Bira 91 ఒకప్పుడు యువతలో చాలా కూల్ బీర్ బ్రాండ్‌గా పాప్యులర్‌గా ఉండేది. రంగురంగుల బాటిల్స్, ఫన్ స్టైల్ మార్కెటింగ్, సిటీ లైఫ్ తో ఈ బీర్ అందరికి తెలుసు. 2015లో అంకూర్ జైన్ ప్రారంభించిన ఈ బ్రాండ్, భారతంలో క్రాఫ్ట్ బీర్ కల్చర్‌ను కొత్తగా పరిచయం చేసింది.
కొన్ని సంవత్సరాల్లోనే, Bira 91 అన్ని బార్లలో, రెస్టారెంట్లలో, సూపర్‌మార్కెట్లలో కనిపించడం ప్రారంభించింది. యువతా ఇమేజ్, ఫ్లెక్సిబుల్ బ్రాండింగ్, క్రియేటివ్ అడ్స్ వల్ల బ్రాండ్ ఫాస్ట్-గ్రో అయ్యింది. 2023లో ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం 550 టౌన్‌లలో, 18 దేశాలలో 9 మిలియన్ కేసుల అమ్మకాలు చేసి రూ. 824 కోట్లు రాబడిని సాధించింది.

కానీ Bira 91 విజయం కేవలం నంబర్స్‌కే పరిమితం కాదు. బ్రాండ్ ఒక యాంగ్, కూల్ కల్చర్, డరింగ్ అటిట్యూడ్ ని ప్రొమోట్ చేస్తూ, బార్లు, రెస్టారెంట్లలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ చూపించింది. 2022లో, Bira 91 'The Beer Caf' అనే పాప్ పబ్ చైన్‌ను కూడా కొనుగోలు చేసింది, దాంతో మరిన్ని ప్లేస్‌లలో తన ప్రెజెన్స్ మరింత పెరిగింది.
అయితే సమస్య ఎక్కడ మొదలైంది?
ఇది కాస్త ఆశ్చర్యకరం, కానీ సమస్య ఒక చిన్న నేమ్ చేంజ్‌తో మొదలైంది. 2023-24లో, B9 Beverages Private Limited ని "B9 Beverages Limited" గా మార్చారు. ఒక సులభమైన లీగల్ మార్పు, Bira 91 కి పెద్ద సమస్యను తెచ్చింది.
ఇన్వెస్టర్ డి. ముత్తుక్రిష్ణన్ చెప్పినట్లు "Bira 91 ఒక సక్సెస్ ఫుల్ స్టార్ట్ ప్. కానీ ఒక చిన్న పేపర్‌వర్క్ లో తప్పు వల్ల పెద్ద సమస్య ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త కంపెనీ పేరును పూర్తిగా వేరే బిజినెస్ అని పరిగణించాయి. ఫలితంగా, ఫౌండర్ పై ఉద్యోగుల ఒత్తిడి పెరిగింది." కొత్త పేరు రిజిస్టర్ అయిన వెంటనే, రాష్ట్ర ప్రభుత్వాలు Bira 91 అమ్మకాలను నిలిపివేసాయి. ప్రతి బీర్ వేరియంట్ కోసం కొత్త ప్రోడక్ట్ అప్రూవల్, లైసెన్స్, రిజిస్ట్రేషన్లు అవసరమని చెప్పింది. ఫలితం నెలలపాటు అమ్మకాలు నిలిచిపోయి, కంపెనీ భారీ నష్టాల్లో పడింది.
Economic Times రిపోర్ట్ ప్రకారం, Bira 91 కొన్ని పెద్ద నష్టాలను ఎదుర్కొంది. కంపెనీకి రూ. 80 కోట్లు విలువైన స్టాక్ రద్దు చేయాల్సి వచ్చింది. FY23-24లో అమ్మకాలు 22% తగ్గిపోయాయి, అలాగే నష్టాలు 68% పెరిగాయి. జూలైలో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇంకా BlackRock 500 కోట్లు పెట్టుబడిని రద్దు చేసింది. ఫలితంగా, కంపెనీకి నెట్ లాస్ రూ. 748 కోట్లు వచ్చి, అది మొత్తం రాబడిని మించినది.
అయితే, Bira 91 ఫౌండర్ అంకూర్ జైన్ ఇంకా గివ్ అప్ కాలేదు. 2026లో IPO చేసేందుకు ప్లాన్ ఇంకా కొనసాగుతోంది. IPOకి సిద్ధం కావడానికి, Morgan Stanleyని ప్రీ-IPO అడ్వైజర్‌గా నియమించి, కంపెనీ ఆపరేషన్స్, ఫైనాన్స్ మరియు మార్కెట్ సిద్ధతపై దృష్టి పెట్టారు.
చిన్న నేమ్ మార్పు పెద్ద సమస్యకు కారణమైంది, అది Bira 91 అమ్మకాలు, లైసెన్స్ లాంటి అడ్మినిస్ట్రేటివ్ సమస్యలకు దారితీసింది. కానీ Bira 91 ఇంకా పబ్లిక్ మార్కెట్‌లోకి రావాలనే తన కలను వదలడం లేదు. యువతా ఇమేజ్, కూల్ స్టైల్, క్రియేటివ్ మార్కెటింగ్ తో బ్రాండ్ తిరిగి ఫీల్‌లోకి రావడానికి ప్రయత్నిస్తోంది.
More From GoodReturns

పెట్టుబడిదారులకు పండగే పండగ.. వచ్చేవారం స్టాక్ మార్కెట్లో ఐపీఓల జోష్.. టాప్‌లో ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications