Wholesale Inflation: మార్చిలో పెరిగిన టోకు ద్రవ్యోల్బణం.. కారణం ఆ రెండే..!
Inflation News: కూరగాయలు, బంగాళదుంపలు, ఉల్లిపాయలతో పాటు ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశంలో టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 0.20 శాతం నుంచి మార్చిలో 0.53 శాతానికి స్వల్పంగా పెరిగింది. టోకు ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు నిలకడగా సున్నా కంటే తక్కువగానే ఉంది.
వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ఆల్ ఇండియా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్(WPI) డేటా ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణం మార్చి 2024లో 0.53 శాతంగా ఉంది. బంగాళాదుంప ద్రవ్యోల్బణం మార్చి 2023లో 25.59 శాతం నుంచి 2024 మార్చిలో 52.96 శాతానికి పెరిగింది. ఇదే క్రమంలో ఉల్లి ద్రవ్యోల్బణం మార్చి 2023లో మైనస్ 36.83 శాతం నుంచి 56.99 శాతానికి చేరుకుంది. ఈ రెండు వస్తువుల ధరలు మార్చిలో ద్రవ్యోల్బణం స్వల్పంగా పెరగటానికి కారణమయ్యాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా ఈ ఏడాది మార్చిలో ముడి పెట్రోలియం విభాగంలో ద్రవ్యోల్బణం 10.26 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ ఏడాది మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్ట స్థాయి 4.85 శాతానికి తగ్గింది. ప్రధానంగా ఆహార ధరలు తగ్గుముఖం పట్టడం దీనికి కారణంగా నిలిచింది. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతానికి పెరిగింది. ఫిబ్రవరిలో 5.09 శాతంగా ఉంది. అలాగే ఫిబ్రవరిలో 8.66 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గి మార్చిలో 8.52 శాతానికి చేరుకుంది.
ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 4.5 శాతంగా ఉంటుందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. ఏడు నెలలుగా రిటైల్ ద్రవ్యోల్బణం 2-6 శాతం వరకు ఉంది. అయినప్పటికీ సెంట్రల్ బ్యాంక్ తన పాలసీ వడ్డీ రేటు రెపోను తగ్గించలేదు. ఈ నెలలో వరుసగా ఏడవ ద్వైమాసిక సమీక్ష కోసం 6.5 శాతం వద్ద కొనసాగించింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం విషయంలో ఎలాంటి సడలింపులు ఇచ్చే ఆలోచనలో ఆర్‌బీఐ లేదు.


Click it and Unblock the Notifications