బిట్‌కాయిన్, XRP సహా అనేక ప్రధాన క్రిప్టోకరెన్సీలు ఆదివారం అకస్మాత్తుగా కుప్పకూలడం పెట్టుబడిదారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా జరిగిన ఈ పతనం క్రిప్టో మార్కెట్‌లో ఒక్కసారిగా భయాందోళనలను రేపింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వినియోగదారులు ఈ పరిణామంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఈరోజు క్రిప్టో మార్కెట్ ఎందుకు కుప్పకూలింది?, బిట్‌కాయిన్, XRP అకస్మాత్తుగా ఎందుకు పడిపోయాయి? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.
CoinMarketCap గణాంకాల ప్రకారం.. చివరి గంటలోనే బిట్‌కాయిన్ ధర దాదాపు 3 శాతం పడిపోయింది. అదే సమయంలో Ethereum సుమారు 4 శాతం నష్టపోగా, XRP 5 శాతం కంటే ఎక్కువగా క్షీణించింది. ఈ కథనం రాసే సమయానికి ఈ గణాంకాలు నమోదు చేయబడ్డాయి. ధరలు నిమిషాల వ్యవధిలో వేల డాలర్ల మేర తగ్గడంతో మార్కెట్‌లో లివరేజ్‌తో ట్రేడింగ్ చేసిన పెట్టుబడిదారులకు భారీ నష్టాలు వచ్చాయి.

ఈ పరిణామంపై సోషల్ మీడియా వేదిక X (గతంలో ట్విట్టర్)లో ఒక యూజర్ స్పందిస్తూ.. BTC డాలర్ నిమిషాల వ్యవధిలో వేలల్లో పడిపోతోంది. మార్గమధ్యంలో అనేక లివరేజ్ ఖాతాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. బిట్‌కాయిన్‌లో లివరేజ్‌తో ట్రేడింగ్ చేస్తే ఇలాంటి పరిస్థితులు తప్పవని వ్యాఖ్యానించాడు. మరో యూజర్ క్రిప్టో మార్కెట్ ఇప్పుడే ఒక ఫ్లాష్ క్రాష్‌ను ఎదుర్కొంది అంటూ ట్వీట్ చేశాడు.
ఇక మరో వ్యక్తి చేసిన ట్వీట్ మరింత ఆందోళన కలిగించేదిగా ఉంది. గత 60 నిమిషాల్లోనే సుమారు 150 మిలియన్ డాలర్ల విలువైన లివరేజ్డ్ క్రిప్టో పొజిషన్లు లిక్విడేట్ అయ్యాయి అని అతడు పేర్కొన్నాడు. అంటే అధిక అప్పుతో పెట్టుబడులు పెట్టిన ట్రేడర్లు ఒక్కసారిగా మార్కెట్ నుంచి బయటకు వెళ్లారు.
ఈ Crypto పతనం వెనుక గ్లోబల్ మార్కెట్లలో ఏర్పడిన రాజకీయ, ఆర్థిక ఉద్రిక్తతలు కూడా కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. గ్రీన్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి అమెరికాకు అనుమతి ఇవ్వనట్లయితే ఎనిమిది యూరోపియన్ దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడంతో.. ఆదివారం అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ తీవ్రంగా పడిపోయాయి.
ఈ ప్రకటనపై యూరోపియన్ నేతలు వెంటనే స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ EU యొక్క బలమైన ప్రతీకార సాధనమైన యాంటీ-కోయర్షన్ ఇన్‌స్ట్రుమెంట్ ను అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. గత సంవత్సరం ఖరారైన వాణిజ్య ఒప్పందం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది.
అమెరికాలో సెలవు దినం కావడంతో ఈక్విటీ, బాండ్ మార్కెట్లలో ట్రేడింగ్ పరిమితంగా జరిగింది. అయినప్పటికీ S&P 500 ఫ్యూచర్స్ 0.9 శాతం, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 1.1 శాతం మేర పడిపోయాయి. నిక్కీ ఫ్యూచర్స్ ఆసియా మార్కెట్లకు కూడా బలహీనమైన ప్రారంభాన్ని సూచించాయి. జపాన్, హాంకాంగ్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఫ్యూచర్స్ సంకేతాలు ఇస్తుండగా.. ఆస్ట్రేలియన్ షేర్లు ఇప్పటికే నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
ING బ్యాంక్‌లో గ్లోబల్ మాక్రో హెడ్ కార్స్టన్ బ్రజెస్కీతో పాటు ఇతర విశ్లేషకులు ఒక నోట్‌లో మాట్లాడుతూ.. ఈ కొత్త వాణిజ్య ఉద్రిక్తతల ఫలితం ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమవుతోంది. ఇకపై వాణిజ్యం లేదా సుంకాల విషయంలో ఎలాంటి స్థిరత్వం లేదు. EU, US మధ్య పూర్తి స్థాయి వాణిజ్య యుద్ధం జరిగితే, చివరకు నష్టపోయేది అందరే అని హెచ్చరించారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications