అంతర్జాతీయ మార్కెట్లో రెండు రోజుల క్రితం బ్రెంట్ క్రూడాయిల్, డబ్ల్యుటీఐ క్రూడ్ ధరలు దాదాపు ఆరు శాతం పెరిగినప్పటికీ దేశీయ చమురు రంగ సంస్థలు నిన్న పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. పైగా తగ్గించాయి. గత కొద్ది రోజులుగా దేశీయ చమురు ధరలు పెరగడం లేదు. ఇప్పుడు తగ్గడానికి పలు కారణాలు ఉంటాయి.
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో అంతర్జాతీయంగా ధరలు మళ్లీ తగ్గడం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం వంటి కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అందుకే ఇటీవల కాలంలో OMCలు ధరల సవరణలను నిలిపివేశాయని, పైగా ఇప్పుడు తగ్గించాయని చెబుతున్నారు.

ధరలు స్వల్పంగా తగ్గుదల
చమురురంగ కంపెనీలు బుధ, గురువారం.. వరుసగా రెండు రోజులు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాయి. దాదాపు ఆరు నెలలు, ఏడాది తర్వాత ధరలు తగ్గాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీటర్ రూ.100 క్రాస్ చేసింది. అన్ని నగరాల్లోను ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇలాంటి సమయంలో ధరలను స్వల్పంగా తగ్గించి, వినియోగదారులకు ఓఎంసీలు స్వల్ప ఊరటను ఇచ్చాయి.
దేశ రాజధాని ఢిల్లీలో నేడు పెట్రోల్ పైన 21 పైసలు తగ్గి రూ.90.78, డీజిల్ పైన 20 పైసలు క్షీణించి రూ.81.1గా ఉంది. మొన్న అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పటికీ, నిన్న దేశీయంగా స్వల్పంగా తగ్గాయి. నిన్న మాత్రం అక్కడ ధరలు తగ్గాయి. దీంతో ఓఎంసీలు వరుసగా రెండో రోజు తగ్గించాయి.

నష్టాలు... తిరిగి పూడ్చుకుంటున్నాయి
బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 70 డాలర్ల నుండి గురువారం నాడు 63.5 డాలర్లకు పడిపోయింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు 24 రోజుల పాటు ధరలను స్థిరంగా ఉంచాయి. ఇప్పుడు తగ్గిస్తున్నాయి. ముడి చమురు ధరల్లో అస్థిరత్వం, ఎన్నికలు ధరల తగ్గుదలకు కారణం. ఇటీవల కొద్ది రోజుల పాటు ధరలు ఫ్రీజ్ చేసినందున చమురు మార్కెటింగ్ కంపెనీలపై రూ.2.5 నుండి రూ.5 వరకు భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే బ్యారెల్ 70 డాలర్ల నుండి ఇప్పుడు పడిపోయినందున ఇప్పుడు ఆ నష్టాలను చమురు రంగ కంపెనీలు పూడ్చుకుంటాయని చెబుతున్నారు.

కరోనా సమయంలో పన్ను
కరోనా నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పైన వేసిన అదనపు సుంకాన్ని తగ్గించవలసి ఉంది. గత ఏడాది పెట్రోల్ పైన రూ.13, డీజిల్ పైన రూ.16 పెంచింది ప్రభుత్వం. రాష్ట్రాలు కరోనా సెస్ విధించాయి. ఇప్పుడు ఒక్కో పన్ను భారం తగ్గుతుంటే పెట్రో భారం కూడా కాస్త తగ్గనుంది.

అమెరికా నుండి పెరిగిన ఉత్పత్తి
ముడి చమురు సరఫరా, డిమాండ్ గురించి ఇటీవల ఆందోళన కలిగిస్తోంది. దీంతో చమురు ధరలు దిద్దుబాటుకు గురయ్యాయి. అక్టోబర్ చివరలో బ్యారెల్ 40 డాలర్లుగా ఉన్న చమురు ఇటీవల 70 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు స్వల్పంగా తగ్గాయి. యూరోప్‌లో కరోనా కొత్త కేసులు, అమెరికా నుండి చమురు ఉత్పత్తులు పెరుగుతాయనే ఆందోళనతో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి కోత నిర్ణయాన్ని కొనసాగిస్తున్నాయి. పెరిగిన ముడి చమురు ధరలు అమెరికా నుండి చమురు రికవరీని వేగవంతం చేసినట్లు నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications