ప్రపంచ స్టీల్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన ఆర్సెలార్ మిత్తల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్ యూకేకు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పన్ను విధానాలు ఆయనకు నచ్చకపోవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటన్ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ముఖ్యంగా నాన్-డోమ్ పన్ను విధానం రద్దు అంశం అనేకమంది బిలియనీర్లను ఆ దేశాన్ని విడిచి వెళ్లేలా చేస్తోంది. 226 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పన్ను విధానం కింద యూకేలో నివసించే సంపన్నులు విదేశాల్లో సంపాదించిన ఆదాయంపై బ్రిటన్‌కు పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ ప్రత్యేక లాభం కారణంగా ప్రపంచంలోని అనేక ధనవంతులు లండన్‌ను తమ నివాసంగా ఎంచుకునేవారు.
అయితే కీర్ స్టార్మర్ ప్రభుత్వం ఈ పన్ను సడలింపును పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించింది. దీని వల్ల యూకేలో నివసిస్తున్న అనేక పెద్ద పరిశ్రమల యజమానులు, పెట్టుబడిదారులు తమ భవిష్యత్ ప్లాన్‌లను తిరిగి ఆలోచిస్తున్నారు. పన్నుల భారమేమీ లేకుండా తమ అంతర్జాతీయ ఆదాయాన్ని ఉంచుకోవాలనుకునే ధనవంతులు ఇప్పుడు పన్ను స్వర్గధామాలైన దుబాయ్, సింగపూర్, మోనాకో వంటి ప్రాంతాల వైపు చూస్తున్నారు.

అలాగే ఈ మార్పులు లక్ష్మీ మిత్తల్ నిర్ణయంపై కూడా భారీగానే ప్రభావం చూపాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టీల్ తయారీ సంస్థ అయిన ఆర్సెలార్ మిత్తల్ విలువ 26.12 బిలియన్ యూరోలు. ఇందులో మిత్తల్ కుటుంబం దాదాపు 40 శాతం వాటా కలిగి ఉంది. 2021లో లక్ష్మీ మిత్తల్ CEO పదవి నుంచి తప్పుకోవడంతో ఆయన కుమారుడు ఆదిత్య మిత్తల్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఈ కొత్త పన్ను మార్పుల వలన లక్ష్మీ మిత్తల్ భవిష్యత్ పెట్టుబడులు దుబాయ్ వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం. దుబాయ్‌లో పన్ను సడలింపులు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండటంతో ప్రపంచ సంపన్నులు అటు తరలిపోతున్నారు.
సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2025 ప్రకారం లక్ష్మీ మిత్తల్ సంపద 15.4 బిలియన్ పౌండ్లు కలిగి ఉన్నారు. ఈ సంపదతో ఆయన యూకేలో సంపన్నుల జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఇలాంటి ధనవంతులు దేశం విడిచి వెళ్లడం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, వ్యాపార కార్యకలాపాలు యూకే వెలుపలికి వెళ్లిపోవడం ఆ దేశానికి పెద్ద దెబ్బ అవుతుందని వారు చెబుతున్నారు.
అయితే ఈ పన్ను వివాదమేమి కొత్తది కాదు. గతంలో మాజీ ప్రధాని రిషి సునాక్ భార్య అక్షతా మూర్తి కూడా నాన్-డోమ్ పన్ను ప్రయోజనం తీసుకున్నందుకు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. అక్షతా ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన ఆదాయంపై యూకేలో పన్ను చెల్లించకపోవడం రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆమె స్వయంగా ముందుకు వచ్చి ఇకపై గ్లోబల్ ఆదాయంపై కూడా యూకే పన్నులు చెల్లిస్తానని ప్రకటించారు.
ఇప్పుడు ఇదే పన్ను విధానం పూర్తిగా రద్దు అవుతుండటంతో Lakshmi Mittal సహా పలువురు బిలియనీర్లు యూకేను విడిచి వెళ్లడం ప్రారంభించారు. ఇది బ్రిటన్ వ్యాపార వాతావరణం మారుతున్నదనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. పన్నుల భారాన్ని తట్టుకోలేని సంపన్నులు కొత్త అవకాశాల కోసం గల్ఫ్ దేశాలవైపు ప్రయాణం మొదలుపెట్టారు. దీంతో యూకే భవిష్యత్ పెట్టుబడుల ఆకర్షణలో ఇతర దేశాలకు పోటీ ఇవ్వాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడుతోంది.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

Bengaluru: టీసీఎస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మీ స్నేహితుడిని చేర్పించండి.. రూ. 40,000 గెలుచుకోండి!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

Gold: బంగారం ధరలు తగ్గేది అందుకు కాదు! అసలు విషయం బయటపెట్టిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీఈఓ!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

పెరుగుతున్న బంగారం ధరలు.. అదే స్థాయిలో పెరుగుతున్న పసిడి రుణాలు.. ఎందుకు తాకట్టు పెడుతున్నారు..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..



Click it and Unblock the Notifications