఈ క్రమంలో అక్షయ తృతీయ పండుగను వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని చాలా మంది పూజిస్తుంటారు. ఈ రోజు మనుషులకు అదృష్టం పెరుగుతుందని ఒక నానుడి.
ఈ సంవత్సరం అక్షయ తృతీయ పండుగ ఏప్రిల్ 22, శనివారం వచ్చింది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదమని పరిగణించబడుతోంది. అయితే ప్రత్యేకమైన ఈరోజున బంగారం కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని సార్లు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అసలు బంగారాన్ని ఈ రోజున కొనటం వల్ల కలిగే లాభనష్టాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారం అనేది భారతీయులకు చాలా ఇష్టమైన మెటల్. దీనిని కేవలం అలంకారానికి మాత్రమే కాక.. పెట్టుబడి సాధనంగా కూడా వినియోగించుకోవచ్చు. అందుకే గోల్డ్ కొనుగోలు చేయటం చాలా ప్రయోజనకరం. ఇందుకోసం మీరు బంగారాన్ని కేవలం ఆభరణాల రూపంలోనే కాక గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కెట్స్ లేదా గోల్డ్ బార్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. వీటిని అవసరమైనప్పుడు ఎలాంటి తరుగు లేకుండా తిరిగి అమ్ముకోవటం ద్వారా మంచి లాభాన్ని కూడా పొందటానికి అవకాశం ఉంటుంది.
అక్షయ తృతీయ రోజున బంగారం కొనటం శుభప్రదమని భావించే చాలా మంది కనీసం ఒక్క గ్రామైనా బంగారం కొంటుంటారు. అయితే మీ దగ్గర తగినంత సొమ్ము లేనప్పుడు అప్పులు చేసి బంగారం కొనటం చాలా ప్రమాదకరం. ఇలాంటి హానికరమైన అలవాట్లకు పసిడి ప్రియులు దూరంగా ఉండటం ఉత్తమం. బంగారాన్ని కొనే వ్యక్తులు 18, 22, 24 క్యారెట్ల స్వచ్ఛతను నిర్థారించుకునేందుకు హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలి. అలా చేయటం వల్ల కల్తీ లేని స్వచ్ఛమైన బంగారాన్ని పొందవచ్చు.
దేశంలో బంగారం ధరలు చాలా స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర చెన్నైలో రూ.61,840, ముంబైలో రూ.61,190, దిల్లీలో రూ.61,340, బెంగళూరులో రూ.61,240, కేరళలో రూ.61,190.. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం నగరాల్లో రూ.61,190గా కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో బంగారం ధరలు రూ.65 వేల మార్కును దాటవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Click it and Unblock the Notifications