భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దేశంలోని వివిధ నగరాల్లో అమ్మకాలు ఎలా పెరుగుతున్నాయో గమనిస్తే ఒక్కటే పరిస్థితి అన్ని ప్రాంతాలకు వర్తించడం లేదు.
బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువ గల ఫ్లాట్లు మంచి లాభాల రేటు చూపుతున్నాయి. అధిక టికెట్ పరిమాణం ఉన్న ప్రాజెక్టులు కూడా మంచి స్పందనతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరులో ఐటి రంగంలో కొంత తొలగింపులు ఉన్నప్పటికీ, మార్కెట్ అంచనాలను మించిపోయిన ప్రదర్శన కనబరుస్తోంది. గోద్రేజ్ వంటి ప్రముఖ గ్రూప్ A డెవలపర్లు కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టులకు మంచి స్పందన వస్తోందని నివేదిక వెల్లడించింది.

అదే సమయంలో ముంబై రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో (MMR) ప్రస్తుత డిమాండ్ మందగమనాన్ని చూపుతోంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా తగ్గిపోయింది. జనసంచారం స్థిరంగా ఉన్నప్పటికీ మార్పిడి గణనీయంగా తగ్గిపోతోంది. కొన్ని చోట్ల మంచి స్థానం, సరైన ధరలతో ప్రాజెక్టులు మాత్రం మంచి ట్రాక్షన్‌ను పొందుతున్నాయి. MMRలో కొత్త లాంచ్‌లు వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో భాగంలో పుంజుకుంటాయని.. 2025-26 ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలో (Q3) మంచి షోషణ కనిపించనుందని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అంచనా వేస్తోంది.
ఢిల్లీ NCRలో పరిస్థితి మరింత స్థిరంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా గురుగ్రామ్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గిపోతున్నట్లు నివేదిక పేర్కొంది. DLF, ఒబెరాయ్ రియాలిటీ వంటి పెద్ద డెవలపర్లు మాత్రమే స్థిరమైన డిమాండ్‌ను చూస్తున్నారని నివేదిక తెలిపింది. చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీల వద్ద పెద్ద టికెట్ పరిమాణాల్లో డిమాండ్ తీవ్రంగా తగ్గుతుందని అంచనా వేశారు. అయితే.. నోయిడా ప్రాంతంలో real estate డిమాండ్ సరఫరాను మించి ఉండడంతో మార్కెట్ బలంగా కొనసాగుతుందని వివరించారు. ఇది పెట్టుబడిదారులకు, ఇంటి కొనుగోలుదారులకు మంచి అవకాశంగా భావించవచ్చు.
తక్కువ వడ్డీ రేట్లు, ఆదాయపు పన్ను మినహాయింపులు వంటి ప్రోత్సాహక అంశాలు మార్కెట్‌ను మద్దతుగా నిలబెడుతున్నాయి. అయితే వాణిజ్యం, సుంకాల అనిశ్చితి, ఐటి రంగ తొలగింపులు వంటి ప్రతికూల కారకాలు ప్రమాదాన్ని కలిగిస్తున్నాయని నివేదికలో తెలిపారు. ఏదేమైనా భారతదేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ తీరును పూర్తిగా ఒకే రూపంలో చెప్పడం కష్టమని, ప్రదేశానికి, పరిస్థితికి అనుగుణంగా డిమాండ్, సప్లై మారుతూ ఉంటుందని ఇది స్పష్టం చేస్తోంది.
More From GoodReturns

Bengaluru: బిజినెస్ చేయాలని ఉన్నా ధైర్యం సరిపోవట్లేదా? మీరు కూడా ఈ ట్రాప్‌లో ఉన్నారేమో చూసుకోండి!

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!

Bengaluru: ఉద్యోగం కంటే సొంత వ్యాపారమే మిన్న.. ఒంటరిగా వంట చేస్తూ నెటిజన్ల మనసు గెలిచిన టెక్కీ!

Bengaluru: ఒరాకిల్‌లో ఉద్యోగం పోయింది.. కానీ దర్జాగా బతుకుతున్నాడు! ఈ టెక్కీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!



Click it and Unblock the Notifications