నాడు పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు సంక్షోభంలోకి వెళుతూ తీవ్రమైన మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పెట్టుబడిదారులకు ఆశాజనకంగా ఉన్న ఏపీ ఇప్పుడు అస్థిర రాజకీయ పరిస్థితుల మధ్య నలిగిపోతోంది. రాజకీయ అస్థిరత, కుల రాజకీయాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం, భరోసాని కోల్పోతోంది ఏపీ రియల్ ఎస్టేట్. నాటి నుండి నేటి వరకు ఏపీ రాజకీయాలను ప్రధానంగా రెండు కులాలే శాసిస్తున్నాయి.
ఆ రెండు కులాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. ఆ రెండు కులాల పార్టీల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మరో కులానికి సంబధించిన పెట్టుబడిదారులలో నమ్మకం లోపిస్తోంది. దీంతో ఏపీ రియల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెడ్డి, కమ్మ సామజిక వర్గాల చుట్టూనే తిరుగుతాయనేది జగమెరిగిన సత్యం. ఈ రెండు సామాజిక వర్గాల వారే రాష్ట్రంలో అధికారం, ఆర్థిక అంశాలను నిర్ధేశిస్తున్నారు.
ఏపీ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా చంద్రబాబు వచ్చారు. అయితే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులు చాలామంది పెట్టుబడులు పెట్టడానికి భయపడ్డారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం మధ్యలో నలిగిపోవడం ఇష్టం లేని చాలా మంది రెడ్డి సామాజిక వర్గ పెట్టుబడిదారులు సైలెంట్ అయ్యారు.

ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులు పెట్టుబడులను పెట్టడం ప్రారంభించారు. ఇదే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెట్టబడుదారులు వెనక్కి తగ్గారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో పెట్టుబడి పెట్టిన సంపన్న కమ్మ సామాజిక వర్గ పెట్టుబడిదారులు జగన్ రాకతో చాలా దారుణంగా దెబ్బతిన్నారు. దీనికి కారణం జగన్ మూడు రాజధానుల ప్రస్తావనతో అమరావతి సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ దారుణంగా దెబ్బతింది. వైజాగ్ రియల్ భూమ్ అందుకుంది. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులు వైజాగ్ లో పెట్టుబడులు పెట్టారు.
ఇప్పుడు టిడిపి ప్రభుత్వం మళ్లీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే ఇది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులను ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోతోంది.మళ్లీ అమరావతిలో రియల్ బూమ్ రావడంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెట్టుబడిదారులు అక్కడ మళ్లీ లాభాల్లోకి వచ్చారు. ఇదే సమయంలో వైజాగ్ లో పెట్టుబడులు పెట్టిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఆందోళనతో ఉన్నారు. దీంతో అక్కడ రియల్ ఎస్టేట్ రంగంలో నీలినీడలు కమ్ముకున్నాయి.
ఏపీలో ఎప్పుడు ఏ ప్రభుత్వం మారుతుందో తెలియదనే భయం, రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తేవడంలో తీవ్ర అడ్డంకిగా మారింది. NRIలు కూడా ఇప్పుడు హైదరాబాద్‌లో పెట్టుబడి సురక్షితమనే భావనకు వస్తున్నారే తప్ప ఏపీ వైపు చూడటం లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో కుల రాజకీయాలు లేవని వారు విశ్వసిస్తున్నారు.
మరోవైపు ఏపీలో యువత ఎక్కువగా ఉద్యోగాలకు ఇతర నగరాలకు వలస వెళుతున్నారు.ఇక వ్యాపారాలు భారీగా హైదరాబాద్, బెంగళూరు, నగరాల్లోనే చేస్తున్నారు. ఉద్యోగ అవకాశాల కొరత, జీవన ప్రమాణాల లోపం వల్ల కొత్త స్థిరనివాసులే లేనప్పుడు, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఎలా అభివృద్ధి చెందుతుందని పలువురు చెబుుతన్నారు. దీంతో పాటు ఆర్థిక మాంద్యం కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందనే వాదనలు కూడా ఉన్నాయి.
రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో కొన్ని వర్గాలు మాత్రం తమ నిర్ణయాన్ని ప్రశ్నించుకుంటున్నాయి. ఆ సమయంలో భూమి కొన్నుంటే ఇబ్బందులు తప్పేవి కాదు అని అంటున్న వ్యాపారవేత్తలు నేడు పెట్టుబడిని మళ్లీ సమీక్షిస్తున్నారు.ఇప్పుడు AP రియల్ ఎస్టేట్‌ను ఎవరు గట్టెక్కించగలరని మనం ప్రశ్నించుకుంటే.. దీని కోసం రాజకీయ స్థిరత్వం, పారదర్శక పాలన, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి తెచ్చే ప్రయత్నాలు అవసరం. లేకుంటే, రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Amaravati: ఒకే ఒక్క ప్రాజెక్ట్.. లక్షన్నర కోట్ల పెట్టుబడి! ఏపీ తలరాత మారబోతోందా?

దుబాయ్లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications