టోకు ధరల ద్రవ్యోల్బణం ఆగస్టులో వరుసగా ఐదవ నెలలో -0.52% వద్ద ప్రతికూల స్థాయిలోనే ఉంది. జూలైలో డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం -1.36% వద్ద ఉంది. వాణిజ్యం & పరిశ్రమల మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఈ సంవత్సరం ఆగస్టులో ద్రవ్యోల్బణం ప్రతికూల రేటు మినరల్ ఆయిల్స్, బేసిక్ మెటల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్ మరియు ఫుడ్ ప్రొడక్ట్స్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణం రేటు ఆగస్టు 2023లో (-)2.37%గా ఉంది.
ఇది జూలైలో (-)2.51%గా ఉంది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం ఆగస్టులో 10.60% వద్ద రెండంకెల స్థాయిలోనే ఉంది. కానీ ఈ ఏడాది జూలైలో 14.25% కంటే తక్కువగా ఉంది. జూలై 2023తో పోల్చితే ఆగస్టు 2023 నెలలో WPI సూచికలో నెలవారీ మార్పు 0.33%గా ఉంది. కేంద్రం డేటా ప్రకారం జూలై 2023తో పోల్చితే 2023 ఆగస్టులో మినరల్ ఆయిల్స్ (4.02%), విద్యుత్ (1.79%) ధరలు పెరిగాయి.

ఫుడ్ బాస్కెట్ ధరల పెరుగుదల ఆగస్టులో 10.6 శాతంగా ఉంది. ఇది జూలైతో 14.25 శాతంగా ఉంది. అంటే ఫుడ్ బాస్కెట్ ధరల పెరుగుదల శాతం తగ్గుముఖం పట్టింది. కూరగాయలు, పప్పులు, ఉల్లి ధరలు ఇప్పటికీ అధికంగానే ఉన్నాయి. తృణధాన్యాలు (11.85 శాతం), పప్పులు మరియు ఉత్పత్తులు (13.04 శాతం), సుగంధ ద్రవ్యాలు (23.19 శాతం), పాల ఉత్పత్తుల్లో (7.73 శాతం) ద్రవ్యోల్బణం పెరుగుదల కొనసాగుతోంది.
ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం గత నెలరోజులుగా అనేక చర్యలు చేపట్టింది. 5 మిలియన్ టన్నుల గోధుమలు, 2.5 మిలియన్ టన్నుల బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో విడుదల చేయాలని నిర్ణయించింది. మినప,కంది పప్పుపై పరిమితులను విధించింది. గోధుమలు, బాస్మతీయేతర వైట్ రైస్, చక్కెరపై ఎగుమతి నిషేధం విధించింది. ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించింది.


Click it and Unblock the Notifications