ఆహార వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం డిసెంబర్ నెలలో టోకు ద్రవ్యోల్బణం రేటుపై కనిపించింది. టోకు ద్రవ్యోల్బణం డిసెంబర్లో 0.73 శాతానికి పెరిగింది. ఇది అంతకు ముందు నెలలో అంటే నవంబర్ 2023లో 0.26 శాతంగా ఉంది. ఈ టోకు ద్రవ్యోల్బణం రేటు గత 9 నెలల్లో అత్యధిక స్థాయి కావడం గమనార్హం. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు మధ్యాహ్నం టోకు ద్రవ్యోల్బణ గణంకాలు విడుదల చేసింది.
టోకు ద్రవ్యోల్బణం ఆధారిత సూచీ లేదా టోకు ద్రవ్యోల్బణం నవంబర్లో 0.26 శాతం ఉండగా, గత ఏడాది డిసెంబర్ 2022లో ఇది 5.02 శాతంగా ఉంది. టోకు ద్రవ్యోల్బణం రేటు సున్నా కంటే ఎక్కువ స్థాయికి పెరగడం ఇది వరుసగా రెండో నెల. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం డిసెంబరులో 0.73 శాతానికి పెరగడానికి ప్రధానంగా ఆహార ధరల పెరుగుదల కారణంగా చెబుతున్నారు.

WPI ద్రవ్యోల్బణం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రతికూల జోన్లో ఉంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్ 2023లో 8.18 శాతం నుంచి డిసెంబర్లో 9.38 శాతానికి పెరిగింది. కూరగాయల ద్రవ్యోల్బణం 26.30 శాతంగా ఉంది. పప్పుధాన్యాల ద్రవ్యోల్బణం 19.60 శాతంగా ఉంది. గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం డిసెంబర్లో రిటైల్ లేదా వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (CPI) ప్రింట్ 4 నెలల గరిష్ట స్థాయి 5.69 శాతానికి పెరిగింది.
ఇంధనం, తయారు చేసిన ఉత్పత్తులతో సహా అన్ని ప్రధాన సమూహాల సూచిక గత నెల నెలవారీగా క్షీణించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications